ఆండ్రాయిడ్ లో యాప్స్ కు iOS స్టైల్ నేవిగేషన్ బార్ ను ప్రవేశ పెట్టిన గూగల్

Updated on 16-Mar-2016

గూగల్ కొత్త డిజైన్ కాన్సెప్ట్ తో వస్తుంది. మేటేరియాల్ డిజైన్ గైడ్ లైన్స్ ను అప్ డేట్ చేసింది ఆండ్రాయిడ్ లో. యాప్స్ యొక్క టాప్ నేవిగేషన్ bar ను క్రిందకు తీసుకువచ్చింది.

ఇక నుండి డెవలపర్స్ యాప్స్ డెవెలప్ చేయాలంటే దీనిపై ప్రత్యెక శ్రద్ధ వహించాలి. ఇదే డిజైన్ వర్క్ ఆల్రెడీ ఐ os లో ఐ ఫోన్లకు ఉంది. క్రింద ఇమెజ్ చూస్తే ఇది ఏంటో అర్థమవుతుంది మీకు.

జస్ట్ ఆన్ స్క్రీన్ నేవిగేషన్ బటన్స్ పైనే ఉంటుంది. అయితే ఇది మీరు స్క్రీన్ పై స్క్రోలింగ్ మొదలు పెట్టగానే మాయమవుతుంది. అంటే స్క్రీన్ పెద్దదిగా అనిపిస్తుంది, తిరిగి చూడాలంటె క్రిందకు స్క్రోల్ చేయాలి.

అయితే బాటం నేవిగేషన్ బార్ కేవెలం రెండు కన్నా ఎక్కువ ఏరియా ఫీల్డ్స్ ఉన్న యాప్స్ కే అని చెబుతుంది గూగల్. రెండు లేదా సింగిల్ నేవిగేషన్ ఫీల్డ్ తో ఉంటే అవి టాప్ లోనే ఉంటాయి.

6 కన్నా ఎక్కువ టాబ్స్ ఉండే యాప్స్ కు hamburger మెను( హారిజంటల్ గా మూడు గీతలు ఉండే మెను సింబల్) సజెస్ట్ చేస్తుంది గూగల్. బాటమ్ నేవిగేషన్ ఆల్రెడీ గూగల్ ప్లస్ అండ్ ఫోటోస్ లో implement చేసింది గూగల్.

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

Connect On :