ఎయిర్టెల్ – FLO సరికొత్త మహిళా సేఫ్టీ ఆప్
SOS హెచ్చరికలు పంపించే విధంగా ఒక సెక్యూరిటీ అప్లికేషన్ ప్రారంభించింది.
ఈ ఆప్ ద్వారా మహిళలు మై సర్కిల్ నుండి ఐదుగురు సభ్యులు లేదా స్నేహితులకు SOS అలర్ట్ పంపవచ్చు
ఈ అప్లికేషన్ పైన వుండే SOS ప్రాంప్ట్ పైన నొక్కాల్సివుంటుంది.
MyCircle అనే పేరుతో ఇండియాలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్లలో ఒకటి అయినటువంటి భారతీ ఎయిర్టెల్, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (FLO) ద్వారా ఎవరైనా మహిళలు అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు SOS హెచ్చరికలు పంపించే విధంగా ఒక సెక్యూరిటీ అప్లికేషన్ ప్రారంభించింది. ఎయిర్టెల్ మరియు నాన్-ఎయిర్టెల్ వినియోగదారులు కూడా ఈ App ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
ఈ ఆప్ ద్వారా మహిళలు మై సర్కిల్ నుండి ఐదుగురు సభ్యులు లేదా స్నేహితులకు SOS అలర్ట్ పంపవచ్చు మరియు ఈ అలర్ట్ ను ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ, అస్సామీ, ఒరియా, గుజరాతీ, ఉర్దూ సహా 13 భాషలలో పంపవచ్చు.
SOS అలర్ట్ పంపడానికి, ఈ అప్లికేషన్ పైన వుండే SOS ప్రాంప్ట్ పైన నొక్కాల్సివుంటుంది. ఇది కూడా iOS ఫోన్లలో సిరి ద్వారా వాయిస్ కమాండ్ ద్వారా కూడా యాక్టివేట్ చేయవచ్చు. ఈ అప్లికేషన్ యొక్క ప్రకటనలో ఇది త్వరలో Android పరికరాలకు Google అసిస్టెంట్ ద్వారా కూడా అందుబాటులో రానున్నట్లు చెప్పారు.
SOS అలర్ట్ య్నచుకున్న వెంటనే మీ కాంటాక్స్ లోని సమీప ఐదుగురుకి పంపడానికి యూజర్ ద్వారా ఎంపిక చేసిన మరియు వినియోగదారు యొక్క స్థానాన్ని త్వరగా వారికీ పంపబడుతుంది.
ఈ APP ను Google Play స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు iOS ప్లాట్ఫారమ్లో త్వరలో అందుబాటులో ఉంటుంది. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన వెంటనేవినియోగదారులు వారు ఇబందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు సహాయం కోసం కోరుకునే, ఐదు కాంటాక్ట్స్ వివరాలు నమోదు చేసిన తరువాత రిజిస్ట్రేషన్ చేయాల్సివుంటుంది.