TrueCaller కి పోటీగా కొత్త Bharat Caller లాంచ్..ఫీచర్లు ఎలాఉన్నాయంటే..!

Updated on 25-Aug-2021
HIGHLIGHTS

ఇండియన్ కాలర్ ఐడి యాప్ వచ్చింది

Bharat Caller యాప్ కొత్తగా లాంచ్

Bharat Caller కూడా ఒక Caller ID App

స్మార్ట్ ఫోన్ లో కాలర్ ఐడి యాప్ అనగానే ఎక్కవ గుర్తొచ్చేది True Caller యాప్. వాస్తవానికి, చాలా కాలర్ ఐడి యాప్స్ మార్కెట్లో ఉన్నపటికీ ట్రూకాలర్ ఎక్కువగా ఆధరణ పొందింది. అయితే, ఈ ఇప్పుడు దీనికి పోటీగా ఇండియన్ కాలర్ ఐడి యాప్ వచ్చింది. అదే, Bharat Caller యాప్. కొత్తగా లాంచ్ అయిన ఈ ట్రూఐడి కాలర్ True Caller యాప్ కి ప్రత్యామ్నాయంగా ఉందనున్నదో మరియు దీని ఫీచర్లు ఏమిటో అన్ని విషయాలను తెలుసుకుందాం.

అసలు Caller ID యాప్ అంటే ఏమిటి?

Caller ID App అనేది మీ ఫోన్‌లో మీరు సేవ్ చెయ్యని లేదా తెలియని కాలర్ పేరును మీకు అందించే యాప్. అంటే, కాల్ చేసిన వ్యక్తి పేరు మీరు సేవ్ చేసుకోకపోయినా కాల్ చేసిన వారు ఎవరో ఏమిటో మీకు సులభంగా తెలిసిపోతుంది.  అతను ఎవరు? మీరు అతని ఇమెయిల్ ఐడి, ఫేస్‌బుక్ ఐడిని కూడా మీరు చూడవచ్చు. మీ ఫోన్‌లో ఆ నంబర్ సేవ్ చేయకపోతే, ఆ సమాచారం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని వలన మీకు కాల్ చేసిన వారి కాల్ ని లిఫ్ట్ చేయాలో లేదో మీకు ముందే అర్ధం చేసుకోవడం సులభమవుతుంది.

Bharat Caller ఎలా పనిచేస్తుంది?

Bharat Caller కూడా ఒక Caller ID App మరియు ఇది కూడా పైన తెలిపిన విధంగానే పనిచేస్తుంది. అయితే, ఇది మేడ్ ఇన్ ఇండియా లో భాగంగా ఇండియాలో భరతీయుల చేత క్రియేట్ చెయ్యబడిన యాప్. ఈ యాప్ ఆగష్టు 15 వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవ పండుగ రోజు ఆవిష్కరించారు. ఈ యాప్ ను భారతీయ సాఫ్ట్‌వేర్ కంపెనీ KickHead సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసింది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు బెంగళూరు ఐఐఎమ్‌కు చెందిన ప్రజ్వల్ సిన్హా మరియు సహ వ్యవస్థాపకుడు కునాల్ పస్రిచా.

ట్రూకాలర్ ను ఇండియాలో బ్యాన్ చేసిన సమయంలో దానికి ప్రత్యామ్నాయంగా సరైన యాప్ ని నిర్మించాలని ఆలోచన వచ్చినట్లు సంస్థ భారత్ కాలర్ వ్యవస్థాపకులు ప్రజ్వల్ సిన్హా తెలిపారు. అప్పటి నుండి అతను తన బృందంతో కలిసి వెంటనే ఈ యాప్‌పై పని చేయడం ప్రారంభించాడు మరియు 2021 ఆగస్టు 15 న దీనిని ప్రారంభించినట్లు వెల్లడించారు.

Bharat Caller ఎంత వరకూ సురక్షితం?

భారత్ కాలర్  ప్రైవసీ మరియు సెక్యూరిటీ విషయంలో మరింత సురక్షితమైనదని కంపెనీ తెలిపింది. ఎందుకంటే, ఈ యాప్ వినియోగదారుల కాంటాక్ట్స్ మరియు వారి కాల్ లాగ్స్ ను దాని సర్వర్‌లో సేవ్ చేయదు. కాబట్టి, ఇది వినియోగదారుల ప్రైవసీని  కాపాడుతుంది. అలాగే, కంపెనీ ప్రకారం ఈ యాప్ భారతీయులకు కూడా సురక్షితం ఎందుకంటే ఈ యాప్ సర్వర్ భారతదేశానికి వెలుపల ఉపయోగించబడదు. అందువల్ల దీనిని ఇతర యాప్‌ల కంటే భిన్నంగా మరియు సురక్షితంగా గుర్తించవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :