డిలీటైన ఫోటోలను తిరిగి రీస్టోర్ చేసే బెస్ట్ యాప్స్..!!
స్మార్ట్ ఫోన్ నుండి డిలీట్ అయిన ఫోటోలు లేదా వీడియోలను తిరిగి రీస్టోర్ చేసే యాప్స్
ఈ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబటులో వున్నాయి
మంచి రివ్యూలను మరియు రేటింగ్ ను కూడా అందుకున్నాయి
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ నుండి డిలీట్ అయిన ఫోటోలు లేదా వీడియోలను తిరిగి రీస్టోర్ చేసే యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ లో చాలానే అందుబాటులో ఉన్నాయి. అయితే, కొన్ని బెస్ట్ యాప్స్ చాలా సులభమైన పద్దతిలో మరియు ఈజీగా నిర్వహించగలిగే యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అందుకే, ఈరోజు అటువంటి ఒక 3 బెస్ట్ యాప్స్ గురించి మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఈ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబటులో వున్నాయి మరియు యూజర్స్ నుండి మంచి రివ్యూలను మరియు రేటింగ్ ను కూడా అందుకున్నాయి.
DiskDigger Photo Recovery
ఈ App దాదాపుగా 10 మిలియన్ల వినియోగదారుల చేత డౌన్లోడ్ చేయబడింది. అలాగే, ఇది Google Play స్టోర్లో 3.8 స్టార్స్ అందుకుంది. అంతేకాకుండా 4,27, 000 మందికి పైగా వినియోగదారులు దీన్ని రేట్ చేసారు ఈ App యొక్క పరిమాణం మీ పరికరాన్నిబట్టి ఆధారపడి ఉంటుంది. మీరు ఈ ఆప్ తో, డిలీట్ అయిన ఫోటోలను మళ్ళీ ఫోటోలను అన్ డిలేట్ మరియు రికవరీ చేస్తుంది. అప్లికేషన్ ఇంటర్ఫేస్ చాలా సులభం. ఇది ఉపయోగించడానికి సులభం.ఎటువంటి రూట్ చేయాల్సిన పనిలేదు.
Deleted Photo Recovery
మీరు Google Play Store లో ఈ ఆప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆప్, 5 మిలియన్ల వినియోగదారులచేత డౌన్లోడ్ చేయబడింది. ఇది Google ప్లే స్టోర్లో 3.8 స్టార్స్ కలిగివుంది. ఇది 16,400 వినియోగదారులచే రేట్ చేయబడింది. ఈ అప్లికేషన్ చాలా ఫోటోలను రికవర్ చేస్తుంది. మైక్రో SD కార్డ్ మరియు అంతర్గత స్టోరేజిని ఈ అప్లికేషన్ స్కాన్ చేస్తుంది. అప్లికేషన్ చాలా వేగంగా స్పందిస్తుంది.మీ ఫోనులో లేదా మెమొరీ కార్డులో నుండి తెసివేయబడిన ఫోటోలను, త్వరగా తిరిగి తీసుకొస్తుంది.
Restore Image (Super Easy)
ఈ అప్లికేషన్ దాదాపుగా 10 మిలియన్ల వినియోగదారులచేత డౌన్లోడ్ చేయబడింది. అంతేకాకుండా, Google Play Store లో 4.1 స్టార్లను సొంతంచేసుకుంది. ఇది 87,000 కన్నా ఎక్కువ మంది వినియోగదారులు రేటింగును అందుకుంది. ఈ అప్లికేషన్ పరిమాణం 3MB గా ఉంటుంది. మీరు ఈ అప్లికేషన్ లో పైన తెలిపిన అన్ని లక్షణాలను పొందుతారు. మీరు ఈ అనువర్తనాన్ని ఉపయోగించడానికి మీ ఫోన్ను root చేయాల్సిన అవసరం లేదు.