Dor Play: 300 టీవీ ఛానల్స్ మరియు 20+ OTT లను సింగిల్ క్లిక్ తో అందించే సూపర్ యాప్ వచ్చేస్తోంది.!
Dor Play లాంచ్ చేస్తున్న స్ట్రీమ్ బాక్స్ మీడియా
20+ OTT లను సింగిల్ క్లిక్ తో అందించే సూపర్ యాప్ Dor Play
ఇప్పటికే స్మార్ట్ టీవీ లలో అందుబాటులో ఉన్న ఈ సర్వీస్ మొబైల్ ఫోన్ లను కూడా చేరుకోబోతోంది
Dor Play: ఇండియాలో మొదటి సబ్ స్క్రిప్షన్ ఆధారిత టీవీ సర్వీస్ ను అందించిన స్ట్రీమ్ బాక్స్ మీడియా, ఇప్పుడు మొబైల్ ఫోన్స్ కోసం కూడా కొత్త అప్లికేషన్ ను తీసుకు వస్తోంది. డోర్ ప్లే పేరుతో ఈ అప్ కమింగ్ యాప్ ను తీసుకు వస్తోంది. ఇప్పటికే స్మార్ట్ టీవీ లలో అందుబాటులో ఉన్న ఈ సర్వీస్ ఇక నుండి యాప్ రూపంలో మొబైల్ ఫోన్ లను కూడా చేరుకోబోతోంది.
Dor Play: లాంచ్
డోర్ ప్లే యాప్ ను ఫిబ్రవరి 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తున్నట్లు స్ట్రీమ్ బాక్స్ మీడియా అనౌన్స్ చేసింది. వాస్తవానికి, ఇటీవలే ఈ సబ్ స్క్రిప్షన్ ఆధారిత టీవీ సర్వీస్ ను ప్రారంభించింది మరియు ఈ సర్వీస్ ను ఇప్పుడు మొబైల్ ఫోన్ లకు కూడా విస్తరిస్తోంది.
ఈ యాప్ లాంచ్ డేట్ కన్ఫర్మేషన్ తో పాటు ఈ యాప్ తో 20 కి పైగా OTT లను ఆఫర్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ యాప్ లాంచ్ కోసం అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఈ యాప్ తో Disney+ Hotstar OTT అందిస్తుందని కన్ఫర్మ్ అయ్యింది. వాస్తవానికి, టీవీ సర్వీస్ లో 24 OTT లను అందిస్తోంది. మొబైల్ యాప్ కోసం ప్రస్తుతానికి 21 OTT లను ఆఫర్ చేస్తున్నట్లు యాప్ ద్వారా లిస్ట్ చేసింది.
కానీ, విడివిడిగా ఒక్కో OTT సబ్ స్క్రిప్షన్ తీసుకునే పని లేకుండా ఈ ఒక్క యాప్ తో అన్ని OTT లను ఒకే వద్ద అందుకోవచ్చు. అయితే, ఈ యాప్ తో ఫ్రీ గా OTT లను ఎంజాయ్ చేయవచ్చని మాత్రం అనుకోకండి. ఈ యాప్ తో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేయాలంటే సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలి. ఈ సబ్ స్క్రిప్షన్ ను Flipkart ద్వారా అందిస్తోంది మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ మొబైల్ యాప్ సబ్ స్క్రిప్షన్ అందుబాటులోకి వస్తుంది.
ఇక ముందుగా లాంచ్ చేసిన ఈ టీవీ సర్వీస్ విషయానికి వస్తే, ఈ సర్వీస్ తో 300 కి పైగా టీవీ ఛానల్స్ మరియు 24 OTT ప్లాట్ ఫామ్స్ ను ఈ సర్వీస్ ద్వారా ఒకే వద్ద ఆఫర్ చేస్తోంది. అంటే, డోర్ ప్లే టీవీ సర్వీస్ తీసుకున్న యూజర్ OTT ల కోసం విడివిడిగా సబ్ స్క్రిప్షన్ తీసుకునే లేకుండా ఈ సర్వీస్ ఆఫర్ చేస్తున్న 24 OTT లను ఎంజాయ్ చేయవచ్చు.
Also Read: Super Deal: బిగ్ డిస్కౌంట్ తో చవక ధరకే లభిస్తున్న పవర్ ఫుల్ 5.1 Dolby Soundbar
ఇది మాత్రమే కాదు 300 టీవీ ఛానల్స్ కూడా యాక్సెస్ అందుకుంటారు. ఈ టీవీ సర్వీస్ (43inch) కోసం నెలకు 799 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో Prime Video మరియు డిస్నీ+ హాట్ స్టార్ మొదలుకొని ZEE5 మరియు Sonyliv తో సహా 24 ప్రముఖ OTT లు ఉంటాయి.