గమనిక: క్రింద వీడియో లోని పద్దతి వలన సిమ్ మరియు sd కార్డ్ మరియు ఆ స్లాట్ కూడా 2 వరాల తరువాత పనిచేయటం లేదు అన్నట్లు కొంతమంది users తెలుపుతున్నారు. సో చేసే ముందు మీరు బాగా ఆలోచించుకోండి.
redmi note 3 లో హైబ్రిడ్ స్లాట్ ఉందని మీకు తెలిసిన విషయమే. అంటే ఒకసారి రెండు సిమ్స్ లేదా ఒక సిమ్ ఒక SD కార్డ్ మాత్రమే వాడటానికి అవుతుంది.
అయితే రెండు సిమ్ లు మరియు SD కార్డ్ కూడా ఒకేసారి పని చేసేలా హైబ్రిడ్ స్లాట్ లోని ఉన్న మైనస్ పాయింట్ కు సల్యుషణ్ చూపిస్తూ youtube కొన్ని రోజుల క్రితం ఒక వీడియో అప్ లోడ్ అయ్యింది. ఇది చాలా మందికి సక్సెస్ ఫుల్ గా పనిచేసింది.
ఆ వీడియో ను చూడని వారు ఆర్టికల్ చివరిలో క్రింద వీడియో చూడగలరు. ఆల్రెడీ ఈ పద్దతిని ఫాలో అయిన వారు తమ అనుభవాన్ని క్రింద కామెంట్స్ లో ఇతర users కు తెలపగలరు.
వీడియో స్టెప్ బై స్టెప్ వివరించటం జరిగింది. సో చెప్పిన ప్రతీ విషయాన్ని జాగ్రత్తగా చేస్తే సక్సెస్ అవుతారు. సిమ్ పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందు ఇంపార్టెంట్ కాని పనిచేసే సిమ్ పై టెస్ట్ చేయండి.
ఇదే మెథడ్ హైబ్రిడ్ స్లాట్ తో వస్తున్న మరొక ఫోన్ లో పనిచేస్తుందా?
ఇదే ప్రాసెస్ అయితే 90% పనిచేసే అవకాశాలున్నాయి. కాని చాలామందికి సిమ్/కార్డ్ మరియు స్లాట్ కూడా పాడవుతుందోనని తెలుస్తుంది. సో మా అభిప్రాయం ప్రకారం ఈ ప్రాసెస్ ను ఏ ఫోనులోని చేయకపోవటం బెటర్.
వీడియో క్రెడిట్స్ : DD-electro