ఈ రెండు యాప్స్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చెయ్యండి.!

ఈ రెండు యాప్స్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చెయ్యండి.!
HIGHLIGHTS

ఫోన్ లో డేటాని చైనాకి చేరవేస్తున్నఒక 2 యాప్స్

ఈ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ నుండి 1.5M డౌన్ లోడ్స్ ను కూడా సాధించాయి

ప్రముఖ మొబైల్ సెక్యూరిటీ కంపెనీ తన బ్లాగ్ ద్వారా తెలియ చేసింది

ఈ రెండు యాప్స్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చెయ్యండి. ఎందుకంటే, యూజర్ల కాంటాక్ట్, ఫోటోలు, ఆడియో మరియు వీడియో ఫైల్స్ తో పాటుగా మరిన్ని సున్నితమైన వివరాలను ఈ యాప్స్ చైనా కు చేరవేస్తునట్లు ప్రముఖ మొబైల్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. ఈ రెండు యాప్స్ కూడా చైనా కి చెందిన ఒకే డెవలపర్ కి చెందినవిగా గుర్తించారు. ఈ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ నుండి 1.5M డౌన్ లోడ్స్ ను కూడా సాధించాయి.

ఈ యాప్స్ వివరాల్లోకి వెళితే, చైనాకు చెందిన యాప్ డెవలపర్ (వాంగ్ టామ్) రూపొందించిన File Developer and data recovery మరియు file manager అనే రెండు యాప్స్ కూడా యూజర్లకు తెలియకుండా వారి డేటాని చైనా లోని సంస్థలకు చేరవేస్తునట్లు ప్రముఖ మొబైల్ సెక్యూరిటీ కంపెనీ Pradeo తన బ్లాగ్ ద్వారా తెలియ చేసింది మరియు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి కూడా వివరాలను పోస్ట్ చేసింది. 

Pradeo ప్రకారం, ఈ రెండు యాప్స్ కూడా ఈ యాప్స్ డౌన్ లోడ్ చేసుకున్న యూజర్ల కాంటాక్ట్ లిస్ట్ మరియు వాటితో కనెక్ట్ అయిన ఇమెయిల్ అక్కౌంట్స్, సోషల్ నెట్వర్క్స్, మొబైల్ సెక్యూరిటీ కోడ్, డివైజ్ వివరాలు, ఫోన్ లోని ఫోటోలు, వీడియోలతో పాటుగా ఆడియో లను కూడా చైనాకు చేరవేస్తునట్లు తెలిపింది.

 

 

ఈ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ నుండి 1.5M డౌన్ లోడ్స్ సాధించినట్లు మరియు ఈ యాప్స్  యూజర్ల డేటా రక్షణకు భంగం కలిగిస్తున్నట్లు స్క్రీన్ షాట్స్ తో సహ ఈ మొబైల్ సెక్యురిటి కంపెనీ వివరించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo