మ్యూజిక్ లవర్స్ కోసం 5 బెస్ట్ మ్యూజిక్ యాప్స్…
ఇప్పుడు మేము ఈ ఆర్టికల్లో కొన్ని ప్రత్యేకమైన అప్లికేషన్ల గురించి మీకు చెప్తాము. అటువంటి కొన్ని గొప్ప మ్యూజిక్ అప్లికేషన్లు గురించి ఇక్కడ తెలుసుకోండి .
1. 4Shared Music
ఇది గొప్ప మ్యూజిక్ అప్లికేషన్. మీరు ఈ అప్లికేషన్ గురించి ఇంతకుముందే తెలిసే ఉంటుంది . ఈ రోజుల్లో చాలా మంది పాటల కోసం దీనిని డౌన్లోడ్ చేసుకుంటున్నారు .
4Shared Music ఫీచర్స్ చూస్తే ఇది 30,000,000+ ఫైళ్ళను వేగంగా యాక్సెస్ చేయగలదు,మీరు ఆన్లైన్ మ్యూజిక్ మరియు వీడియో రెండింటినీ చూడటానికి అనుమతిస్తుంది.15 GB మ్యూజిక్ స్పేస్ కలదు.
2. Anghami
ఇది చాలా ప్రజాదరణ పొందిన మ్యూజిక్ యాప్ . ఎప్పుడైనా ఉచిత సంగీతాన్ని వినడానికి మీరు ఈ యాప్ ఉపయోగించవచ్చు.Instagram, Whatsapp, ట్విట్టర్, ఫేస్బుక్ లో ప్రతి ఒక్కరితో మీకు ఇష్టమైన పాటలను షేర్ చేయండి,Anghami సబ్స్క్రయిబ్ చేసి మరియు ఏ యాడ్ లేకుండా ఉచితంగా అపరిమిత పాటలు వినండి.
3. Wynk Music
మీరు వింక్ మ్యూజిక్ గురించి ఇంతకుముందే విన్నారు . భారతీయ మరియు ఇంటర్నేషనల్ మ్యూజిక్ లో 2.5 మిలియన్ల పాటలు ఉన్నాయి. ఇది బాలీవుడ్, పాప్, రాక్, భాంగ్రా, భక్తి, భావోద్వేగ, రొమాంటిక్ , పార్టీ, ఓల్డ్ రొమాంటిక్ రెట్రో పాటల అన్ని సేకరణలను కలిగి ఉంది.
4. Google Play Music
చాలా మంది తరచుగా పాటలు వినడానికి Google మ్యూజిక్ ప్లేయర్ ని ఉపయోగిస్తారు. ఇది మీకు ఉచిత సంగీతాన్ని అందిస్తుంది.దీనిలో 50,000 కన్నా ఎక్కువ పాటలను స్టోర్ చేయవచ్చు.Android, iOS లో అందుబాటులో ఉంది.
5. Gaana: Bollywood Music & Radio
భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే మ్యూజిక్ యాప్ గా ప్రస్తుతం దీనిని చెప్పవచ్చు . గత ఒకటి మరియు రెండు సంవత్సరాలలో, ఈ అప్లికేషన్ భారతదేశం లో ట్రెండ్ సృష్టించింది . 10 మిలియన్ల కంటే ఎక్కువ ఇంగ్లీష్ మరియు హిందీ పాటల కెపాసిటీ కలిగి వుంది .
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile