వాట్స్ అప్ నిన్న అఫీషియల్ గా డెస్క్ టాప్ యాప్ ను రిలీజ్ చేసింది విండోస్ అండ్ ఆపిల్ PC మరియు లాప్ టాప్స్ కు. ఇది రిలీజ్ అయ్యి చాలా కాలం అయ్యింది కాని దీని గురించి ఇంకా చాలా మందికి తెలియదు.
ఈ లింక్ లో నుండి అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా మీరు యాప్ ను డౌన్లోడ్ చేసుకోగలరు. ఇది విండోస్ 8 పైనే పనిచేస్తుంది. మాక్ లో 10.9 వెర్షన్ పై పనిచేస్తుంది. (MAC అంటే ఆపిల్ ఆపరేటింగ్ సిస్టం కలిగిన PC's.)
ఆల్రెడీ వాట్స్ అప్ ఇంటర్నెట్ బ్రౌజర్ ద్వారా డెస్క్ టాప్ లో అందుబాటులో ఉంది. దీనిని వెబ్ client అంటారు. కాని ఇప్పుడు సొంతగా యాప్ ను డెవలప్ చేసింది.
యాప్ ద్వారా proper వాట్స్ అప్ నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే వాట్స్ అప్ వాడటానికి ఇక నుండి బ్రౌజర్ ఓపెన్ చేసి ఉంచుకోనవసరం లేదు.
యాప్ లో అదనంగా వెబ్ క్లైంట్ లో లేని కొత్త ఆప్షన్స్ అంటూ ఏమీ లేవు. డెస్క్ టాప్ యాప్ .exe ఫైల్ తో వచ్చే సెట్ అప్ ఫైల్.
మీరు జస్ట్ సెట్ అప్ ఫైల్ (సాఫ్ట్ వేర్) ను ఇంస్టాల్ చేసుకుంటే సేమ్ వెబ్ క్లైంట్ లానే బార్ కోడ్ చూపించి స్కాన్ చేయమని అడుగుతుంది మీ ఫోన్ లోని వాట్స్ అప్ ద్వారా.
స్కాన్ అయిపోతే, యాప్ లో వాట్స్ అప్ ఓపెన్ అయిపోతుంది. విండో లో ఉంటుంది యాప్. యాప్ సైజ్ 62MB ఉంది. వాట్స్ అప్ డెస్క్ టాప్ క్లైంట్ ను ఈ లింక్ https://web.whatsapp.com/ లో access చేయగలరు