ఫేస్ బుక్ లో “Others” మెసేజెస్ రిప్లేస్ చేస్తూ మెసేజ్ రిక్వెస్ట్ ఫీచర్..
ఫేస్ బుక్ కొత్తగా మెసేజ్ రిక్వెస్ట్స్ ఫీచర్ ను ప్రవేసపెట్టింది మెసెంజర్ అప్లికేషన్ కు. దీని ఉపయోగం – ఫేస్ బుక్ లో మీ ఫ్రెండ్ కాని వారితో కూడా ఈజీగా చాట్ ద్వారా కనెక్ట్ చేయటం.
ఇప్పటివరకూ ఫేస్ బుక్ లో మన ఫ్రెండ్స్ కాని వారికీ మెసేజ్ చేస్తే, వారి others ఫోల్డర్ లోకి వెళ్లేవి మెసేజెస్. సో దాని వలన వారికి మనం మెసేజ్ పంపిన విషయమే తెలిసేది కాదు.
ఇప్పుడు others ఆప్షన్ ను రిప్లేస్ చేస్తూ మెసేజ్ రిక్వెస్ట్ ఫీచర్ పనిచేస్తుంది. ఫ్రెండ్ రిక్వెస్ట్ మాదిరిగానే, మీరు strangers కు మెసేజ్ చేస్తే, వారికీ మెసేజ్ రిక్వెస్ట్ వెళ్తుంది.
accept or ignore ఆప్షన్స్ ద్వారా అవతల వ్యక్తి మీతో చాట్ చేస్తారు. ignore చేస్తే మీరు అవతల వ్యక్తి కి మెసేజ్ చదివి నట్టు కూడా చూపించదు. ఇది బిజినెస్ అండ్ useful కమ్యూనిటిస్, ఓల్డ్ ఫ్రెండ్స్ కు ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ కొత్త ఫీచర్ పై డేవిడ్ మార్కస్ తన ఫేస్ బుక్ పేజ్ లో అనౌన్స్ చేశారు.
ఆధారం: ఫేస్ బుక్