వీడియో అయినా ఆడియో అయినాసరే : YouTube మ్యూజిక్ ఆప్ ఉందిగా

Updated on 15-Mar-2019
HIGHLIGHTS

ఈ ఆప్ లో ఒక బటన్ నొక్కడంతో వీడియో ఆడియోగా మారుతుంది.

YouTube గురించి తెలియని వారు దాదాపుగా ఉండరు అని చెప్పడంలో అస్సలు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఈ YouTube అంతగా ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. అసలు ఎటువంటి వీడియో అయినాసరే చూడాలంటే అందరూ చెప్పే సలహా ఒక్కటే "Search in Youtube" అని. మరి వీడియో వరకు ఓకే ఆడియో కోసం మరొక ఆప్ ని ఎతుక్కోవలసి వచ్చేది ఇప్పటి వరకు, కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎందుకంటే, యూట్యూబ్ యొక్క YouTube మ్యూజిక్ ఆప్ ఇప్పుడు ఇండియాలో విడుదలైంది.                  

ముందుగా 17 దేశాల్లో అందుబాటులో వున్నా YouTube మ్యూజిక్ ఆప్, ఇప్పుడు  ఇండియాలో విడుదలైంది. యూట్యూబ్ అందించిన ప్రెస్ రిలీజ్ లో ఈ విషయాన్ని తెలియచేసింది. అనంతమైన విడియోలను కలిగి ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం కలిగి మరియు ప్రతిఒక్కరికి పరిచయమున్న ఈ ఆన్లైన్ వీడియో భండాగారం, ఇప్పుడు మీకు మ్యూజిక్ కూడా అందిస్తోంది. దీని గురించి " వీడియో మరియు ఆడియో కోసం అనేక రకాల ఆప్లతో ముందుకు వెనకకు మార్చి మార్చి ఎంచుకోవాల్సివుంటుంది, కానీ ఇప్పుడు ఈ YouTube మ్యూజిక్ ఆప్ తో వీడియో & ఆడియో, ఇంకా మీకు కావాల్సిన అన్నింటిని ఒక్క దగ్గరే అందించామని" ఈ ప్రెస్ రిలీజ్ లో నోట్ చేసి చెప్పారు.

ఈ ఆప్ నిజంగా ఒక అద్భుతమని చెప్పొచ్చు. ఎందుకంటే, మీకు కావలసినప్పుడు వీడియోలను చూడడంతో పాటుగా మీకు కాకుండా ఆడియో మాత్రమే కావాలనుకున్నప్పుడు కేవలం ఒక్క బటన్ నొక్కడంతో అది ఆడియోకి మారిపోతుంది. అంతేకాదు, అన్ని రకాల వీడియోలు యూట్యూబ్లో ఉంటాయి కాబట్టి కేవలం పాటలను మాత్రం కాకుండా యూట్యూబ్ లో మీకు నచ్చిన కామెడీ సీన్లు, వంటలు, స్పూఫ్స్ , ఒకటేంటి యూట్యూబేలో మీకు లభించే అన్ని వీడియోల యొక్క కేవలం ఆడియోని వినేలా, ఈ ఆప్ మనకు  సహకరిస్తుంది.

ఈ YouTube మ్యూజిక్ ఆప్ ఉచితంగా అందించబడుతుంది. కానీ, ఇందులో మీకు యాడ్స్ వంటివి మద్యమద్యలో వచ్చి విసిగించవచ్చు. అయితే, ప్రీమియం YouTube మ్యూజిక్ ఆప్ కి మీరు సబ్ స్క్రైబ్ అయినట్లయితే, మీకు యాడ్స్ వంటి వాటి సమస్యలేకుండా సర్వీస్ అందుకోవచ్చు.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ప్రియం ఆప్ సబ్ స్క్రైబ్ కోసం మీరు నెలకు 99 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతం ఒక మూడు నెలల సబ్ స్క్రిప్షన్ ను ట్రయిల్ బేసిస్ క్రింద ఉచితంగా అందిస్తోంది. దీని కోసం మీరు మీ యొక్క పేమెంట్ వివరాలను అందించాల్సి ఉంటుంది.     

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :