Xiaomi Mi 5 తో వస్తున్న టాప్ 4 టెక్నాలజీస్

Xiaomi Mi 5 తో వస్తున్న టాప్ 4 టెక్నాలజీస్

రెండు సంవత్సరాల నుండీ మేకింగ్ లో ఉంది, కాని ఫైనల్ గా మార్కెట్ లో అనౌన్స్ అయ్యింది Mi 5. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన నోట్ డిజైన్ తోనే ఇది కూడా వస్తుంది.

Hugo Barra స్టేజ్ పై demo ఇస్తూ UFS 2.0, 4 axis – OIS, Deep Trench isolation వంటి పదాలను వాడటం జరిగింది. ఇవి స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో కొత్తగా అనిపిస్తున్న ఫీచర్స్. అవేంటో తెలుసుకుందాము రండి..

UFS 2.0
యూనివర్సల్ ఫ్లాష్ స్టోరేజ్. ఇది 2014 లో సామ్సంగ్ చే డెవలప్ చేయబడింది. eMMC కన్నా ఇది మరింత ఫాస్ట్ డేటా transfers ఇస్తుంది అని రిపోర్ట్స్. సామ్సంగ్ ప్రకారం UFS అనేది ఫుల్ fledged సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ అంత ఫాస్ట్ గా write అండ్ read స్పీడ్స్ ఇస్తుంది. లాస్ట్ ఇయర్ సామ్సంగ్ S6 లో UFS introduce అయ్యింది. మేము దీనిని రివ్యూ చేసినప్పుడు చాలా ఫాస్ట్ గా ఉండటం గమనించాము.

4-axis-OIS
ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్ అనేది కొత్త విషయమేమి కాదు. కాని కామన్ గా 2 axis OIS ఉంటుంది అన్ని ఫోన్లలో..అంటే వెర్టికల్ అండ్ హారిజంటల్ గా మూవ్మెంట్స్ ను కంట్రోల్ చేస్తుంది కెమెరా దీనితో. ఇప్పుడు 4 axis ద్వారా అదనంగా లెఫ్ట్ అండ్ రైట్ మూవ్మెంట్స్ ను కంట్రోల్ చేస్తుంది. అంటే బెటర్ stabilisation ఉంటుంది మీరు కదులుతూ వీడియోస్ లేదా ఇమేజెస్ షూట్ చేసేటప్పుడు.

Deep Trench Isolation
Xiaomi Mi5 సోని IMS298 కెమెరా సెన్సార్ తో అదనంగా Deep trench టెక్నాలజీ తో వస్తుంది. పిక్సెల్ లోపల insulating లేయర్ ను యాడ్ చేసి ఇమేజెస్ లో noise ను తగ్గిస్తుంది. ఇదే టెక్నాలజీ IMX315 సెన్సార్ వాడే ఐ ఫోన్ 6S మోడల్స్ లో ఉంది.

LPDDR4
OIS మాదిరిగా ఇది కూడా కొత్త విషయం కాదు. లాస్ట్ ఇయర్ సామ్సంగ్ తీసుకువచ్చింది LPDDR4 ను. ఇవి DDR3 కన్నా మెరుగైన పనితనం చూపిస్తున్నాయి. 4GB DDR3 ర్యామ్ కన్నా 4GB DDR4 ర్యామ్ స్పీడ్ గా ఉంటుంది. DDR4 ర్యామ్ లో ప్రధానంగా పవర్ efficiency మరియు హై ఫ్రీక్వేన్సీ లు ఉన్నాయి. ఇది సామ్సంగ్ S6 లో ప్రూవ్ కూడా అయ్యింది.

అందరూ స్నాప్ డ్రాగన్ 820 ఉండటం హై లైట్ గా చెబుతున్నారు. అది వాస్తవమే కాని ఈ నాలుగు టెక్నాలజీస్ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఫ్లాగ్ షిప్ మోడల్స్ లో ఏ కంపెని అయినా స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్ ను add చేయగలవు కాని ఇలాంటి unique ఫీచర్స్ మాత్రం ఉండకపోవచ్చు…కానీ ఇవి ఫోన్ పెర్ఫార్మెన్స్ ను టోటల్ గా పెంచటానికి కనపడని కారణాలుగా మిగిలిపోతాయి.

 

Prasid Banerjee

Prasid Banerjee

Trying to explain technology to my parents. Failing miserably. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo