Yunicorn ఫోన్ లాంచ్ అయ్యింది ఇండియాలో. దీనిని మేము వాడుతున్నాము. ఇక్కడ మా మొదటి అభిప్రాయాలను చూడండి.
మీడియా టెక్ Helio P10 SoC తో, మొదటిసారిగా సబ్ 15K బడ్జెట్ లో 4GB ర్యామ్ ఇస్తూ 13MP రేర్ అండ్ 5MP ఫ్రంట్ కేమేరాస్ అండ్ 4000 mah బ్యాటరీ కలిగి ఉంది ఫోన్.
ఫోన్ చూడటానికి Meizu M3 నోట్ లా ఉంటుంది. డిజైన్ విషయం లో రెడ్మి నోట్ 3 లా ఉంటుంది. కాని ఓవర్ ఆల్ గా ఫోన్ మాత్రం ప్రీమియం గా ఉంది.
ఫోన్ ఫ్రంట్ లో 2.5D గ్లాస్, YU లోగో మరియు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. Meizu M3 నోట్ కన్నా కొంచెం ఎక్కువ బరువు ఉంది.
Yu Yunicorn (Top), Yu Yunicorn and Meizu M3 Note (Bottom)
టోటల్ గా పాత YU ఫోనులతో పోలిస్తే ఇది మిగిలిన ఫోనుల్లా సేమ్ కాపీ డిజైన్ తో వచ్చినా ప్రీమియం లుక్స్ తో అప్ గ్రేడ్ అయ్యింది అని చెప్పాలి.
ఈ ఫోన్ తో పాటు Android On Steroids (AOS) అనే OS ను ప్రవేశ పెడుతున్నాము అని చెప్పింది కాని లుక్స్ వైజ్ గా సేమ్ ఒరిజినల్ ఆండ్రాయిడ్ లాలిపాప్ లానే ఉంది. కేవలం యాప్స్ యోక్క్ ఐకాన్స్ కు మాత్రమే boardering changes ఉన్నాయి.
ఫీచర్ పరంగా లాస్ట్ ఇయర్ Yutopia తో లాంచ్ చేసిన Around Yu ఫీచర్ ను 2.0 కు అప్ గ్రేడ్ చేసింది. ఇది జనరల్ గా మీ దగ్గరిలో ఉన్న అవసరాలను అందించే యాప్ లాంటి YU సర్విస్.
ola లేదా uber యాప్స్ ను డౌన్లోడ్ చేయకుండానే క్యాబ్స్ బుకింగ్, ఇప్పుడు సరి క్రొత్తగా లాంచ్ అయిన Udio wallet ద్వారా recharges కూడా చేస్తుంది.
కాని దీనిలోని Helio P10 SoC (SoC అన్నా, ప్రొసెసర్ అన్నా ఒకటే. SoC అంటే సిస్టం ఆన్ చిప్ సెట్) రెడ్మి నోట్ 3 లో ఉన్న స్నాప్ డ్రాగన్ 650 SoC కన్నా weak గా ఉంది మా మొదటి బెంచ్ మార్క్స్ టెస్ట్ లో. 4GB ర్యామ్ ఉన్నా, ప్రొసెసర్ లో పవర్ లేకపోతే, ర్యామ్ ఎంత ఎక్కువ ఉన్నా లాభం లేదు.
13MP రేర్ కెమెరా చూడటానికి రెడ్మి లోని 16MP కెమెరా తో సమానంగా ఉంది ఇమేజ్ క్వాలిటీ విషయం లో. కాని Yunicorn లో కెమెరా స్లో గా ఉంది. కెమెరా పై మరింత సమయం గడిపి కంప్లీట్ రివ్యూ లో ఫైనల్ conclusion అందిస్తాను.
ఫైనల్ గా కేవలం ప్రైస్ లో ఫోనే redefining గా ఉంది అని చెప్పాలి. మిగిలిన విషయాలలో normal ఫోన్ ఇది. బాడీ అండ్ డిజైన్ ప్రివియస్ ఫోనులతో అప్ గ్రేడ్ అయినప్పటికీ ఆ డిజైన్ లేదా built తో ఆల్రెడీ మార్కెట్ లో చాలా ఫోనులు ఉన్నాయి.
Outdoor normal daylight (Top), Indoor Normal (Bottom Left) and Studio White Lights (Bottom Right)