Gold Price: ఒక రేంజ్ లో పెరిగిన బంగారం ధర..New Rate ఎంతంటే.!
Gold Price: దేశంలో బంగారం ధర ఒక రేంజ్ లో పెరుగుతోంది
గోల్డ్ రేట్ రూ. 4,500 రూపాయలకు పైగా పెరుగుదలను నమోదు చేసింది
బంగారం ధర మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు
Gold Price: దేశంలో బంగారం ధర ఒక రేంజ్ లో పెరుగుతోంది. అక్టోబర్ నెల ప్రారంభంలో ఉన్న గోల్డ్ రేట్ తో పోలిస్తే ప్రస్తుతం గోల్డ్ రేట్ రూ. 4,500 రూపాయలకు పైగా పెరుగుదలను నమోదు చేసింది. అంతేకాదు, బంగారం ధర మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్న అంచనా సూచనలు పసిడి ప్రియులకు మరింత బాధ కలిగించే విషయం అవుతుంది.
Gold Price:
ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ ప్రస్తుతం రూ. 61,750 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 56,600 రూపాయల వద్ద కొనసాగుతోంది.
అక్టోబర్ గోల్డ్ మార్కెట్ అప్డేట్:
ప్రస్తుతం బంగారం ధర మార్కెట్ లో 62 వేల రూపాయల మార్క్ కు అతి చేరువలో వుంది. దీనికి తోడు ఇది పండుగ సీజన్ కావడం, అంతర్జాతీయ మార్కెట్ లో నడుస్తున్న ప్రస్తుత వార్ వాతావరణం, అన్ని కలసి బంగారం ధరను మరింత వేగంగా పెంచేస్తున్నాయి. నిపుణులు చెబుతున్న మాట నిజమే అయితే, బంగారం ధర అతి త్వరలోనే 64 వేల ను తాకవచ్చు.
Also Read : Amazon ధమాకా: రూ. 5,999 కే 8GB RAM ఫోన్ మరియు TWS ఇయర్ బడ్స్ అందిస్తోంది.!
ఇక ఈ నెల మొత్తం కొనసాగిన గోల్డ్ మార్కెట్ వివరాలను పరిశీలిస్తే, అక్టోబర్ 1 న రూ. 58,200 రూపాయల వద్ద ప్రారంభమైన బంగారం ధర అక్టోబర్ 5వ తేదీ వరకూ కూడా భారీ నష్టాలను చవి చూసి రూ. 57,160 రూపాయల కనిష్ట రేటును చేరుకుంది. అయితే, అక్టోబర్ 7వ తేదీ నుండి గోల్డ్ మార్కెట్ ఊపందుకుంది.
అక్టోబర్ 7 నుండి మొదలైన గోల్డ్ రేట్ హైక్ ఈరోజు వరకూ కూడా కొనసాగుతూనే వుంది. గడిచిన 15 రోజుల్లో బంగారం ధర దాదాపుగా 4,500 రూపాయలకు పైగా పెరిగిందంటే మీరే అర్ధం చేసుకోవచ్చు గోల్డ్ మార్కెట్ ఎంత స్పీడ్ గా సాగుతోందో.
గత నెలతో పోలిస్తే గోల్డ్ రేట్ ఈ నెల చాలా పీక్ రేట్ ను చూసింది. కానీ, గత నెల మొత్తం బంగారం మార్కెట్ దాదాపుగా స్థిరంగానే కొనసాగింది.