గూగల్ తాజాగా జరిగిన I/O డెవలపర్స్ కన్ఫిరెన్స్ లో చెప్పిన టచ్ టు సెర్చ్ ఫీచర్ ను ఇప్పుడు దసలు వారిగా రిలీజ్ చేస్తుంది.
ఇది ఏమి చేస్తుంది:
మీరు క్రోమ్ మొబైల్ బ్రౌజర్ లో ఏ పేజ్ లో ఉన్నా మీరూ ఏదైనా ఒక వర్డ్ మీద క్లిక్ చేస్తే ఆ పేజ్ అడుగునా ఒక కార్డ్ రూపంలో ఆ పదానికి సంబందించిన ప్రతీ ఇన్ఫర్మేషన్, వికిపిడియా ఇన్ఫర్మేషన్ తో పాటు అన్నిఇస్తుంది ఈ కొత్త ఫీచర్.
మొన్నటి వరకూ బీటా స్టేజ్ లో ఈ అప్డేట్ ఆప్షన్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఇది వద్దు అనుకుంటే సెట్టింగ్స్ లో డిసేబల్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. దీనితో పాటు క్రోమ్ బ్రౌజర్ కు ఫ్లాస్ కంటెంట్ ను కొంచం సేపు ఆపుకునే ఆప్షన్ ఇస్తుంది గూగల్. దీని వలన బ్యాటరీ మరియు స్పీడ్ ను పెరుగుతాయి. అనవసరం అయిన ఎనిమేషన్ ఇమేజెస్ ను రన్ అవ్వకుండా ఉంచుతుంది ఈ ఫీచర్. మీకు అవసరం అయినది ఏదైనా బ్లాక్ అయితే దానిపై క్లిక్ చేస్తే రన్ అవుతుంది.
ఇవి గూగల్ కొత్త ఫీచర్స్. త్వరలో అందరికీ అప్డేట్స్ రానున్నాయి. మొదటి ఫీచర్ టాప్ టు సర్చ్, క్రోమ్ బ్రౌజర్ ఒక్క దానికే కాదు, "గూగల్ నౌ ఆన్ టాప్" పేరుతో ఏ అప్లికేషన్ లో ఉన్న అక్కడికక్కడే హోమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మీ స్క్రీన్ పైన ఉన్న దాని గురించి సమాచారం ఇస్తుంది గూగల్ నౌ ఆన్ టాప్ ఫీచర్ అని చెబుతుంది గూగల్. అయితే గూగల్ నౌ ఆన్ టాప్ ఫీచర్ ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ M లోనే విడుదల కానుంది.
ఆధారం: గూగల్