ఆండ్రాయిడ్ ని వాడుతున్న వారు ఐ ఫోన్ డివైజ్ ను కొన్నట్లు అయితే వారిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈజీగా ఆండ్రాయిడ్ నుండి ఐ os కు స్విచ్ అయ్యేందుకు ఆపిల్ డెవలప్ చేసిన అప్లికేషన్, 'మూవ్ టు ఐ os' . ఆపిల్ దీనిని ఒక ప్రధాన ఫీచర్ గా తన అధికారిక వెబ్ సైటు లో లిస్టింగ్ చేసింది.
సాధారణంగా ఒక ప్లాట్ఫారం నుండి మరో OS ప్లాట్ఫారం మారటానికి టెక్నాలజీ మీద పట్టు ఉన్నవాళ్ళకి సైతం చాలా సమయం పడుతుంది. అంత ఈజీగా జరిగే పని కాదు. ఇక సాధారణ మొబైల్ యూజర్స్ కు అయితే చెప్పనవసరం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆపిల్ అఫీషియల్ గా ఈ ప్రక్రియను సులభంగా అయ్యేలా "Move to IOS" అనే అప్లికేషన్ ను తయారు చేసింది.
ఇది వైర్లెస్ పద్ధతిలో మీ పాత ఫోన్ లోని కాంటాక్ట్స్, మెసేజెస్, కెమేరా ఫోటోస్, వీడియోస్, బుక్మార్క్స్, మెయిల్ అకౌంట్స్, కేలందర్స్, వాల్ పేపర్ మరియు DRM లేని సాంగ్స్, బుక్స్ ను ట్రాన్సఫర్ చేస్తుంది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలిసినది, ఈ అప్లికేషన్ మీ పాత ఆండ్రాయిడ్ ఫోనులో మీరు వాడిన ఆప్స్ కనుక ఐ os లో కూడా ఫ్రీ గా ఉంటే, వాటిని కూడా డౌన్లోడింగ్ కు అనుమతిస్తుంది ఆపిల్. పెయిడ్ ఆప్స్ కు సంబంధించి ఆప్ స్టోర్ లో విష్ లిస్టు లో చూపిస్తుంది. ఇది ఐ os 9 అప్డేట్ లో ఉండనుంది అని అంటున్నారు.
గతంలో కూడా ఆండ్రాయిడ్ నుండి ఐ os కు మరెందుకు స్టెప్ బై స్టెప్ గైడులను అఫీషియల్ గా తయారు చేసింది. ఆపిల్ చేస్తున్న ఈ కొత్త విధానాలు ఎంత కాదనుకున్నా ఆండ్రాయిడ్ నుండి ఐ os కు మారటానికి ఏంటో కొంత ప్రభావితంగా ఉంటాయి.
మొన్న విడుదల అయిన ఐ os 9 లోని ఏడు చూడవలిసిన ఫీచర్స్ ను ఇక్కడ పొందగలరు.
ఆపిల్ మ్యూజిక్ గురించి ఇక్కడ చదవగలరు.