ఈ రోజే స్టోర్ కు వెళ్ళటం జరిగింది. Sep 5 నుండి సిమ్ తీసుకోవటానికి ఇదే రియల్ అండ్ ప్రాక్టికల్ ప్రాసెస్
[UPDATE September 6th] – సెప్టెంబర్ 6 వ తేదిన కంపెని హెడ్ ఆఫీస్ మార్కెటింగ్ బృందం తో మాట్లాడిన తరువాత వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కోడ్ జెనరేటింగ్ అనేది కేవలం Jio, welcome offer అనౌన్స్ చేయకముందు అఫీషియల్ గా సపోర్ట్ చేసిన బ్రాండ్స్/ఫోన్స్ కే అవసరం. మిగిలిన ఫోనులకు డైరెక్ట్ గా స్టోర్ కు వెళ్లి అడిగితే ఇస్తారు. అలా ఇవ్వని స్టోర్ వాళ్ళని పేరు అడిగి, స్టోర్ అడ్రెస్ నోట్ చేసుకొని రిలయన్స్ కస్టమర్ కేర్ కు కంప్లైంట్ చేయమని కస్టమర్ కేర్ సిబ్బంది తెలిపారు.
కోడ్ అవసరం లేని వారు డైరెక్ట్ గా ఆధర్ కార్డ్ ఒరిజినల్ పట్టుకొని వెళితే చాలు. కాని కొన్ని స్టోర్స్ లో ఫోటోస్ మరియు ఆధర్ కార్డ్ Xerox అడుగుతున్నారు. సో ముందు చూపు కోసం పట్టుకెల్లండి. ఆధర్ కార్డ్ లేని వారు మీ వద్ద ఉన్న మిగిలిన ఐడెంటి మరియు అడ్రెస్ ప్రూఫ్ లను పట్టుకొని వెళ్ళండి.
క్రింద సెప్టెంబర్ 5 న స్టోర్ కు వెళితే స్టోర్ సిబ్బంది చెప్పిన దాని ప్రకారం తెలిపిన విషయాలు…
రిలయన్స్ Jio సిమ్ తీసుకోవటానికి ఈ రోజు స్టోర్ కు వెళ్ళటం జరిగింది. సో ఈ క్రింద మీకు Jio సిమ్ ఏలా తీసుకోవాలో అప్ డేట్ చేస్తాను. ఇదే ఫైనల్ అండ్ రియల్ ప్రాక్టికల్ procedure.
మీరు ఫోన్ లో కోడ్ generate చేసుకోవాలి. ఇంతకుముందు డైరెక్ట్ గా వెళితే సరిపోతుంది కోడ్ generating అవసరం లేదు అని తెలిపటం జరిగింది. ఎందుకంటే రిలయన్స్ సిబ్బందే కోడ్స్ ను generate చేసుకునే వారు ఇప్పటివరకూ.
కాని సెప్టెంబర్ 5 నుండి ఆధర్ కార్డ్ అండ్ ఫింగర్ ప్రింట్ కొత్త procedure మొదలవుతుంది. ఈ ప్రోసెస్ లో మీరే ఫోన్ లో కోడ్ generate చేసుకోవాలి.
కోడ్ ఎలా generate చేయాలి?
- ఫోన్ లో ఈ లింక్ నుండి ప్లే స్టోర్ లో My Jio App ను డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి.
- ఇప్పుడు మీకు స్క్రీన్ పై instructions కనిపిస్తాయి.
- వాటిని ఫాలో అయిపోతే ఈజీగానే వెంటనే కోడ్ వస్తుంది.
- GET JIO SIM అని రావాలి. అది రాకుండా sign in sign up వస్తే My Jio యాప్ కోడ్ ను generate చేయలేకపోతుంది అని అర్థం. ( GET JIO SIM రాని వారికి క్రింద సొల్యూషన్ తెలిపటం జరిగింది)
ఇప్పుడు మీ మీ ఆధర్ కార్డ్(ఒరిజినల్ అండ్ Xerox) తీసుకోని వెళ్ళండి స్టోర్ కు. ఇప్పుడు మీ ఒరిజినల్ ఆధర్ కార్డ్ మీద ఉన్న బార్ కోడ్ ను స్కాన్ చేస్తారు సిబ్బంది.
తరువాత ఫింగర్ ప్రింట్ ను స్కాన్ చేయటానికి ఫింగర్ స్కానర్ పై ప్లేస్ చేయమని అడుగుతారు. ఇది అయిపోయిన తరువాత మీ ఫోన్ లో generate అయిన కోడ్ ను సబ్మిట్ చేస్తే ప్రోసెస్ అయిపోయినట్లే. సిమ్ ఇస్తారు. అది 20 నిమిషాల్లో యాక్టివేట్ అవుతుంది.
కోడ్ చాలా మందికి generate అవటం లేదు. ఏమి చేయాలి?
MyJio App ను WiFi నుండి కాకుండా మొబైల్ ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేయండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి. అప్పటికీ రాకపోతే, మిగిలిన యాప్స్ కూడా మొబైల్ ఇంటర్నెట్ నుండే డౌన్లోడ్ చేయండి. ఇదే ప్రస్తుతానికి ఉన్న సొల్యూషన్. ఫ్యూచర్ లో ఏమైనా అప్ డేట్ వస్తే ఇక్కడ అప్ డేట్ చేయటం జరుగుతుంది.
Jio పై ఉన్న మోస్ట్ వాంటెడ్ డౌట్స్ వాటికీ ఆన్సర్స్ ను ఈ లింక్ లో తెలపటం జరిగింది. చూడగలరు.