'M' అనే పేరుతో ఫేస్ బుక్ కొత్తగా virtual అసిస్టంట్ ను అఫిషియల్ గా లాంచ్ చేసింది. ఇది కూడా ఇప్పటివరకూ ఉన్న గూగల్ నౌ మరియు ఆపిల్ సిరి వంటి వాటి వలె పనిచేస్తుంది.
కాని వాటి కన్నా ఎక్కువ పనులను చేసిపెడుతుంది. వస్తువులను కొనటం, ట్రావెల్ arrangements చూడటం, టికెట్స్ బుక్ చేయటం, గిఫ్ట్స్ డెలివర్ చేయటం, అప్పాయింట్మెంట్స్.. etc చేస్తుంది M.
దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మనం M కు చెప్పే పనులు చేయటానికి బ్యాక్ గ్రౌండ్ లో రియల్ పీపుల్ పనిచేస్తారు. వీళ్ళను M ట్రయినర్స్ అని పిలుస్తుంది ఫేస్ బుక్.
M పర్సనల్ అసిస్టంట్, ఫేస్ బుక్ మెసెంజర్ యాప్ లో ఉంటుంది. యాప్ క్రింది భాగంలో స్మాల్ బటన్ పై tap చేసి దీనిని వాడగలరు. ప్రస్తుతం san francisco ఫేస్ బుక్ ఎంప్లాయిస్ దీనిని వాడుతున్నారు.
అయితే ఇది ముందుగా ఏ దేశాలలో రిలీజ్ అవుతుందో ఇంకా వెల్లడించలేదు ఫేస్ బుక్. టెస్టింగ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యింది, సో త్వరలోనే రావచ్చు. తాజాగా మ్యూజిక్ సర్వీస్ కోసం లాంచ్ చేసిన మొమెంట్స్ యాప్, ఇండియన్ రీజియన్ కు రిలీజ్ చేసింది ఫేస్ బుక్.