ప్రతి Paytm యూజర్ ఈ భద్రతా విషయం గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి
KYC సాకుతో హ్యాకర్లు మీమ్మల్ని మోసం చేసి ఖాతాను ఖాళీ చేయవచ్చు.
ఇటువంటి మోసాలను నివారించడానికి ఈ విషయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి
మీ నుండి సమాచారం తీసుకొని మీ అకౌంట్ ని హ్యాక్ చేసే ప్రమాదం వుంది.
Digital payments మన జీవితాలను చాలా సులభం తరం చేశాయి. ఆన్ లైన్ షాపింగ్ నుండి మొదలుకొని బిల్స్ చెల్లింపు వరకూ, అన్ని పనులను కూడా ఇంటి నుండి కదలకుండానే చక్కపెట్టేయవచ్చు. అయితే, వీటితో ఎక్కువ సౌలభ్యం వున్నాకూడా ఏంతో కొంత ప్రమాదం కూడా ఉంటుంది. ఒక వైపు, అన్ని డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫారమ్స్ కూడా ప్రతిదీ సురక్షితమని పేర్కొన్నా కూడా, హ్యాకర్లు మాత్రం మీ అకౌంట్ ను హ్యాక్ చేసే ప్రమాదం మాత్రం లేకపోలేదు.
అదే, Paytm విషయానికి వస్తే, హ్యాక్ చేసే ప్రమాదం లేక పోయినా KYC సాకుతో హ్యాకర్లు మీమ్మల్ని మోసం చేసి ఖాతాను ఖాళీ చేయవచ్చు. కాబట్టి, ఇటువంటి మోసాలను నివారించడానికి ఈ క్రింది విషయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి …
ఈ ట్రాక్ ను ఉపయోగించి చాలా మంది వ్యక్తుల Paytm ఖాతాలను హ్యాకర్లు హ్యాక్ చేశారు. ఈ ఉపాయంతో, స్కామర్లు ముందుగా KYC ధృవీకరణ గురించి వినియోగదారులకు కాల్ చేయడం లేదా మెసేజ్ పంపడం ద్వారా భయపెడతారు. ఈ విధంగా, వినియోగదారులను భయపెట్టి వారి నుండి వారి సమాచారాన్ని తీసుకొని హ్యాకర్లు యూజర్ల అకౌంట్ కి యాక్సెస్ పొందుతారు.
2019 డిసెంబర్‌లో పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఇటువంటి మోసపూరిత మెసేజెస్ గురించి ట్వీట్ కూడా చేశారు. తన ట్వీట్‌లో ఇలాంటి మెసేజెస్ వలలో చిక్కుకోవద్దని హెచ్చరించారు. శేఖర్ శర్మ, మీ Paytm ఖాతాను బ్లాక్ చేయడం గురించి లేదా KYC సలహా కోసం వచ్చిన మెసేజిలను నమ్మవద్దు. అవి మీ అకౌంట్ యాక్సెస్ కోరుకునే మోసగాళ్ళు పంపినవి, కాబట్టి దీని గురించి దయచేసి రీట్వీట్ చేయండి. " అని విన్నవించారు.
Paytm మోసాన్ని ఎలా నివారించాలి?
"Dear customer, your Paytm wallet is blocked and held." మీ ఖాతా యొక్క PAYTM KYC ని పూర్తి చేయండి. కస్టమర్ కేర్ 7827520873 ని సంప్రదించండి, అని మీకు మెసేజ్ వస్తే.
మీరు ఇప్పటికే KYC పూర్తి చేసి ఉంటే, అటువంటి మెసేజ్ ని విస్మరించండి మరియు దాని గురించి Paytm కు రిపోర్ట్ చేయండి. ఆయితే, నిజమైన మెసేజ్ ఎలా ఉంటుందో అని మీరు ఆలోచిస్తున్నట్లయితే, ఈ మెసేజ్ సాధారణ నంబర్ కు బదులుగా "VK-PAYTM" నుండి వచ్చినట్లుగా మీరు గుర్తించవచ్చు