ఇక 70% ఇంటర్నెట్ డేటా ను సేవ్ చేయనున్న గూగల్ క్రోమ్ మొబైల్ బ్రౌజర్
క్రోమ్ ఫర్ ఆండ్రాయిడ్ లో డేటా సేవర్ మోడ్ ఉంది. కాని చాలా మందికి ఓపెరా లేదా UC బ్రౌజర్స్ లోని డేటా సేవింగ్ మోడ్ మాత్రమే పరిచయం. క్రోమ్ సెట్టింగ్స్ లోకి వెళ్లి Bandwidth management కు వెళితే reduce data usage ఆప్షన్ కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేసి enable చేయాలి.
సో ఇప్పుడు గూగల్ దీనిపై అప్ డేట్ ఇచ్చింది. లేటెస్ట్ గా 70% వరకూ డేటా సేవ్ అయ్యేలా మార్పులు చేసింది డేటా సేవింగ్ మోడ్ కు. అంటే మీరు దీనిని ఆన్ చేసి బ్రౌజింగ్ చేస్తే ఇంటర్నెట్ డేటా 70% కంప్రెస్ అయ్యి లోడ్ అవుతుంది.
ఇది ఎలా అవుతుంది?
క్రోమ్ కొత్త అప్ డేట్ మీరు ఓపెన్ చేసిన పేజ్ లోని మోస్ట్ ఇమేజెస్ ను రిమూవ్ చేస్తుంది మీ ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉంటే. ఒకసారి మీకు కావలసిన కంటెంట్ ఫుల్ గా లోడ్ అయితే అన్నీ ఇమేజెస్ ను చూపించే బటన్ పై ప్రెస్ చేయగలరు.
అన్నీ కాకపోయినా సింగిల్ ఇమేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ అప్ డేట్ ముందుగా ఇండియా అండ్ ఇండోనేసియా దేశాలలో విడుదల అవుతుంది.
ఇది iOS కు ఎప్పుడూ రానుంది అని కంపెని ఇంకా తెలియజేయలేదు. లాస్ట్ week ఓపెరా మ్యూజిక్ స్ట్రీమింగ్ కోసం 50% డేటా సేవ్ అయ్యేలా అప్ డేట్ రిలీజ్ చేసింది. ఇది mp3 అండ్ mp4 ఫార్మాట్ లను AAC ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేస్తుంది.