కేవలం రూ.599 కే ఒక సంవత్సరం అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రిప్షన్..!

కేవలం రూ.599 కే ఒక సంవత్సరం అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రిప్షన్..!
HIGHLIGHTS

కేవలం రూ.599 కే ఒక సంవత్సరం అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రిప్షన్

అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రిప్షన్ ను మీరు చాలా చవక ధరకే పొందవచ్చు

వన్-డే డెలివరీతో సహా మరిన్ని ప్రయోజనాలను అఫర్ చేస్తుంది

కేవలం రూ.599 కే ఒక సంవత్సరం అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రిప్షన్ పొందే అవకాశాన్ని అమెజాన్ అందించింది. అంటే, అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రిప్షన్ ను మీరు చాలా చవక ధరకే పొందవచ్చు. అయితే, ఇది మొబైల్ ఫోన్లలో ఉపయోగించే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది.  అమెజాన్ కొత్తగా తీసుకొచ్చిన మొబైల్-ఓన్లీ సబ్‌ స్క్రిప్షన్ ప్లాన్‌, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ తో దీన్ని సాధ్యం చేసింది. ఈ ప్లాన్ రెగ్యులర్ ప్లాన్ సబ్‌స్క్రిప్షన్ కంటే చాలా తక్కువ రేటుతో ప్రకటించింది. వాస్తవానికి, రెగ్యులర్ అమెజాన్ ప్రైమ్ నెలవారీ సభ్యత్వం రూ. 179 రూపాయలుగా ఉండగా, ఈ కొత్త మొబైల్ ఓన్లీ ప్లాన్ చాలా చవకగా ఉంటుంది. అంతేకాదు, ఈ మొబైల్ ఓన్లీ ప్లాన్ తో కూడా ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్ మరియు వన్-డే డెలివరీతో సహా మరిన్ని ప్రయోజనాలను అఫర్ చేస్తుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ సబ్‌ స్క్రిప్షన్ పూర్తి సంవత్సరం ధర రూ.599 రూపాయలు మాత్రమే. ఇక మీరు నెల నెల చెల్లించేలా ప్లాన్ ను తీసుకోవాలనుకుంటే కేవలం రూ.50 రూపాయలు చెల్లించి తీసుకోవచ్చు. ఈ సబ్ స్క్రిప్షన్ తో ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ప్లాట్‌ఫారమ్‌లోని మొత్తం కంటెంట్‌కు మీకు యాక్సెస్‌ లభిస్తుంది. అయితే, మీరు ఈ మొబైల్-ఓన్లీ సబ్‌ స్క్రిప్షన్ తో కంటెంట్ ను కేవలం SD లో మాత్రమే చూడగలరు. అంటే, వినియోగదారులు వారికి ఇష్టమైన సినిమాలు మరియు సిరీస్‌ లను Amazon Prime Video లో చూడవచ్చు, కానీ HD రిజల్యూషన్‌ లో చూడలేరు.

అయితే, కంటెంట్ ను టీవీలలో చేసేప్పుడు మాత్రమే మీకు SD రిజల్యూషన్ మరియు HD రిజల్యూషన్ మధ్య ఎక్కువ వ్యత్యాసం కనిపిస్తుంది, మొబైల్ ఫోన్ లో మాకేయూ అంతగా వ్యత్యాసం అనిపించక పోవచ్చు. ప్రైమ్ వీడియో మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తో ప్రైమ్ డేస్ సేల్స్, ప్రైమ్ డీల్స్ డిస్కౌంట్ మరియు వన్-డే డెలివరీ వంటి అన్ని ప్రయోజాలను పొందుతారని గుర్తుంచుకోండి. కొత్త ప్లాన్‌ని ఎంచుకోవాలనుకునే వారు ఆండ్రాయిడ్, iOS లేదా వెబ్‌లోని ప్రైమ్ వీడియో యాప్‌లో దీన్ని ఎంచుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo