గూగల్ ఆండ్రాయిడ్ experiments పేరుతో ఆండ్రాయిడ్ లోని క్రియేటివ్ యాప్స్ కోసం ఒక వెబ్ సైటు ప్రారంభించింది. ప్లే స్టోర్ లో ఉండే ఈ యాప్స్ కు ఇది సెపరేట్ ప్లాట్ ఫారం లాంటిది. ఇవి ఆండ్రాయిడ్ wear, స్మార్ట్ ఫోన్స్ మరియు టాబ్లెట్స్ పై పనిచేస్తాయి.
ప్రస్తుతానికి టోటల్ గా 20 అప్లికేషన్లు ఉన్నాయి సైటులో. గూగల్ ప్రత్యేకంగా దాని కోసం వెబ్ సైటు విషయం ఏమీ లేకుండా క్రియేట్ చేయదు కాబట్టి ఫ్యూచర్ టెక్నాలజీ కు సంబందించి మనం అబ్బురపడే యాప్స్ ను ఫ్యుచర్లో ఇందులో ప్రవేసపెడుతుంది అని అనుకుంటున్నాము.
మీకు తెలిసిన క్రియేటివ్ యాప్ ఏమినా ఉంటే గూగల్ కు సబ్మిట్ చేస్తే అది కూడా యాడ్ చేస్తుంది సైటులో. ఆఫ్ కోర్స్ ఇది రియల్ టైమ్ లో మొబైల్ వినియోగదారులకు ఉపయోగపడే సబ్జెక్ట్ కాదు కాని డెవెలప్మెంట్ పీపుల్ కి ఇది మంచి ప్రారంభం.
Tunnel Vision, Lip Swap, Landmarker, InkSpace వంటి యాప్స్ ను ఒకసారి చూడండి. Android Experiments సైటులోకి వెళ్లటానికి ఇక్కడ ప్రెస్ చేయండి. ఇంటరాక్టివ్ గ్రాఫిక్స్ ఎక్కువుగా ఉండే ప్లేస్ ఇది. సో హై స్పీడ్ ఇంటర్నెట్ అండ్ స్పీడ్ బ్రౌజర్ ను ప్రిఫర్ చేయండి.