Whatsapp: వాట్సాప్ చాలా వేగంగా కొత్త ఫీచర్లను వరుసగా విడుదల చేస్తోంది. ఇప్పుడు కూడా వాట్సాప్ ఒక మూడు కొత్త ఫీచర్లను జత చేసింది. మరి, కొత్తగా వాట్సాప్ లో వచ్చిన ఈ 3 కొత్త ఫీచర్ల గురించి మీకు తెలుసా? ఒకవేళ తెలియకుంటే ఈరోజు తెలుసుకోండి. అసలు ఏమిటా కొత్త ఫీచర్లు అనుకుంటున్నారా? కంగారు పడకండి ఈరోజు వాటిని గురించి వివరంగా తెలుసుకోవచ్చు.
వాట్సాప్ లో రీసెంట్ గా Chat Lock, Message Editing మరియు One Whatsapp Multiple Phones మూడు ఉపయోగకరమైన ఫీచర్లను అందించింది. ఈ ఫీచర్స్ గురించి ఈరోజు ఇక్కడ చూడవచ్చు.
వాట్సాప్ లో యాడ్ అయిన ఈ కొత్త చాట్ లాక్ ఫీచర్ మీ పర్సనల్ చాట్ ను దాచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ మీ ఫోన్ లో సెట్ చేసుకోవాలంటే, మీరు లాక్ చేయదలచిన కాంటాక్ట్ పైన నొక్కగానే క్రింద డిజప్పియరింగ్ మెసేజెస్ క్రింద ఈ అప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ సైడ్ లో ఉండే టోగుల్ ను నొక్కడం ద్వారా ఈ ఫీచర్ను ఎనేబుల్ చేసుకోవచ్చు.
వాట్సాప్ అందించిన ఈ కొత్త ఫీచర్ తో మీరు పంపించిన మెసేజీలో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేదా తప్పులు ఉంటే ఆ మెసేజీని సరిచేసే వీలుంటుంది. దీనికోసం, మీరు పంపిన మెసేజ్ పైన లాంగ్ ప్రెస్ చేసిన తరువాత మీకు ఈ Edit అప్షన్ కనిపిస్తుంది. అయితే, ఇది కేవలం 15 నిముషాల లోపల మాత్రమే ఎడిట్ చేసే వీలుంటుంది.
వాట్సాప్ యూజర్ల కోరిక పైన ఈ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ తో మీరు ఓకేసారి ఒకే నంబర్ పైన నాలుగు ఫోన్లలో వాట్సాప్ లాగిన్ అవ్వవచ్చు మరియు ఉపయోగించవచ్చు. దీనికోసం, మీరు ఒక మీరు ఉపయోగించే ప్రైమ్ ఫోన్ నుండి మిగిలిన ఫోన్లను యాడ్ చేసే వీలుంటుంది. అయితే, ప్రైమ్ ఫోన్ లో వాట్సాప్ అకౌంట్ ఎక్కువ రోజులు ఇన్ యాక్టివ్ గా ఉంటే మాత్రం మిగిన ఫోన్లలో లాగ్ అవుట్ అయిపోతుంది.