YU Yutopia ఫర్స్ట్ ఇంప్రెషన్స్ – మొదటి అభిప్రాయాలు
నిన్న ఇండియాలో హై ఎండ్ స్పెక్స్ తో 24,999 రూ బడ్జెట్ లో Yutopia పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయటం జరిగింది దీనిపై కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ లింక్ లో ఉంది..
మొదటి పాయింట్.. లుక్స్ వైజ్ గా దీనిలో కొత్త ఇన్నోవేటివ్ గా ఏమీ లేదు. మెటల్ బాడీ తో వస్తుంది. అయితే మెటల్ ఇప్పుడు చాలా ఫోన్స్ లో కనిపిస్తుంది.
5.2 in తో యుఫోరియా ఫోన్ వలె ఉంది చూడటానికి. కాని ఫుల్ మెటల్ బాడీ దీనిలో. అంతే డిఫరెన్స్. వెనుక saturn రింగ్ డిజైన్ తో కెమేరా module ఉంది. దీని లోపల 21MP సెన్సార్ ఉంటుంది.
కెమేరా క్వాలిటీ గురించి ఇప్పుడే చెప్పలేము కాని ఫోకస్ అండ్ ఇమేజ్ ప్రోసెసింగ్ కు oneplus 2 కన్నా ఎక్కువ టైమ్ తీసుకుంటుంది. కాని ప్రైస్ సేమ్. కాని oneplus 2 కన్నా ఇది కాంపాక్ట్ గా ఉంటుంది. సింగల్ హ్యాండ్ usage.
డిస్ప్లే మాత్రం చాలా ఫోన్స్ కన్నా dim గా ఉంది. మోస్ట్ పవర్ ఫుల్ ఫోన్ అని మార్కెటింగ్ చేసింది కాని కూలింగ్ fluids ఏమీ లేవు స్నాప్ డ్రాగన్ 810 ప్రొసెసర్ తో. కేవలం సాఫ్ట్ వేర్ ద్వారానే ఉన్నాయి కూలింగ్ ఆప్టిమైకేషన్స్ కాని ఇంతవరకూ ఇవి పనిచేయటం లేదు.
4gb ర్యామ్ మల్టీ టాస్కింగ్ కు మంచి ఆప్షన్. ఇంతవరకూ పైన చెప్పిన మైనస్ పాయింట్స్ కారణంగా నేను YU కు పెద్ద ఫాన్ కాదని అనిపించవచ్చు. కానీ నేను కేవలం ఇప్పటివరకూ గమనించిన విషయాలను చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాయి.
సో yutopia ఇన్నోవేటివ్ గా కాకపోయినా ఫోన్ తో పాటు రిలీజ్ AroundYU ఫీచర్ బాగుంది. HTC బ్లింక్ ఫీడ్ నుండి ఇంస్పైర్ అయినట్లు కనిపిస్తుంది. దాని కన్నా బెటర్ గానే ఉంది ప్రస్తుతానికి.
AroundYU అనేది ఫోన్ పై కనిపించే one of the స్క్రీన్. గూగల్ నౌ కార్డ్స్ లా లెఫ్ట్ కు స్వైప్ చేస్తే వస్తుంది. ఫుడ్, క్యాబ్స్, హోటల్స్, ఫ్లైట్స్ etc వంటి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది.
UI లుక్స్ వైస్ గా బాగుంది. ఏదో యాడ్ చేయాలని చేసినట్లు కనపడటం లేదు. కాని ఒక్క విషయం చెప్పాలి YU కేవలం డివైజెస్, స్పెక్స్ అనే కాకుండా యూసర్ ఎక్స్పీరియన్స్ ను కూడా దృష్టిలో ఉంచుకొని Around YU డెవలప్ చేయటం మంచి స్టెప్. ఆఫ్ కోర్స్ అరౌండ్ YU సూపర్ ఫీచర్ కాకపోవచ్చు.
yutopia సక్సెస్ లేదా ఫ్లాప్ అనేది పక్కన పెడితే YU ఫ్యూచర్ లో కొన్ని మంచి డివైజెస్ ను తేవనుంది అని అంచనాలను క్రియేట్ చేసింది నాకు. ఇది guaranteed అప్ డేట్ పాలసీ తో కూడా వస్తుంది.
yutopia ను emi ద్వారా తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ రాబోయే yutopia 2 కు 40% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఇది ఆపిల్ యొక్క ప్రాసెస్. ఇప్పుడు ఇండియాలో కూడా అలాంటి అవకాసాలను ఇచ్చే కంపెని వచ్చింది.