ఈ లింక్ లో కోడ్ ఏలా generate చేయాలి అని కొన్ని ట్రిక్స్ చెప్పటం జరిగింది. అవి ఫాలో అవుతూ చాలా మంది సక్సెస్ ఫుల్ గా కోడ్ generate చేసుకోవటం జరిగింది.
అయితే కొంతమంది పాత వెర్షన్ apk My Jio యాప్ ను ఇంస్టాల్ చేసుకొని ట్రై చేస్తుంటే ఫోర్సు గా యాప్ అప్ డేట్ చేయమని అడుగుతంది అని తెలిపారు. సో వారి కోసం చిన్న ట్రిక్ ఒకటి చెప్పటానికే ఈ ఆర్టికల్.
ప్లే స్టోర్ ఓపెన్ చేసి, ప్లే స్టోర్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ఆటోమాటిక్ అప్ డేట్స్ సెట్టింగ్స్ ను ఆఫ్ చేయండి. అలాగే ప్లే స్టోర్ లో My Jio యాప్ ను సర్చ్ చేసి ఓపెన్ చేస్తే(యాప్ ఓపెన్ చేయటం కాదు), మీకు రైట్ సైడ్ టాప్ కార్నర్ లో 3 వెర్టికల్ డాట్స్ కనిపిస్తాయి.
అది menu బటన్. దానిపై క్లిక్ చేస్తే మీకు ఆటోమాటిక్ అప్ డేట్ ఆప్షన్ enable అయ్యి ఉంటుంది tick మార్క్ తో. దానిని disable చేయండి. ఇప్పుడు My Jio యాప్ అప్ డేట్ చేయమని ఫోర్సు చేయకపోవటానికి chances ఉన్నాయి.
అయితే ఇది పూర్తిగా పనిచేయకపోవచ్చు. కాని ఈ ఆప్షన్ గురించి తెలియజేయాలి అని తెలపటం జరిగింది. ఒక వేల పనిచేయకపోతే ఇతర సోలుషన్స్ ఏమైనా ఉంటే మీకు తెలియజేస్తాము.