మొబైల్ ఫోన్ వాడే ప్రతిఒక్కరికి పరిచయం చేయాల్సిన అవసరం లేని వాటిలో Whatsapp ఒకటి. ఈ యాప్ లేకుండా ఒక ఫోన్ ఉండదు అనేది జగమెరిగిన సత్యం. అయితే, అందరూ ఈ యాప్ వాడుతున్న కూడా చాలా మందికి దీనికి సంబంధిన చాలా ట్రిక్స్ తెలియవు. ఉదాహరణకు, రోజంతా వాట్స్ ఆప్ లో కాలింగ్ చేసినా కూడా చాలా తక్కువ డేటాని ఎలావాడాలి, చదివిన చాట్స్ ని ఎలా ఆటోమాటిగ్గా అదృశ్యం చేయాలి లేదా ఒక గ్రూప్ లో మీరు పెట్టిన మెసేజీని ఎవరు చదివారు వంటి అనేకమైన విషయాలు, ఇప్పటికీ చాలా మందికి తెలియవు. అందుకే Whatsapp లో మీకు అవసరమైన మరియు మీకు ఉపయోగపడే 5 టాప్ ట్రిక్స్ అండ్ టిప్స్ ఈరోజు ఇక్కడ అందిస్తున్నాను.
ప్రస్తుతం టెలికం సంస్థలు అన్ని కూడా తమ రేట్లను పెంచేశాయి. కాబట్టి, కొందరు సరిపడినంత డేటా ప్లాన్స్ మాత్రమే రీఛార్జ్ చేస్తున్నారు. అటువంటి వారికీ ఈ చిట్కా సరిగ్గా సరిపుతుంది. ఈ చిట్కాతో చాలా తక్కువ డేటా ఉపయోగించి ఎక్కువ కాలింగ్ చేసుకోవచ్చు. ఇందుకోసం, మీరు మీ ఫోన్లోని సెట్టింగ్ కి వెళ్లి అందులోని డేటా మరియు స్టోరేజి యూసేజి కి వెళ్లి అక్కడ లో డేటా యూసేజి ని ఎంచుకోవాలి. దీనితో మెకాలింగ్ క్షయమ్ తక్కువ డేటా వినియోగం అవుతుంది.
మనం ఒక మెసేజి పంపిన లేదా మనకు వచ్చిన మెసేజీని మనం చుసిన వెంటనే అవతలి వారికీ బ్లూ టిక్ కనిపిస్తుంది. అయితే, అవతలి వారికీ మనం వారి మెసేజీని చునా కూడా తెలియాకుండా చెయ్యాలంటే, ఈ ట్రిక్ ఉపయోగపడుతుంది. మీ కాంటాక్స్ లో ఎవరెవరికి ఈ సౌలభ్యాన్ని ఎనేబుల్ చేయలనుకుంటారో వారికీ ఇలా చెయ్యొచ్చు. ఇందుకోసం, సెట్టింగ్స్ లోకి వెళ్లి అక్కౌంట్ ఓపెన్ చేసి అందులో ప్రైవసీ ని ఎంచుకొని లోపల రీడ్ రెసిప్ట్స్ ని టిక్ చేయాలి.
Settings > Account > Privacy అండ్ సెలెక్ట్ Read Receipts.
ఈ మధ్య కాలంలో గ్రూప్ చాట్స్ పైన ఎక్కువగా whatsapp ద్రుష్టి పెట్టింది. మీరు ఒక గ్రూప్ లో పెట్టిన మెసేజీని, ఎవరెవరు చదివారు అన్న విషయం తెలుసుకోవడానికి కూడా ఒక సులభమైన పద్దతి వుంది. ఇది ఆసక్తి కరంగా ఉంటుంది. ఎందుకంటే, మనము వేసే జోకులు లేదా మన ఆలోచనలను ఆ గ్రూపులో ఎవరెవరు చదువుతున్నారు లేదా ఇష్టపడుతున్నారో తెలుసుకోవచ్చు. దీని కోసం, మీరు చేసిన మెసేజి పైన నొక్కి పట్టుకోండి. అప్పుడు ఆ మెసేజి హైలైట్ అవుతుంది, తరువాత ఆ మెసేజి పైన వచ్చే మూడు చుక్కలు మెనూను ఎంచుకోండి. ఇక్కడ మీరు info పెయిన్ నొక్కడంతో మీ మెసేజీని ఆ గ్రూపులో ఎవరెవరు చదివారో లిస్ట్ గా వస్తుంది.
మనం ఎక్కడ ఉన్నాము అన్న విషయాన్నీ Share Location ద్వారా చాల సులభంగా చెప్పొచ్చు. అంతేకాదు, మీరు ఎప్పటి నుండో ఈ పని చేస్తుంటారు. కానీ, మీరు ఎక్కడెక్కడికి వెళుతున్నారు, రూట్ లో ప్రయాణిస్తున్నారో అనే విషయాలను కూడా మీ కుటుంబ సభ్యులు LIVE లో చూడవచ్చు. దీనికోసం, పేపర్ క్లిప్ ని ఎంచుకొని, అందులో Location లోకి వెళ్లాలి. ఇక అక్కడ Share Live Location పెయిన్ నొక్కాలి. ఇక్కడ మీరు యెంత సమయం వాళ్ళు మీమ్మల్ని Live గా చూడాలనుకుంటున్నారో, ఆ టైం ను సెట్ చేసి షేర్ చెయ్యాలి.
మన దైనందిన whatsapp వాడుకలో చాలా మెసేజిలు మరియు ఫైల్స్ మనకు అందుతాయి మరియు మనం ఇతరులకు కూడా పంపిస్తాము. అయితే, వాటిలో కొన్ని మనకు చాలా ఉపయోగపడేవి లేదా మనకు ముఖమైనవిగా ఉంటాయి. మరి అటువంటి వంటి వాటిని మన డ్రైవ్ లో సేవ్ చేసినట్లయితే, దాన్ని కొన్ని రోజుల తరువాత వెతకడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అటువంటి చాట్స్ లేదా ఫైల్స్ ను మనకు కావాల్సిన మెయిల్ ఐడి కి మెయిల్ చేయవచ్చు.
అందుకోసం, ముందుగా సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్ లోకి వెళ్లిన తరువాత, చాట్స్ ఎంచుకొని అందులో చాట్ హిస్టరీ పైన ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ చాట్ ని ఎంచుకోవాలి. ఇక్కడ మీకు కావాల్సిన కాంటాక్ట్ యొక్క చాట్ హిస్టరీని మీకు కావాల్సిన మెయిల్ లేదా డ్రైవ్ లేదా మరింకేదైనా ఇతర స్టోరేజి లోకి పంపవచ్చు. ఇక్కడ చూపిన ఎంపికల ప్రకారం మీరు కావాల్సిన దానిని ఎంచుకోవచ్చు.
Settings > Chats > Chat History > Export Chat