ముఖ్యంశాలు :
1. ఒక బగ్ వినియోగదారుల చాటింగును డిలీట్ చేస్తున్నట్లు కనుగొన్నారు
2. దీని నియంత్రించడానికి వాట్స్ ఆప్ ప్రతినిస్తున్నట్లు చెబుతోంది
3. మరొక బగ్ మీ చాటింగును అపరిచితులు చదివేలా అనుమతిస్తుంది
1.5 మిలియన్ డైలీ యాక్టివ్ యూజర్లను కలిగి, తమ స్నేహితులు లేదా సన్నితులు లేదా కుటుంభసభుల వంటివారికి అత్యంత దగ్గరిగ్గా ఉండేలా సహాయపడుతుంది, ఈ వాట్స్ఆప్. అయితే, ప్రస్తుతం ఈ ఆప్ బగ్ యొక్క తాకిడివల్ల చాలా ఎత్తుపల్లాలను ఎదుర్కోవలసివస్తుంది మరియు వినియోగదారుల ప్రైవసీకి కూడా అవాంతరం కలుగుతుంది. ఒక బగ్ వినియోగదారుల చాటింగును డిలీట్ చేస్తున్నట్లు మరియు మరొకటి వారి టెక్స్ట్ మెసేజిలను అపరిచితులు చూసేలా అనుమతిస్తునట్లు కనుగొన్నారు.
ఒక బగ్, వినియోగదారుని అనుమతి లేకుండా వారి మెసేజిలను డిలీట్ చేస్తున్నట్లు, ఇన్స్టాంట్ మెసేజింగ్ ఆప్ లో గుర్తించినట్లు మీడియా వేదికలు నివేధిస్తున్నాయి. ఈ బగ్ బారిన పడినవారిలో కొందరు వారి చేదుఅనుభవం గురించి ట్విట్టరులో పేర్కొన్నారు. ఒక ట్విట్టర్ యూజర్ ప్రకారం, అతను/ఆమె యొక్క చాట్ హిస్టరీ "క్రమక్రంగా కనుకరుగైనది" అని తెలిపారు. ఈ వినియోగదారు, ప్రతిరోజూ ఉదయం ఒకటి లేదా రెండు చాట్ హిస్టరీ మాయమవుతున్నట్లు తెలిపారు.
ఈ మెసేజీలు WAbetainfo చేత పోస్టుచేయబడ్డాయి, ఇది వాట్స్ ఆప్ యొక్క బీటా ఫిచర్లను పరీక్షిస్తుంది. అతను/ఆమె "సపోర్ట్ టీంకు 25 మెయిళ్లను పంపిన తరువాత ఎవరు స్పందించలేదని చెప్పిన తరువాత, వాట్స్ ఆప్ ఒక అధికారిక ప్రకటన చేసింది. "ఈ బగ్ మాదృష్టికి వచ్చింది మరియు వాట్స్ ఆప్ వినియోగదారులు ఎవరైతే దీని భారిన పడ్డారో, వారికీ సరైన పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు ", ఒక వాట్స్ ఆప్ ప్రతినిధి ఒకరు ప్రకటనలో పేర్కొన్నట్లు, ది హిందుస్తాన్ టైమ్స్ తెలిపినది.
ప్రత్యేక నివేదికలో, వినియోగదారుల గోప్యతను రాజీపడేలా చేసే ఒక బగ్ ఉందని కూడా పేర్కొన్నారు. ఒక ఆబ్బె ఫుల్లర్ చేత పోస్ట్ చేయబడిన ట్వీట్ల స్ట్రింగ్ ప్రకారం, ఒక WhatsApp బగ్ ద్వారా ఆమె "కొత్త ఫోన్" లో ఇతరుల యొక్క టెక్స్ట్ చదవడానికి అనుమతినిచ్చినట్లు చెప్పింది. ఆమె, అమెజాన్ సంస్థ యొక్క అమెజాన్ వెబ్ సర్వీసెస్ డివిజన్లో పనిచేస్తున్న ఒక అమెజాన్ ఉద్యోగి, ఒక కొత్త ఫోన్ నంబరుతో ఆమె WhatsApp లోకి లాగిన్ అయినప్పుడు, మునుపటి నంబర్ యజమాని యొక్క మెసేజీ హిస్టరీ ఆమె ఫోన్లో కి చేరింది.
ఇది జరుగుతున్నప్పుడు, ఆమె ఫాలోవర్లు ఆమె ఏదో తప్పు చేసినట్లు, చూడటానికి ఆమెకు ప్రశ్నలు వేయడం ప్రారంభించారు. ఆమె కొత్త డివైజ్ సెటప్ చేస్తానని మరియు "ఇది సెకండ్ హ్యాండ్ SIM కాదు" అని ఆమె వివరించింది. ఆమె, ఈ మెసేజీలు లేదా ఆమె యాడ్ చేసిన గ్రూపులు కాదని మరియు బ్యాకప్ నుండి మెసేజిలు పునరుద్ధరించబడలేదని ఆమె పేర్కొంది. ప్రస్తుతం, ఇది ఒక ప్రత్యేకమైన కేసుగా ఉన్నట్లు కనిపిస్తోంది, అయితే ఇలాంటి ఒక బగ్ ఉన్నట్లయితే, ఇది ఇప్పటికే అనేక ప్రైవసీ-సంబంధిత అంశాలచే దెబ్బతింటున్న కంపెనీకి ఇది ఒక తీవ్రమైన సమస్య అవుతుంది.