ఫేస్బుక్ దాని యొక్క న్యూస్ ఫీడ్ వేగవంతం చేయటం కోసం మొబైల్ అప్లికేషన్ లో తక్షణ వ్యాసాలు అనే అంశాన్ని ప్రారంభించారు. కొత్త ఫీచర్ వ్యాసాలు ఫేస్బుక్ యొక్క అప్లికేషన్ లో 10 రెట్లు వేగవంతంగా లోడ్ అవుతాయి. మాములగా మొబైల్ వెబ్ లో ఎనిమిది సేకేన్లు సమయానికి లభించే ఆర్టికల్స్ ఫేస్బుక్ తక్షణ వ్యాసాలలో ఆ సమయాన్ని తీసుకోకుండా వేగంగా లోడ్ అవుతాయి అని ఫేస్బుక్ చెబుతుంది.
ది న్యూ యార్క్ టైమ్స్, నేషనల్ జాగ్రఫిక్, BBC న్యూస్, సహా ప్రముఖ ప్రచురణకర్తలు నుండి కంటెంట్ ను తమ ఆప్ లో జోడించినుండి ఫేస్బుక్. గత కొన్ని నెలలుగా థర్డ్ పార్టీ న్యూస్ ఫీడులు ఫేస్బుక్ ఆప్ లో జోడిస్తే, తమ సొంత అఫీషియల్ ప్లాట్ఫార్మ్ లపై వాళ్ల ట్రాఫిక్ తగ్గుమొఖం పడుతుంది అనే ప్రచురణకర్తల సందేహాల పై చర్చలు జరిపిన తరువాత, ఫేస్బుక్ ఈ ఫీచర్ గురించి అధికారిక ప్రకటన చేసింది.
ఫేస్బుక్ ప్రచురణకర్తలకు వాళ్ల సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఆర్టికల్స్ మధ్యన ఏడ్స్ ను అమ్ముకొనే అవకాశం కూడా ఇస్తుంది. తద్వారా వచ్చే ఏడ్ రెవెన్యూ పూర్తిగా ప్రచురణకర్తలకే ఇస్తుంది. ప్రతీ ఆర్టికల్ పైన చివరన ఆ ప్రచురణకర్త పేజ్ లోగో తో పాటు 'ఫాలో' బటన్ ను యూజర్లు చూసి అక్కడ నుండే ఫాలో అయ్యే అవకాశం జోడించింది ఫేస్బుక్. ఆ ఆర్టికల్స్ ను వ్రాసిన రచయితలు ప్రొఫైల్స్ ను సైతం మీరు ఫాలో అవ్వచ్చు.
ఆర్టికల్స్ మధ్యలో ప్రచురణకర్తలు ట్వీట్స్ మరియు ఇంటరాక్టివ్ గ్రాఫిక్స్ ను జోడించగలరు. "ఫేస్బుక్ తీసుకువస్తున్న ఈ కొత్త ఫీచర్ వలన ప్రచురణకర్తల న్యూస్ ఆర్టికల్స్ చాల త్వరగా నెటిజన్లకు చేరుతుంది" అని ఫేస్బుక్ చీఫ్ ప్రాడక్ట్ అధికారి 'క్రిస్ కాక్స్' అన్నారు. తాజా అధ్యయనలలో, 50వార్తల సైట్లులో 39 ఇప్పుడు డెస్క్టాప్ వినియోగదారులు కంటే మొబైల్ వినియోగదారుల నుండి ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది అని కనుగొన్నారు.
మూలం: ఫేస్బుక్