ఎయిర్టెల్ Wink Tube మ్యూజిక్ మరియు వీడియో App విశేషాలు ఇవే !

Updated on 01-May-2019
HIGHLIGHTS

యూట్యూబ్ మ్యూజిక్, అమెజాన్ మ్యూజిక్ మరియు స్ఫోటిఫై వంటి ప్రధాన మ్యూజిక్ ఆప్ లకు పోటీగా తీసుకువచ్చింది.

ఎయిర్టెల్ చందాదారులకు దీని ప్రైమ్ సేవలు ఉచితంగా అందుతాయి

ఆండ్రాయిడ్ వినియీగదారుల కోసం ఎయిర్టెల్ కొత్తగా తీసుకొచ్చినటువంటి, Wink Tube మ్యూజిక్ App తో మ్యూజిక్ తో పాటుగా వీడియోలను చూడవచ్చు. ఈ App ని ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులోవున్న యూట్యూబ్ మ్యూజిక్, అమెజాన్ మ్యూజిక్ మరియు స్ఫోటిఫై వంటి ప్రధాన మ్యూజిక్ ఆప్ లకు పోటీగా తీసుకువచ్చింది.

ఈ Wink Tube మ్యూజిక్ ఆప్ నుండి మీకు నచ్చిన ఆడియో లేదా వీడియోలను నేరుగా చూడవచ్చు. దీన్లో అందించిన ఒక ఆప్షన్ బటన్ నొక్కడంతో  మ్యూజిక్ నుండి వీడియోగా మార్చుకునే వీలుంటుంది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు అందరికి ఇది అందుబాటులో ఉంటుంది. అయితే, ఎయిర్టెల్ చందాదారులకు దీని ప్రైమ్ సేవలు ఉచితంగా అందుతాయి, ఇతర వినియోగదారులకు మాత్రం నెలకు రూ. 99 రూపాయల రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.

అయితే, మొదటి సారి డౌన్లొడ్ చేసుకునేవారికి ఒక నెల రోజుల పాటు ఉచిత సబ్ స్క్రిప్షన్ న్నీ కంప్లిమెంటరిగా అందిస్తుంది. కేవలం ఆన్లైన్ స్త్రీమింగుతో మ్యూజిక్ మరియు వీడియోలను చూడడమేకాకుండా, నచ్చినవాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు ఇందులో మీరు చూస్తున్న వాటికీ అనుగుణమైన మ్యూజిక్ మరియు వీడియోలు మీకు లిస్టుగా చూపించబడతాయి.                       

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :