Xiaomi Mi 5: పెర్ఫార్మన్స్ ఎనాలిసిస్ అండ్ కంపేరిజన్

Updated on 07-Apr-2016

చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ అయ్యుండీ, Xiaomi తక్కువ ధర లో లభ్యమయ్యే బ్రాండ్ కాని high value ఉన్నది కూడా అని పేరు తెచ్చుకుంది.

ఒకప్పుడు బాగా హల్ చల్ చేసిన బ్రాండ్ ఇప్పుడు oneplus, హానర్, Meizu వంటి కంపెనీల వలన కొంత మార్కెట్ లో డౌన్ అయ్యింది. అయితే ఇవేమీ లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 820 ప్రొసెసర్ తో ఇండియాలో ఫోన్ లాంచ్ చేయలేదు.

కేవలం Xiaomi ఒక్కటే Mi 5 ద్వారా తీసుకువచ్చింది. రెండు సంవత్సరాల తరువాత కంపెని రిలీజ్ చేసిన ఫ్లాగ్ షిప్ మోడల్ ఇది. దీని పెర్ఫార్మన్స్ ను రెండు విధాలుగా టెస్ట్ చేశాము..

మొదటిగా బెంచ్ మార్క్స్ స్కోర్స్ తో, రెండవది రియల్ వరల్డ్ లో use చేస్తున్నప్పుడు రెగ్యులర్ యాప్స్, సోషల్ నెట్ వర్కింగ్ అన్నీ ఎలా ఉన్నాయి అనేది.

బెంచ్ మార్క్స్..
Mi 5 బెంచ్ స్కోర్స్ ను లేటెస్ట్ టాప్ స్మార్ట్ ఫోన్ శామ్సంగ్ గెలాక్సీ S7 edge తో కంపేర్ చేయటం జరిగింది.. క్రింద మీరు గమనించి నట్లు అయితే ఇంటరెస్టింగ్ గా ఉంటుంది స్కోర్స్ పరంగా చార్ట్..

GFX బెంచ్ car chase బెంచ్ మార్క్ లో శామ్సంగ్ S7 edge Mi 5 లోని సగం పెర్ఫార్మన్స్ ను డెలివర్ చేస్తుంది. ఎందుకంటే Mi 5 లోని తక్కువ మరియు చిన్న డిస్ప్లే రిసల్యుషణ్ plus పాయింట్ గా పనిచేస్తుంది. S7 edge  పవర్ ఫుల్ అయినప్పటికీ, high ఫ్రేం రేట్స్ ను డెలివర్ చేయాలి QHD రిసల్యుషణ్ డిస్ప్లే పై. ఇది కష్టం డెలివర్ చేయటం ఫుల్ HD డిస్ప్లే తో కంపేర్ చేస్తే. అయితే ఇది రియల్ వరల్డ్ పెర్ఫార్మన్స్ లో పెద్ద change కాదు. కేవలం స్కోర్స్ లోనే. ఇదే తరహాలో OpenGL ES 3.1ద్వారా చేసే 3D మార్క్ slingshot బెంచ్ మార్క్ కూడా ఉంది.

స్నాప్ డ్రాగన్ 820 మాక్సిమమ్ 1.8GHz క్లాక్ స్పీడ్ కు వెళ్తుంది. ఎక్కవుగా రిసోర్స్ లను వాడే యాప్స్ ను వాడుతున్నప్పుడు మాక్సిమమ్ 800MHz నుండి 1.2GHz క్లాక్ స్పీడ్ లోనే ఉంటుంది. అవసరమైతే 400 mhz కన్నా తక్కువకి కూడా వెళ్తుంది.

మల్టీ కోర్ పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే S7 edge మంచి స్కోర్ ఇస్తుంది, కారణం ఆక్టో కోర్ చిప్ సెట్. Mi 5 లో క్వాడ్ కోర్ ఉంది.

రెగ్యులర్ usage…
రియల్ వరల్డ్ లో Mi5 లోని క్లాక్ బెస్ట్ స్పీడ్ 1.3GHz కు వెళ్తుంది. ఇలాగే ప్రతీ ఫోనులో ఉండాలి. UFS 2.0 స్టోరేజ్ వలన ఫోన్ నిజంగా ఓవర్ ఆల్ UX ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. ఫోన్ ఫాస్ట్ అండ్ zippy గా ఉంది. ఇందుకు ప్రధాన కారణం ఫాస్ట్ ఇంటర్నల్ స్టోరేజ్ సిస్టం ఉండటం. మీరు 32GB తక్కువ స్టోరేజ్ కదా అనవచ్చు.. కానీ UFS 2.0 ఫాస్ట్ గా ప్రాసెస్ చేస్తుంది అనేది కూడా చెప్పుకోవలసిన విషయమే.

మేము టెస్ట్ చేస్తున్న హాండ్ సెట్ Mi UI 7 బీటా వెర్షన్ పై రన్ అవటం వలన మోస్ట్ ఆఫ్ the time క్రాషేస్, stutters ఉన్నాయి OS లో. అందుకే రివ్యూ ను వాయిదా కూడా వేసాము. ఫైనల్ build వచ్చాక పెర్ఫార్మన్స్ పై ఒక కంక్లుజన్ వస్తుంది.

యాప్స్ తక్కువ టైమ్ కే లాంచ్ అవుతున్నాయి ఓపెన్ చేస్తే. ఇక బాగా రిసోర్సెస్ ను తీసుకునే పెద్ద గేమ్స్ modern combat 5 ఒక సెకెండ్ ఎక్కువ టైమ్ తీసుకుంటుంది ఓపెన్ అవటానికి. ఇది S7 edge లో కూడా చూశాము. 

సింపుల్ యాప్స్, zomoto, flipkart, పాకెట్ etc మాత్రం టాప్ చేయగానే ఓపెన్ అవుతున్నాయి. S7 edge తో కంపేర్ చేస్తే Mi 5 లో ఉన్న ఏకైక మైనస్ ఏంటంటే edge లో 4GB ఉంటే Mi 5 లో 3GB ర్యామ్ ఉంది.

Mi5 లో డేటా కనెక్షన్ కెపాసిటి బాగుంది(S7 edge కూడా). అంటే గత 5 రోజులలో ఒక్క సారి కూడా 4G ఇంటర్నెట్ ఒక్కసారి కూడా disconnect అవటం చూడలేదు. ఇదే విషయంలో చాలా ఫోనులు 4G నుండి 3G కు డ్రాప్ అవుతున్నాయి రద్దీ ప్రదేశాల్లో ఉన్న్నపుడు.

heat management లో కూడా Mi5 బాగుంది. బాగా ఎక్కువ రిసోర్స్ లను వాడే activities చేస్తున్నపుడు ఫోన్ చాలా రేర్ గా 40 డిగ్రిస్ ను దాటుతుంది. క్రింద గ్రాఫ్ చూస్తె ఐడియా వస్తుంది. 6 నిముషాలు 4K వీడియో ను షూట్ చేస్తే ఫోన్ వేడెక్కింది. కాని అది ఫర్వాలేదు.

బాటమ్ లైన్…
ఇది ఫైనల్ కంక్లుజన్ కాదు. Mi 5 నిజంగా ఫ్లాగ్ షిప్ ఫోన్ అని ప్రూవ్ చేసుకుంది. పెర్ఫార్మన్స్ పాయింట్ ఆఫ్ view లో కొంచెం complain చేయాలి కాని ఫైనల్ Mi UI వెర్షన్ వస్తే బగ్స్ సాల్వ్ అవుతాయి అని అంచనా. UFS 2.0 ఇంటర్నెల్ స్టోరేజ్ సిస్టం Mi 5 పెర్ఫార్మన్స్ కు ఉన్న ఒక సిక్రెట్ అని తెలియాలి మీకు. 

Prasid Banerjee

Trying to explain technology to my parents. Failing miserably.

Connect On :