Facebook నుంచి Snooze ఫీచర్ …

Updated on 19-Dec-2017

యూజర్లకు ఫేస్బుక్  కొత్త స్నూజ్ ఫీచర్ తీసుకువస్తుంది . ఈ ఫీచర్ ద్వారా  వినియోగదారులు తమ న్యూస్ ఫీడ్ లో   మీరు చూసే కంటెంట్ నియంత్రించడానికి అనుమతిస్తుంది. నివేదికల ప్రకారం, ఈ ఫీచర్  ఇప్పుడు టెస్టింగ్ లో వుంది .
ఫేస్బుక్ యొక్క ఈ  ఫీచర్ లో యూజర్ ఏ పేజీ, గ్రూప్  లేదా యూజర్ కి  టెంపరరీ గా అన్ ఫాలో చేయవచ్చు . ఈ సమయం 30 రోజులు ఉంటుంది, దీనిలో వ్యక్తి తన కంటెంట్ తన వాల్ మరియు న్యూస్ ఫీడ్లో చూడలేరు. పోస్ట్ యొక్క కుడి వైపున డ్రాప్ డౌన్ మెనులో ఈ లక్షణాలు కనిపిస్తాయి.

ఈ ఫీచర్ యాక్టివేట్ చేసిన తర్వాత, తమ న్యూస్ ఫీడ్ లో ఆ గ్రూప్ , పేజీ లేదా వినియోగదారు యొక్క కంటెంట్ను లిమిటెడ్ పీరియడ్ లో వీక్షించలేరు. ఈ ఫీచర్ యూజర్ న్యూస్  ఫీడ్లను నియంత్రించే హక్కును అందిస్తుంది,ఫేస్బుక్ యొక్క ఈ ఫీచర్ ద్వారా మీరు చూడాలనుకుంటున్నది మాత్రమే చూడవచ్చు.

 

 

 

Connect On :