అప్‌డేట్: కామ్‌స్కానర్ వెర్షన్ 5.11.7 యొక్క SDK ప్రకటనలో హానికరమైన మాడ్యూల్ ఉందని కామ్‌స్కానర్ అంగీకరించింది. SDK స్పష్టంగా AdHub అనే తర్డ్ పార్టీ అందించింది మరియు అనధికార ప్రకటన క్లిక్‌లను ప్రొడ్యూస్ చేస్తోంది. ఏదైనా అనుమానాస్పద కోడ్ ఇంజెక్ట్ చేయడం కంపెనీ భద్రతా విధానాన్ని ఉల్లంఘించినందున AdHub వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కంపెనీ పేర్కొంది. అదనంగా, 'చాలా రౌండ్ల భద్రతా తనిఖీల' తర్వాత లీక్‌లకు ఎటువంటి ఆధారాలు కనుగొనబడలేదు. అలాగే, Google Play ధృవీకరించని అన్ని ప్రకటన SDK లను కామ్‌స్కానర్ తొలగించింది మరియు ప్రస్తుతం కంపెనీ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేయగల కొత్త వెర్షన్‌ను విడుదల చేస్తోంది.
https://twitter.com/CamScanner/status/1166733219841986561?ref_src=twsrc%5Etfw
Android మరియు iOS రెండింటిలో లభ్యమయ్యే కామ్‌స్కానర్ ఆప్లికేషన్ గురించి మీకు మంచి అవగాహన ఉంది. గూగుల్ ప్లే స్టోర్ నుండి బూట్ అవ్వడానికి ముందు ‘ఫోన్ పిడిఎఫ్ క్రియేటర్’ లేదా ‘స్కానర్ టు స్కాన్ పిడిఎఫ్స్’ తో ఈ యాప్ 100 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్లను కలిగి ఉంది. క్యాస్పర్స్కి ల్యాబ్స్ పరిశోధకులు ప్రసిద్ధ OCR (ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్), ఈ యాప్ యొక్క ఇటీవలి వెర్షన్లలో ఈ మాల్వేరును కనుగొన్నారు. ఈ వినివేధిక`నివేదిక ప్రకారం, ఈ 'ట్రోజన్-డ్రాపర్. చైనీస్ స్మార్ట్‌ఫోన్ లలో ముందుగా ఇన్స్టాల్ చెయ్యబడిన అనేక యాప్స్ లో ముందుగా కనుకొన్నట్లు చెప్పబడింది.
మాల్వేర్ మాడ్యూల్ అనువర్తనం యొక్క ఆండ్రాయిడ్ వెర్షన్‌లో మాత్రమే గుర్తించబడింది మరియు దాని iOS వెర్షన్ ఇప్పటికీ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉన్నట్లు అనిపిస్తుంది, బహుశా ఆపిల్ యొక్క కఠినమైన యాప్ వెట్టింగ్ విధానాల వల్ల కావచ్చు. క్యాస్పర్స్కి బ్లాగ్ చెప్పినట్లుగా, కామ్‌స్కానర్ గుర్తించదగిన కార్యాచరణను అందించే మంచి యాప్. ఇది ఆదాయాన్ని సంపాదించడానికి ప్రకటనలను ప్రదర్శించినప్పుడు, ఈ యాప్ లో కొనుగోళ్లకు మరియు ప్రకటనలను తొలగించడానికి విడిగా లైసెన్స్‌ను కొనుగోలు చేయడానికి ఎంపికలు ఉన్నాయి. ఏదేమైనా,ఈ యాప్ లో కనిపించే ట్రోజన్ డ్రాపర్ మాడ్యూల్ ఈ యాప్ యొక్క వనరులలో చేర్చబడిన ఎన్క్రి ప్టెడ్ ఫైల్ నుండి మరొక హానికరమైన మాడ్యూల్‌ను సంగ్రహించి అమలు చేస్తుంది.