ఐ ఫోన్ 5S 21,000 వేలకు వస్తున్నా ఎందుకు తీసుకోకూడదు..

ఐ ఫోన్ 5S 21,000 వేలకు వస్తున్నా ఎందుకు తీసుకోకూడదు..

రీసెంట్ గా ఆపిల్ ఐ ఫోన్ 5S అఫిషియల్ గా 21,000 రూ లకు ధరను తగ్గించింది. కొంతమందికి ఇది పెద్దగా తగ్గింపు కాదు కదా అనిపించవచ్చు, కాని అఫిషియల్ ఆపిల్ ఇదే మొదటి సారి ఇంత ప్రైస్ ను తగ్గించటం. అది కూడా ఇండియాలోనే ఈ ప్రైస్ ఉంది.

సో మరి తగ్గించిన ప్రైస్ కు ఐ ఫోన్ తీసుకుందామని ఎంతమంది ఐ ఫోన్ 5S ను కన్సిడర్ చేస్తున్నారు?. 'ఆపిల్ బ్రాండ్ అండ్ సాఫ్ట్ వేరు ను ఒకసారి వాడుదాము' అనే ఉద్దేశం తో చాలా మంది కొందామని అనుకుంటూ ఉండవచ్చు..

అయితే మరి 21K కు ఐ ఫోన్ 5S మంచి డీల్ అని చెప్పవచ్చా? సింపుల్ ఆన్సర్ "కాదు". బాగా తగ్గినప్పటికీ ఇది కరెక్ట్ డివైజ్ కాదు.

ఎందుకు? 
1. మీరు గేమింగ్ లేదా వీడియోస్ కు ఫోన్ ను బాగా వాడేవారు అయితే దీనిలో 4in డిస్ప్లే బాగా చిన్నదిగా ఉంటుంది. గేమ్స్ లాగ్స్ అవటం మాత్రం ఉండదు.

2. యాప్స్ స్విచింగ్, ఓపెనింగ్ కు స్ప్లిట్ సెకెండ్ అండ్ వన్ సెకెండ్ గ్యాప్స్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ లో కూడా ఉంటుంది. సో మరి అంత ప్రైస్ పెట్టి ఐ ఫోన్ ఎందుకు?

3. బ్రౌజర్ లో ఎన్ని టాబ్స్ ఉన్నా, బ్రౌజర్ ను మళ్ళీ ఓపెన్ చేస్తే టాబ్స్ అన్నీ మొదటి నుండి లోడ్ అవటం ఐ ఫోన్ సఫారీ బ్రౌజర్ లో పెద్ద మైనస్.

4. 1gb ర్యామ్ ఉన్న ఐ ఫోన్ 5S అస్సలు ఆండ్రాయిడ్ తో కంపేర్ చేయలేనంత స్పీడ్ గా ఉంటేనే కన్సిడర్ చేయటం కరెక్ట్. ఎందుకంటే అదే ప్రైస్ లో (సుమారు) oneplus 2 4gb ర్యామ్ తో వస్తుంది.

5. ఆల్రెడీ ఐ os 9 లో యాప్స్ అన్నీ 2gb ర్యామ్ కు ఆప్టిమైజ్ అయ్యేలా డిజైన్ చేయబడుతున్నాయి. నెక్స్ట్ వచ్చే ఐ os10 లో ఇది కంప్లీట్ షిఫ్ట్ అవుతుంది అని అంచనా.

6. ఆపిల్ A7 ప్రొసెసర్ ఫాస్ట్ enough గా ఉంటుంది కాని ఫేస్ బుక్, ఆపిల్ మ్యూజిక్ అండ్ సఫారీ లను ఒకేసారి ఓపెన్ చేసి ఉంచితే 2 నుండి 5 సేకెండ్స్ పడుతుంది యాక్సిస్ కు.

7. 1560 mah బ్యాటరీ హెవీ గా వాడితే నాలుగు గంటలలో బ్యాటరీ అయిపోతుంది. కేవలం దాని మీద మోజు తో కొంటే వారం రోజులలో ఇష్టం పోతుంది. సో వారం రోజులకి 21వేలు ఖర్చు చేసినట్లు.

8. 20 వేల పైన బడ్జెట్ పెడుతుంటే మినిమమ్ రెండు సంవత్సరాలు ఫోన్ వాడగలిగే అంత కంటెంట్ తో ఉండాలి. ఇదే బడ్జెట్ లో బెస్ట్ ఆప్షన్స్ – హానర్ 7, oneplus 2.

Souvik Das

Souvik Das

The one that switches between BMWs and Harbour Line Second Class. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo