5,000 రూ బడ్జెట్ సెగ్మెంట్ లో లావా, లెనోవో, phicomm వంటి బ్రాండ్లు ఇంతవరకూ పోటీ లేకుండా మార్కెట్ లో చాలా మని అయ్యాయి. ఇప్పుడు మైక్రోమ్యాక్స్ సబ్ బ్రాండింగ్ YU నుండి 4,999 రూ YU Yunique అనే మోడల్ లాంచ్ అయ్యింది.
YU Yunique ను నిన్నటి నుండి మేము వాడుతున్నాము. మేము తెలుసుకున్న విషయాలను ఇక్కడ షేర్ చేస్తున్నాం. ఇది సేమ్ యుఫోరియా మోడల్ వలె ఉంది చూడటానికి.
దీని లో 4.7 in డిస్ప్లే IPS LCD HD రిసల్యుషణ్ తో వస్తుంది. ఇది 7K బడ్జెట్ లో దొరికే మొబైల్స్ కన్నా గొప్ప డిస్ప్లే కాదు కాని 5000 రూ లకు ఇదే మంచి డిస్ప్లే అని చెప్పవచ్చు.
వెనుక మ్యాటీ ఫినిషింగ్ బ్యాక్ ప్యానల్ ఉంది. మైక్రోమ్యాక్స్ xpress 2 లా కనిపిస్తుంది. ఫోన్ కు రైట్ సైడ్ వాల్యూమ్ బటన్స్ మధ్యలో పవర్ బటన్ ఉండేలా డిజైన్ చేసింది YU.
ఫోన్ స్క్రీన్ 4.7 in కావటం వలన బరువుగా అనిపించటం లేదు Yunique. స్లిమ్ గా కూడా ఉంది. దీనిలో స్నాప్ డ్రాగన్ 410 SoC 5K బడ్జెట్ లో ఇదే మొదటి ఫోన్ ఈ ప్రొసెసర్ తో.
దీనిలో 1gb ర్యామ్ ఉంది కాని నేను నిజంగా దీని పెర్ఫార్మన్స్ కు ఇంప్రెస్ అయ్యాను బడ్జెట్ పరంగా. 8gb ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 32 అదనపు స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది. మైక్రోమ్యాక్స్ spark లో కూడా సేమ్ కాంబినేషన్ ఉంది. కానీ అది కొన్ని సార్లు లాగ్ ఇస్తుంది.
దానితో పోలిస్తే yunique ఫాస్ట్ గా ఉంది అని చెప్పాలి. asphalt 8 అండ్ sky force వంటి గేమింగ్ చేసినప్పుడు బాధపడే అంత పెర్ఫార్మన్స్ issues రాలేదు. జస్ట్ మైనర్ లాగ్ అంతే!
ఇంటర్ఫేస్ విషయానికి వస్తే, స్టాక్ ఆండ్రాయిడ్ లేటెస్ట్ లాలిపాప్ వెర్షన్ 5.1.1 పై నడుస్తుంది. దీనితో పాటు మీరు ఫోన్ root చేసుకొని cyanogen 12.1 os ను కూడా అప్ గ్రేడ్ చేసుకోవచ్చు.
సాధారణంగా ఇలాంటి సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ లు చేస్తే కంపెనీలు వారెంటీ ను కాన్సిల్ చేస్తాయి. కాని Yunique లో రూటింగ్ అండ్ custom rom ఫ్లాషింగ్ చేసిన వారెంటీ పోదు అని యు స్పష్టంగా చెప్పింది.
8MP కెమేరా లో మంచి ఇమేజెస్ వస్తున్నాయి. ample లైటింగ్ కండిషన్స్ లో తీసే ఫోటోస్ మంచి కలర్స్ తో వస్తున్నాయి. డైనమిక్ ర్యాంజ్ కొంచెం ఇంకా బాగుంటే నచ్చుతుంది. Low లైట్ లో తీసిన ఫోటోస్ లో noise కనిపిస్తుంది. కాని ఈ ప్రైస్ కు మిగిలిన వాటి కాన్నా బెటర్.
Buy Yu Yunique at Rs. 4,999 on Snapdeal