Facebook కొత్త వీడియో కాలింగ్ APP తెచ్చింది : ఇది Zoom మరియు గూగుల్ మీట్ వంటి వాటికీ గట్టి పోటీకానుంది
ఈ అప్లికేషన్ జూమ్ మరియు గూగుల్ మీట్ వంటి యాప్స్ కి ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది.
భారతదేశం లాక్ డౌన్ చివరి దశకి చేరుకున్నాక కూడా, కొన్ని కొత్త ఉత్పత్తులను విడుదల చేసేటప్పుడు కంపెనీలు వెనకడుగు వెయ్యేడం లేదు. వీడియో కాలింగ్ బ్యాండ్ వాగన్ లో ఫేస్‌బుక్ ఉంది. ఈ సోషల్ మీడియా దిగ్గజం వీడియో కాలింగ్ యాప్ ను విడుదల చేసింది. ఇది సమయ పరిమితులు లేకుండా ఒకేసారి 50 మంది గ్రూప్ కలిగి ఉంటుంది. మెసెంజర్ రూమ్స్ గా పిలువబడే ఈ అప్లికేషన్ జూమ్ మరియు గూగుల్ మీట్ వంటి యాప్స్ కి ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది.
మెసెంజర్ రూరూమ్స్, ఫేస్‌బుక్ సభ్యులకు 50 మంది వరకు అన్లిమిటెడ్ టైం వరకు ఉంచగల పబ్లిక్ లేదా ప్రైవేట్ వీడియో చాట్‌రూమ్ లను సృష్టించే అవకాశాన్ని ఇస్తాయి. దీనికి దగ్గరి ప్రత్యర్థి అయిన, జూమ్ కాల్స్ 100 మంది పాల్గొనేలా, వారిని 40 నిమిషాలు వరకూ ఉంచగలవు. మీకు ఫేస్ బుక్ అకౌంట్ లేకున్నా సరే మీరు మెసెంజర్ రూమ్ లో చేరవచ్చు. ఇది సంస్థకు చాలా అరుదైన చర్య. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ జూమ్ వంటి యాప్స్ కి సంబంధించి లైవ్ స్ట్రీమ్‌లో మాట్లాడుతూ, “గత కొన్ని వారాలుగా నేను దీని కోసం గడిపిన చాలా సమయం మేము దీనిని నిర్మిస్తున్నప్పుడు మరియు అందుబాటులోకి తేవడానికి ప్రైవసీ, సెక్యూరిటీ, సమగ్రత సమీక్షలు మరియు జూమ్ చుట్టూ సమస్యాత్మకంగా ఉన్న చాలా విషయాలు ఇక్కడ ప్రతిరూపం కావు అని మేము నిర్ధారిస్తాము. ”
ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఫీచర్ ను ఫేస్‌బుక్ జోడిస్తోంది. దానిని లైవ్ అని పిలుస్తారు, వినియోగదారులు వారితో స్ట్రీమ్ చేయడానికి ఇతర వ్యక్తులను ఆహ్వానించవచ్చు. ఇటీవల ఫేస్‌బుక్ గేమింగ్ తో గేమింగ్ ప్రపంచంలోకి కూడా దూసుకెళ్లింది. మీరు దానిని ఇక్కడ చూడవచ్చు.