టెక్నాలజీ ని కేవలం యూత్ మాత్రమే కాకుండా అందరూ దానికి అలవాటు పడితే, రియల్ లైఫ్ లోని చాలా అవసరాలకు అది ఉపయోగపడుతుంది. కొత్త టెక్నాలజీ ను తెలుసుకోవటానికి, ఇంతకుముందు వలె కంప్యూటర్స్ ముందు కూర్చొని క్లాసులు తీసుకోనవసరం లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. యాప్ రూపంలో లేటెస్ట్ టెక్నాలజీ ను ఈజీగా అలవాటు చేసుకోగలరు.
ఈ విషయంలో బెంగుళూరు పోలీసులు మంచి eg అని చెప్పవచ్చు. గతంలో బెంగుళూరు పోలీసులు క్రైం కోసం ట్విట్టర్ ను వాడారు. ఇప్పుడు మళ్ళీ Twitter చే డెవలప్ చేయబడిన Periscope అప్లికేషన్ వాడుతున్నట్లు వెల్లడించారు. బెంగలూరు పోలిస్ కమిషనర్ , M.N రెడ్డి మాట్లాడుతూ… పోలిస్ కాన్ఫరెన్స్ లను మరింత broaden చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని, అలాగే సిటిజెన్స్ మరియు రెసిడెంట్స్ వాళ్ల దగ్గరిలో జరిగే క్రైం లను లైవ్ వీడియో చిత్రీకరించి పోలిసులకు చూపించ వచ్చు దీని ద్వారా అని చెప్పారు.
Periscope యాప్ లైవ్ వీడియోలను తీసి ప్రపంచానికి అప్ లోడ్ చేసి చూపించటానికి డెవలప్ చేయబడింది. గతంలో ట్విట్టర్ ఐడియా సిటీలోని చాలా మంది నుండి మంచి స్పందన అందుకుంది. Tweets ద్వారా పోలీసులకు క్రైమ్ విషయాలను tweet చేసిన వాళ్ల సంఖ్య రోజు రోజుకి పెరిగింది. ఇప్పుడు Periscope in direct గా cctv ఫుటేజ్ ల వలె పనిచేస్తుంది అని పోలిసుల విశ్వాసం. అయితే స్లో ఇంటర్నెట్ ఫెసిలిటీస్ తోనే ఇంకా మనం రోజులు గడుపుతున్న తరుణంలో ఈ వీడియో స్ట్రిమింగ్ ఎంతవరకూ రియల్ టైమ్ లో సక్సెస్ అవుద్దో వేచి చూడాలి.