ఫోన్ యొక్క ర్యాంకింగ్ టెస్టింగ్ సాధనమైనటువంటి, AnTuTu నుండి మార్చి నెల జాబితా విడుదల చెయ్యబడింది. ఇందులో, మార్చి నెలలో టాప్ పెర్ఫార్మింగ్ నమోదుచేసిన స్మార్ట్ ఫోన్ల జాబితా అందించబడింది. ఈ నెలకుగాను Xiaomi Mi9 మరియు లెనోవా Z5 ప్రో GT స్మార్ట్ ఫోన్లను, ఈ జాబితాలో టాప్ స్థానంలో ఉంచారు. అయితే, ఈ జాబితా తర్వాత, Xiaomi Mi 9 ట్రాన్ఫరెంట్ ఎడిషన్, ఈ జాబితాలో ఎగువన వచ్చింది. అయితే, మీరు ఈ జాబితాలో చూడబోయే అన్ని టాప్ స్మార్ట్ ఫోన్లు కూడా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 855 చిప్సెట్ కలిగివున్నట్లు కూడా వెల్లడైంది.
ఈ సమాచారం వెల్లడించిన ఈ పోస్ట్ గురించి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే, ఈ మొబైల్ ఫోన్, Xiaomi Mi 9 ట్రాన్సపరెంట్ ఎడిషన్ 3,72,072 పాయింట్లను పొందింది, మరియు Xiaomi Mi 9 Explorerతో పాటు ఇది 3,71,878 పాయింట్లను అందుకుంది. దీనితో పాటు, మొదటి స్థానాలను ఆక్రమించిన టాప్ మూడు స్థానాలను గురించి చూస్తే, వివో iQOO మాన్స్టర్ ఎడిషన్ మూడవ స్థానంలో ఉంచబడింది, ఈ మొబైల్ ఫోన్ 3,65,430 పాయింట్లు సాధించింది. దీనితో పాటు, ఈ మొబైల్ ఫోన్ 12GB RAM తో 25GB అంతర్గత నిల్వతో ప్రారంభించబడింది.
దీనితో పాటు తరువాతి స్థానాల్లో, శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 10 మరియు శామ్సంగ్ గెలాక్సీ S10 + మొబైల్ ఫోన్లు నిలిచాయి, ఈ స్మార్ట్ ఫోన్లలో కొన్ని స్నాప్ డ్రాగన్ 855 తో ప్రారంభించబడ్డాయి. ఇక వివో iQoo మరియు లెనోవా 5Z ప్రో ZT మొబైల్ ఫోన్లు వాటి తరువాతి స్థానాల్లో నిలిచాయి. ఇక జాబితాలో చివరి వాటికీ వస్తే, నిబియా రెడ్ మేజిక్ మార్స్ గేమింగ్ ఫోన్ తరువాత స్థానంలో వస్తుంది, ఈ మొబైల్ ఫోన్ ఒక స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసరుతో ప్రారంభించబడింది. ఇవే కాకుండా, ఈ జాబితా యొక్క చివరి రెండు స్థానాల్లో, హానర్ V20 మరియు హువావే మాట్ 20 X ఉన్నాయి, అయితే ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా హువావే యొక్క కిరిన్ 980 తో విడుదల చేయబడ్డాయి.