షావోమి ఫోన్లలో యాడ్స్ ని తొలగించడం చాలా సింపుల్

షావోమి ఫోన్లలో యాడ్స్ ని  తొలగించడం చాలా సింపుల్
HIGHLIGHTS

MIUI లో యాడ్స్ మిమ్మల్ని ఎక్కువగా బాధపెడుతున్నాయా

మీ షియోమీ ఫోన్ లో యాడ్స్ ని నిలిపివేయాలా

షియోమీ ఫోన్లలో మీరు ప్రకటనలను ఎలా నిలిపివేయవచ్చో ఇక్కడ తెలుసుసుకోవచ్చు.

 Xiaomi స్మార్ట్ ‌ఫోన్లు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను అందించే ఫోన్లుగా ఉన్నప్పటికీ, వీటిని నడిపించే  MIUI లో అతిగా కనిపించే యాడ్స్ అసహనానికి గురిచేస్తాయి. ఎక్కువ యాడ్స్ ని చూపించడం ఒక్కటి వదిలిపెడితే,  అన్నివిషయాల్లో ఇది మెరుగ్గా అనిపిస్తుంది. అయితే, ఈ యాడ్స్  నేరుగా పాపప్ అవ్వవు, బదులుగా  మి వీడియో, మి బ్రౌజర్, మి మ్యూజిక్, గెట్ యాప్స్ మరియు షేర్ మీ వంటి డిఫాల్ట్ యాప్స్ ద్వారా ప్రచారం చేయబడతాయి.

కాబట్టి, MIUI ప్రకటనలు మిమ్మల్ని ఎక్కువగా బాధపెడితే మరియు మీరు మీ షావోమి స్మార్ట్‌ ఫోన్ల‌లోని ప్రకటనలను వదిలించుకోవాలని చూస్తున్నట్లయితే, MIUI 10 తో నడుస్తున్న షావోమి ఫోన్లలో మీరు ప్రకటనలను ఎలా నిలిపివేయవచ్చో ఇక్కడ తెలుసుసుకోవచ్చు.

Step 1 : MIUI సిస్టమ్ ప్రకటనలను నిలిపివేయండి

  • సెట్టింగుల మెనూకు వెళ్లండి.
  • ఆథరైజేషన్ మరియు రివొకేషన్ కోసం సెర్చ్ చేయండి
  • పాస్‌వర్డ్స్ & సెక్యూరిటీ  క్రింద ఆథరైజేషన్ మరియు రివొకేషన్ ఎంపికపై నొక్కండి
  • యాప్స్ లిస్ట్ నుండి, “MSA” ఎంచుకోండి మరియు టోగుల్ బటన్ నొక్కండి.

  • మీరు టోగుల్‌పై నొక్కినప్పుడు, “Revoking authorisation” యాక్షన్ ని కన్ఫర్మ్ చెయ్యమని పాప్-అప్ అడుగుతుంది.
  • Revoke పై నొక్కండి మరియు ఇది MIUI సిస్టమ్ ప్రకటనలను (MSA)ను ఆపివేస్తుంది.

Step  2: పర్సనలైజ్డ్ యాడ్ రికమండేషన్ ను డిసేబుల్ చేయడం

  • సెట్టింగుల మెనూకు వెళ్లండి
  • పాస్‌వర్డ్స్ & సెక్యూరిటీ ఎంచుకోండి మరియు ప్రైవసి పైన నొక్కండి
  • యాడ్ సర్వీస్ కోసం క్రిందికి స్క్రోల్ చేయండి
  • పర్సనలైజ్డ్ యాడ్ రికమండేషన్ ను డిసేబుల్ చేయడానికి టోగుల్ బటన్ నొక్కండి.
  • ప్రత్యామ్నాయంగా, ప్రకటన సేవల మెనుని త్వరగా యాక్సెస్ చేయడానికి మరియు మీ షావోమి ఫోన్ ‌లో చూపిన ప్రకటనల కోసం [పర్సనలైజెషన్ నిలిపివేయడానికి మీరు సెట్టింగుల సెర్చ్ బాక్స్ లో “Personalised ad recommendations” అని వెతకవచ్చు .

Step 3: సిస్టమ్ యాప్స్ నుండి ప్రకటన సేవలను నిలిపివేయడానికి

ఇప్పుడు, మి బ్రౌజర్, మి సెక్యూరిటీ, మి మ్యూజిక్, మి వీడియో మరియు ఇటువంటి మరిన్ని వివిధ డిఫాల్ట్ సిస్టమ్ యాప్స్ నుండి రికమండేషన్స్ తీసివేద్దాం.

  • Mi బ్రౌజర్‌ను తెరవండి
  • మెను చిహ్నాన్ని నొక్కడం ద్వారా సెట్టింగ్‌లకు నావిగేట్ చేయండి
  • సెట్టింగుల మెను క్రిందికి స్క్రోల్ చేసి, ADVANCED ను ఎంచుకోండి
  • ఇక్కడ, “SHOW ADDS” టోగుల్‌ను నిలిపివేయండి.

  • తరువాత, మి సెక్యూరిటీ యాప్ తెరవండి
  • సెట్టింగుల మెనుని యాక్సెస్ చేయడానికి మూలలో ఉన్న గేర్ చిహ్నాన్ని నొక్కండి
  • క్రిందికి స్క్రోల్ చేయండి మరియు Receive Recommendations ని నిలిపివేయండి

  • డౌన్‌లోడ్ యాప్  తెరవండి
  • ఎగువ మూలలో ఉన్న మూడు-డాట్స్ చిహ్నంపై నొక్కండి మరియు సెట్టింగ్‌లపై నొక్కండి
  • “Show recommended content” డిసేబుల్ చేయండి

  • మి ఫైల్ మేనేజర్ యాప్ తెరవండి
  • మెను చిహ్నంపై నొక్కండి మరియు సెట్టింగులను ఎంచుకోండి
  • About కి వెళ్లి “Recommendations” టోగుల్‌ను డిసేబుల్ చెయ్యండి

  • మి మ్యూజిక్ యాప్ తెరవండి
  • మెను చిహ్నంపై నొక్కండి మరియు జాబితా నుండి సెట్టింగులను ఎంచుకోండి
  • మెనులో Advance సెట్టింగ్స్ పైన నొక్కండి
  • అదనపు సెట్టింగ్స్ కేటగిరికి స్క్రోల్ చేయండి
  • ఈ కేటగిరి క్రింద  అన్ని recommendations  టోగుల్స్ను నిలిపివేయండి

  • మి వీడియో యాప్ తెరవండి
  • ప్రొఫైల్‌కు వెళ్లి సెట్టింగ్‌లపై నొక్కండి
  • పర్సనలైజ్డ్ రికమండేషన్స్ కేటగిరి క్రింద, “ఆన్‌లైన్ రికమండేషన్స్” మరియు “పర్సనలైజ్డ్ రికమండేషన్స్ ” టోగుల్ చేయండి

  • థీమ్స్ యాప్  తెరవండి
  • మై పేజీకి వెళ్లి సెట్టింగులను నొక్కండి
  • జాబితా నుండి టోగుల్ చేయడానికి రికమండేషన్స్ నిలిపివేయండి

  • మీరు ఏదైనా ప్రమోటెడ్ యాప్స్ ను నిలిపివేయాలనుకుంటే, ఆ ఫోల్డర్‌ను తెరవండి
  • ఫోల్డర్ పేరుపై నొక్కండి మరియు ఫోల్డర్ పేరు మార్చడానికి మిమ్మల్ని అడుగుతుంది
  • ఫోల్డర్ పేరు మార్చడానికి ఇచ్చిన ఎంపిక క్రింద “ప్రమోటెడ్ యాప్స్” టోగుల్.
  • రికమండేషన్స్ ప్రారంభించడానికి టోగుల్ను నిలిపివేయండి

 

  • GetApps యాప్స్ స్టోర్ కోసం నోటిఫికేషన్స్ ను నిలిపివేయడం చాలా సులభం
  • GetApps నుండి ప్రకటనల కోసం మీరు పుష్ నోటిఫికేషన్‌ను చూసినప్పుడల్లా, నోటిఫికేషన్‌ను ఎక్కువసేపు నొక్కి, పుష్ నోటిఫికేషన్‌లను నిలిపివేయండి.
  • ఇది GetApps నుండి అన్ని నోటిఫికేషన్‌లను నిలిపివేస్తుందని గమనించండి

షావోమికి MIUI 10 లో రికమండేషన్స్ తొలిగించడానికి చాలా సెట్టింగులు ఉన్నాయి మరియు ఈ సాధారణ స్టెప్స్ తో మీ షావోమి ఫోను‌లో మీరు రోజూ చూస్తున్న అవాంఛిత యాడ్స్  నుండి మీకు పూర్తి స్వేచ్ఛలభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo