Apps: ఈ 4 యాప్స్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చెయ్యండి..!
ఈ 4 యాప్స్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చెయ్యండి
ఈ 4 యాప్స్ హిడెన్ యాడ్స్ ట్రోజన్ ద్వారా ప్రభావితమైనవి
మీ డివైజ్ కు హాని కలిగించే విధంగా ఈ యాప్స్ పనిచేస్తాయి
Apps: ఈ 4 యాప్స్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చెయ్యండి. ఎందుకంటే, ఈ 4 యాప్స్ కూడా హిడెన్ యాడ్స్ ట్రోజన్ ద్వారా ప్రభావితమైనవిగా, Malwarebytes ల్యాబ్ గుర్తించింది. ఈ యాప్స్ ఇన్స్టాల్ చేసిన వారి సమాచారాన్ని లేదా డివైజ్ కు హాని కలిగించే విధంగా ఈ యాప్స్ పనిచేస్తాయి. అందుకే, ఈ నాలుగు యాప్స్ మీ ఫోన్ లో ఉంటే డౌన్ లోడ్ చేసుకొని ఉంటే, వెంటనే తొలగించమని సలహా ఇస్తోంది. ఈ యాప్స్ పేర్లు మరియు వాటితో మీ డివైజ్ పైన పడే ప్రభావం గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
గత నెల ప్రారంభంలో, గూగుల్ ప్లే స్టోర్‌లో జాబితా చేయబడిన 400 హానికరమైన యాప్‌లు యూజర్ లాగిన్ సమాచారం మరియు వివరాలను దొంగిలించాయని, ఫేస్ బుక్ తన యూజర్లను హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇక నెల తరువాత, Malwarebytes ల్యాబ్ హిడెన్ యాడ్స్ ట్రోజన్ సోకిన ఒక నాలుగు యాప్ లను హైలైట్ చేసింది. అంటే, ఈ నాలుగు యాప్స్ ద్వారా మీ డేటా చౌర్యానికి గురయ్యే అవకాశం ఉందని ఈ ల్యాబ్ చెబుతోంది. Google Play Store లో వ్యక్తిగత లేదా ఒక గ్రూప్ యాప్‌లు హానికరమైనవిగా గుర్తించబడటం మనం తరచుగా చూస్తాము. ఇప్పుడు ఇదే తరగలో ఈ నాలుగు యాప్స్ లను కొత్త బ్యాచ్ గా Malwarebytes ల్యాబ్ గుర్తించింది. ఈ యాప్ పేరును క్రింద చూడవచ్చు.
ఈ యాప్స్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి
1. Bluetooth Auto Connect
2. Bluetooth App Sender
3. Driver: Bluetooth, Wi-Fi, USB
4. Mobile transfer: smart switch
Malwarebytes ప్రకారం, ఈ యాప్ లను డౌన్‌లోడ్ చేసిన 72 గంటలలోపు ఎలాంటి హానికరమైన ప్రవర్తనను చూపించలేదు. అయితే, ఆ తరువాతే ఈ యాప్‌లు Chrome లో ఫిషింగ్ సైట్‌లను తెరుస్తాయి. ఇక్కడ వినియోగదారులు ప్రకటనలపై క్లిక్ చేస్తే దాని ద్వారా ఆదాయాన్ని పొందుతాయి. వీటిలో కొన్ని యాడ్స్ లేదా సైట్స్ అంత ప్రమాదకరమైనవి కాకపోయినా, కొన్ని ఇతర సైట్‌లు మాత్రం ప్రమాదకరమైనవి. ఇవి కొత్త అప్డేట్ కోసం క్లిక్ చేయండి, అంటూ యూజర్లను మోసగించడానికి ప్రయత్నిస్తుంది.
మాల్వేర్‌బైట్స్ ల్యాబ్స్ విశ్లేషకుడు నాథన్ కొల్లియర్, ఈ డెవలపర్ గతంలో Google Play లో మాల్వేర్‌ను వ్యాప్తి చేశారని పేర్కొన్నారు. అయితే, ఈ ప్రసిద్ధ బ్లూటూత్ ఆటో కనెక్ట్ యాప్ యొక్క కొన్ని వెర్షన్లు మాత్రం గతంలో క్లీన్ గా ఉన్నాయని కూడా పేర్కొన్నాడు.