Gold Price Hike: ఆల్ టైం రికార్డ్ రేటును నమోదు చేసిన గోల్డ్ మార్కెట్.!
గోల్డ్ రేట్ ఈరోజు భారీ పెరుగుదలను నమోదు చేసింది
నిన్న మొన్నటి వరకు 69 వేల వద్ద తిరుగాడిన గోల్డ్ రేట్
గోల్డ్ రేట్ ఈరోజు ఏకంగా 70 వేల మార్క్ ను తాకింది
Gold Price Hike: నిన్న మార్కెట్లో స్వల్పంగా కిందకు దిగజారిన గోల్డ్ రేట్ ఈరోజు భారీ పెరుగుదలను నమోదు చేసింది. గోల్డ్ మార్కెట్ ఇప్పటికే ఆల్ టైం గరిష్ట రేటును నమోదు చేసింది. ఈరోజు పెరిగిన రేటు దెబ్బకి గత రికార్డులు చెరిపివేసి కొత్త రికార్డు రేటును నమోదు చేసింది. నిన్న మొన్నటి వరకు 69 వేల వద్ద తిరుగాడిన గోల్డ్ రేట్, ఈరోజు ఏకంగా 70 వేల మార్క్ ను తాకింది.
Gold Price Hike
ఈరోజు గోల్డ్ రేట్ భారీగా లాభాలను నమోదు చేసింది. మార్కెట్ ప్రారంభమావుతూనే ఉదయం రూ. 69,110 రూపాయల వద్ద మొదలైన గోల్డ్ రేట్ రూ. 760 రూపాయల పెరుగుదలను చూసి రూ. 69,870 రూపాయల వద్ద కొనసాగింది. ఈ వారంలో, గడిచిన మూడు రోజుల్లో బంగారం ధర రూ. 1,500 రూపాయల వరకు పెరుగుదలను నమోదు చేసింది.
ఇక గత 10 రోజుల గోల్డ్ రేట్ మరియు మార్కెట్ అప్డేట్ ను చూస్తే, గడిచిన 10 రోజుల్లో గోల్డ్ రేట్ అతి భారీ లాభాలను చూసింది. ఈ 10 రోజుల్లో బంగారం ధర రూ. 3,050 రూపాయలు పెరిగింది. అంతేకాదు, ఈరోజు గోల్డ్ మార్కెట్ ఎన్నడూ చూడని విధంగా రూ. 69,870 రూపాయల ఆల్ టైం గరిష్ట రేటును నమోదు చేసింది.
Also Read: Samsung Galaxy M15 5G ఈ టాప్ 5 ఫీచర్స్ తో ఏప్రిల్ 8న లాంఛ్ అవుతోంది.!
గోల్డ్ రేట్ 70 దాటుతుందని నిపుణులు చెబుతున్న మాటలు నిజం చేసింది గోల్డ్ మార్కెట్. ఇప్పటికే 70 వేలను చేరుకున్న గోల్డ్ మార్కెట్ మరింత పైపైకి చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేసి చెబుతున్నారు. అంటే, గోల్డ్ రేట్ ఇంకెన్ని రికార్డ్ రేటులను నమోదు చేస్తోందో అని పసిడి ప్రియులు వాపోతున్నారు.
ఇప్పటికే, దారుణంగా పెరిగిన బంగారం ధర దెబ్బకి బంగారం కొనాలని చూసే గోల్డ్ ప్రియుల ఆశలు ఆవిరి అయ్యాయి. ఇదే జోరుతో గోల్డ్ మార్కెట్ కొనసాగితే బంగారం ధర ఇంకెక్కడికి చేరుకుంటున్నావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
24 క్యారెట్ గోల్డ్ రేట్
ఈరోజు నమోదైన 24 క్యారెట్ బంగారం రేటును చూస్తే, ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్ రూ. 69,870 రూపాయల రేటును హిట్ చేసింది. నిన్న మార్కెట్ లో కొనసాగిన గోల్డ్ రేటుతో పోలిస్తే తులానికి రూ. 760 రూపాయల భారీ పెరుగుధలను చూసింది.
22 క్యారెట్ గోల్డ్ రేట్
ఈరోజు 22 క్యారెట్ గోల్డ్ రేట్ ను పరిశీలిస్తే, 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర ఈరోజు రూ. 63,350 వద్ద మొదలై రూ. 64,100 వద్ద ముగిసింది. అంటే, ఈరోజు 22 క్యారెట్ గోల్డ్ రేట్ తులానికి రూ. 750 రూపాయల పెరుగుదలను చూసింది.