టిక్ టాక్ కి పోటీగా ఫేస్ బుక్ Collab తెస్తోందా?
ఈ యాప్ తో TIKTOK యూజర్ బేస్‌ను నేరుగా లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది.
టిక్‌టాక్ యాప్ కు ఈ Collab తదుపరి ప్రత్యర్థి అవుతుందా
కేవలం అతితక్కువ కాలంలో, TIKTOK సాధించిన భారీ విజయాన్ని సాధించే ప్రయత్నంలో, Facebook యొక్క కొత్త ప్రోడక్ట్ ప్రయోగాత్మక బృందం వారు వాస్తవానికి బిటి టిక్‌టాక్ నుండి ప్రేరణ పొందిన యాప్ కోసం పనిచేస్తున్నట్లు వెల్లడించారు. Collab గా పిలువబడే ఈ యాప్, వినియోగదారాలు చిన్న మ్యూజిక్ వీడియోలను క్రియేట్ చెయ్యడానికి ,మరియు షేర్ చేసే విధంగా వుంటుంది. ఈ యాప్ బీటా టెస్టింగ్ దశలో ఉంది మరియు ప్రస్తుతానికి iOS లో మాత్రమే invite చేస్తోంది. ఇక్కడ ఫేస్‌బుక్, ఈ యాప్ తో TIKTOK యూజర్ బేస్‌ను నేరుగా లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది.
The Verge యొక్క నివేదికలో, క్రొత్త కంటెంట్ రూపొందించడానికి కళాకారులు ఒకరితో ఒకరు సహకరించడం కోసం ఈ యాప్ ఉంటుంది. Facebook యొక్క అధికారిక బ్లాగ్ పోస్ట్ లో కంపెనీ ఇలా చెప్పింది, “Collabs అనేవి మూడు స్వతంత్ర వీడియోలు, అవి sync తో పాలీ అవుతాయి . ఈ యాప్, మీరు మీ స్వంత రికార్డింగ్ చెయ్యడం లేదా జోడించడంతో మీ వీడియోను క్రియేట్ చెయ్యవచ్చు.
దీనికి,సంగీత అనుభవం అవసరం లేదు. ” మనం చూసిన మరియు చదివిన దాని నుండి, కంటెంట్ అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేయదగినది. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఈ యాప్ ముగ్గురు వేర్వేరు వినియోగదారులను ఒక పాటలో వివిధ వాయిద్యాలను ప్లే చేయడానికి అనుమతిస్తుంది మరియు యాప్ వాటిని ఒకే వీడియోలో సవరించుకుంటుంది.
కాబట్టి, ఇప్పటికే ప్రాచుర్యంలో వున్నా టిక్‌టాక్ యాప్ కు ఈ Collab తదుపరి ప్రత్యర్థి అవుతుందా అని మనం వేచి చూడాలి. వాస్తవానికి, Facebook ఇటీవల CatchUp అనే ఆడియో-మాత్రమే చాటింగ్ యాప్‌ను కూడా ప్రారంభించింది. దీని గురించి మీరు ఇక్కడ మరింత చదువుకోవచ్చు.