ఆండ్రాయిడ్ కోసం WhatsApp యొక్క “డార్క్ మోడ్”
కొత్త బీటా వెర్షన్ 2.19.82 తో డార్క్ మోడ్ అప్డేట్ అవుతుంది.
గత సంవత్సరం, WhatsApp ఆండ్రాయిడ్ కోసం ఒక 'డార్క్ మోడ్' అందించే పనిలో ఉందని పేర్కొంది. ఇప్పుడు ఈ అప్డేట్ ఆప్ యొక్క తాజా బీటా వెర్షన్ లో రోల్ అవుట్ చేయబడింది. 'డార్క్ మోడ్' కాకుండా, WhatsApp బీటా వెర్షన్ 2.19.82 ఆడియో UI ను కూడా అప్డేట్ చేస్తుంది మరియు దానితో ఆడియో ఫైల్ పేరు ఆడియో బబూల్లో కనిపిస్తుంది. అక్టోబర్ లో, WhatsApp బీటా వెర్షన్ 2.18.100 iOS కోసం కూడా ఆపిల్ ఫోన్లలో WhatsApp కోసం డార్క్ మోడ్ చూపించింది.
'డార్క్ మోడ్' యొక్క మొదటి ప్రస్తావన, సెప్టెంబరులో విడుదలైన 2.19.47 బీటా అప్డేట్ లో కనిపించింది. "WhatsApp అన్ని సెట్టింగులు డిజైన్ చేసింది. కొత్త డార్క్ మోడ్ తో సెట్టింగులు అనుకూలంగా ఉంచడానికి అలాచేయాల్సి వచ్చింది, అని "WABetainfo అన్నారు. ఈ మోడ్ ఉపయోగించాలనుకునే వారు ఈ తాజా టెస్టింగ్ వెర్షనుకు ఆప్ ని డేట్ చేయాలి.
వాట్స్ ఆప్ 2.19.80 బీటా అప్డేట్ యొక్క ఫార్వార్డింగ్ ఇన్ఫర్మేషన్ మరియు తరచుగా ఫార్వార్డ్ చేయబడిన ఫీచర్లను తయారు చేసిన కొన్ని రోజుల తర్వాత ఈ అప్డేట్ వెలువడింది. ఫార్వార్డింగ్ ఇన్ఫో ఫీచర్లు ఒక సందేశాన్ని ఎన్నో సార్లు పంపించారని వినియోగదారులు తెలుసుకునేటప్పుడు, సందేశాన్ని నాలుగు సార్లు కంటే ఎక్కువ ఫార్వార్డ్ చేసినట్లయితే, టెక్స్ట్ బబుల్ పైన తరచుగా ఫార్వార్డ్ చేయబడిన ట్యాగ్ కనిపిస్తుంది. ఈ అప్డేట్ ఒకసారి ప్రారంభించిన తర్వాత, వినియోగదారులు వారి మెసేజ్ ఎన్ని సార్లు ఫార్వార్డ్ అయ్యిందన్న విషయాన్నితనిఖీ చేయవచ్చు.
WhatsApp ప్రపంచవ్యాప్తంగా నకిలీ వార్తలను ఎదుర్కొనేందుకు కొన్ని ఇతర ఫిచర్ల పైన కూడా పని చేస్తుంది. బీటా వెర్షన్ 2.19.73 లో, వినియోగదారులు ఇతరులకు ఫార్వార్డ్ చేయబడిన చిత్రాలపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను అందించే ఒక ఎంపికతో వచ్చినట్లుగా రిపోర్ట్ చేయబడింది. ఈ క్రొత్త ఫీచర్ తో, రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించడానికి Google యొక్క సెర్చ్ బై ఇమేజ్ ఫీచర్ ద్వారా ఉపయోగించ బడుతుంది . సెర్చ్ పైన నొక్కడం Google లో రివర్స్ ఇమేజ్ శోధనను నిర్వహించడానికి ఫోన్ యొక్క డిఫాల్ట్ బ్రౌజర్ను తెరుస్తుంది, ఇది 2011 నుండి గూగుల్ ఇమేజ్ లి కలిగివున్నఒక ఫిచర్.