‘Refurbished’ స్మార్ట్ ఫోన్ అంటే ఏమిటి? ఎలా కొనాలి వీటిని? కంప్లీట్ గైడ్

Updated on 25-Jun-2020
HIGHLIGHTS

రిఫర్బిషింగ్ హాండ్ సెట్ రివ్యూ కూడా ఉంది లోపల

రిఫర్బిషింగ్ అంటే చిన్నగా రిపేర్, డేమేజ్ (inside లేదా outside) అయిన స్మార్ట్ ఫోన్స్ ను మరలా బాగుచేసి సేల్ చేయటం. రిపేర్ చేయటం అనేది ఫోన్ లేదా డివైజ్ యొక్క కంపెనీలే చేస్తాయి చాలా వరకూ. కంపెనిస్ చేస్తేనే ఎక్కువ నమ్మగలము. కాని ఇలా రిపేర్ చేసిన వాటిని సేల్ మాత్రం వివిధ రకాల సైట్స్ చేస్తాయి. సైట్స్ కూడా వారెంటీ ఇస్తాయి. ఇది ఇప్పుడిప్పుడు ఇండియాలో బాగా వినపడుతుంది. రిఫర్బిషింగ్ మార్కెట్ లో మొబైల్స్ ప్రైసెస్ తగ్గి వస్తాయి. అందుకే వీటికి డిమాండ్ ఉంది.

డిమాండ్ ఏంటి అని మీకు అనిపించవచ్చు, కాని Refurbishing గూడ్స్ అమ్మేందుకు చాలా వెబ్ సైట్స్ ఉన్నాయి ఇండియాలో. మొబైల్స్ తో పాటు టాబ్లెట్స్, లాప్ టాప్స్, ఆపిల్ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి.ఇప్పుడు వీటికి పోటిగా ebay మరియు అమెజాన్ కూడా ఈ రిఫర్బిషింగ్ మార్కెట్ లోకి అడుగుపెట్టడం వలన కాంపిటీషన్ పెరిగింది. అమెజాన్ లోకి వెళ్లి Refurbished అని సర్చ్ చేస్తే చూడగలరు.

వీటిపై చాలా మందికి అవగాహన లేదు. కాని ముందు ముందు బాగా పాపులర్ అవనుంది. సో ఇండియాలో ఉన్న రిఫర్బిషింగ్ ఇండస్ట్రీ ఔట్లెట్స్ ఏమి ఉన్నాయి. వాటి నుండి ఏమి ఆశించవచ్చు అనే విషయాలు తెలుసుకుందాం రండి. నేను వీటిపై విశ్లేషణ చేయటానికి వారం రోజుల నుండి refurbished హాండ్ సెట్ వాడుతున్నాను. రిఫర్బిషింగ్ మార్కెట్ ను recommerce అని పిలుస్తున్నారు.

Gobol
గాడ్జెట్ రీసైక్లింగ్ కంపెని, Attero కు Gobol వెబ్ సైట్ ఎక్స్టెన్షన్. అలాగే రిఫర్బిషింగ్ కూడా చేస్తుంది. దీనిలో రకరకాల కేటగిరిస్ ఉంటాయి. Surplus, ఫేక్టరీ సేకెండ్స్, refurbished అండ్ ప్రీ owned. ఇది కేవలం ప్రైసెస్ ను విభజించటానికి చేసిన కేటగిరి ప్రక్రియ మాత్రమే. సో కొనే ముందు మీకు కంప్లీట్ ఐడియా ఉంటుంది మీరు ఎలాంటి ఫోన్ కొంటున్నారు అని. అన్ని సైట్స్ వలె గోబోల్ కూడా  స్టాండర్డ్ గా 6 నెలల ఫోన్ బ్రాండ్ వారెంటీ ఇస్తుంది. అంటే ఇది ఒరిజినల్ purchase డేట్ నుండి మిగిలి ఉన్న కంపెని వారేంటి. అన్నీ కేటగిరిస్ లోని ప్రొడక్ట్స్ కు తయారీ కంపెని(బ్రాండ్) వారేంటి ఉంటుంది.అయితే ఏదైనా 6 నెలలు మాత్రమే.

మరొక వారెంటీ ఉంది. అది గోబోల్ నుండి వస్తుంది. ఇది mostly refurbished అండ్ ప్రీ owned ప్రొడక్ట్స్ పైనే వర్తిస్తుంది. ప్రైసింగ్ అనేది attero డిజైన్ చేసిన అల్గారిథం పై బేస్ అయ్యి ఉంటుంది. బ్రాండ్, క్వలితిఎమ్ వారెంటీ, లైఫ్ సైకిల్ అండ్ మిగిలిన విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆ హాండ్ సెట్ యూక్క ప్రైస్ 10 నుండి 60% డిస్కౌంట్ ప్రైస్ తో ఉంటుంది. Attero కు సొంతంగా refurbishing unit ఉంది.

నేను కంపెని తో ఒక ముఖ్యమైన ప్రశ్న అడగటం జరిగింది. మీరు రిప్లేస్ చేసే రిపేర్ పార్ట్శ్ అన్నీ ఒరిజినల్ బ్రాండెడ్ నుండే వస్తాయా? అనే ప్రశ్నకు జవాబుగా "చాలా వరకూ ఒరిజినల్" అని సమాధానం చెప్పారు. సో ఇక్కడ కన్సుమర్స్ ఆలోచనలో పడతారు. ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఒకసారి నేను ఐ ఫోన్ స్క్రీన్ బ్రేక్ అయ్యిందని ఒరిజినల్ బాగా కాస్ట్ ఉండటంలో చైనా స్క్రీన్ వేయటం జరిగింది. చూడటానికి అస్సలు తేడా కనిపించలేదు కాని చాలా పెద్ద డిఫరెన్స్ కనిపించింది డిస్ప్లే ఆన్ చేసి వాడుతున్నప్పుడు. ఒరిజినల్ కు చైనా స్క్రీన్ కు తేడా చాలా ఉంది. కాని గోబోల్ డోర్ టు డోర్ సర్విస్ అందిస్తుంది. సో 6 నెలలో మీకు ఏమైనా తేడా అనిపిస్తే గోబోల్ కు పంపగలరు. ఏదైనా బాలేదు అని తెలుసుకోవటానికి 6 నెలలు సరిపోతుంది కదా.

Overcart
ప్రీ owned , un boxed, refurbished ఎలెక్ట్రానిక్స్ కు ఇది మరో వెబ్ సైట్. దీనికి సొంతంగా రిఫర్బిషింగ్ unit లేదు.దీనిలో ఉండే స్మార్ట్ ఫోన్స్ దాదాపు ఒరిజినల్ కంపెని వారు రిఫర్బిష్ చేసినవే. ఓవర్ కార్ట్ సైట్ కు ప్రతీ డివైజ్ చెక్ చేయటానికి కేవలం 5 నుండి 6 నిముషాలు పడుతుంది. కాని దీనిలో ప్రైసెస్ అంత న్యాయంగా ఉండవు. for eg మోటో x gen 2 32gb మోడల్ 55% డిస్కౌంట్ తో వస్తుంది దీనిలో కాని అది ఒరిజినల్ లాంచ్ అప్పుడు ఉన్న ప్రైస్ కు 55% డిస్కౌంట్. కరెంట్ ఒరిజినల్ బ్రాండ్ ప్రైస్ కు కాదు. ఈ మోడల్ ఒరిజినల్ కొత్త హ్యాండ్ సెట్ ప్రైస్ 17,999 రూ ఉంది. సో ఓవర్ కార్ట్ ఇచ్చే 15,279 రూ ప్రైస్ అస్సలు worthable కాదు. 17 వేలు కన్సుమర్ బడ్జెట్ కాకపోయినా తేడా ఎక్కువ లేదు కాబట్టి కొత్త హాండ్ సెట్ నే తీసుకుంటారు 2 వేలు ఎక్కువ పెట్టి.

ఇది కూడా బ్రాండ్ వారెంటీ ఇస్తుంది చాలా ప్రొడక్ట్స్ కు. బ్రాండ్ వారెంటీ లేని వాటికీ ఓవర్ కార్ట్ 6 మంత్స్ వారేంటి ఉంటుంది. వీళ్ళు దేశంలోని కొన్ని సర్వీస్ సెంటర్స్ తో tie అప్ అవతారు, సో 6 నెలలోపు బ్రాండ్ వారెంటీ లేని హాండ్ సెట్స్ కు రిపేర్ వస్తే ఆ సర్వీస్ సెంటర్స్ కు తీసుకెళ్ళి రిపేర్ చేయించుకోగలరు ఫ్రీ గా. ఓవర్ కార్ట్ లో కొనే ముందు మిగిలిన సైట్స్ లో కొత్త హాండ్ సెట్ ప్రైస్ ఎంత ఉంది అని చూడటం మంచి ఉపాయం.

అమెజాన్
అమెజాన్ fire ఫోన్, ఫైర్ టీవీ, ఫైర్ టాబ్లెట్, kindle అండ్ మిగిలన అమెజాన్ డివైజెస్ పై ఇది refurbished selling చేస్తుంది. అయితే ఇది us అమెజాన్ సైట్ లో ఉండేవి మొదటిలో. ఇప్పుడు ఇండియా అమెజాన్ లో కూడా ఇలాంటి సేల్స్ జరుగుతున్నాయి.

కొత్త డివైజెస్ కు ఉండే ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్ తోనే వీటిని సేల్ సేల్ చేస్తాము.  క్వాలిటీ assurance కూడా ఉంటుంది అని అంటుంది అమెజాన్. surplus.in నుండి అమెజాన్ refurbished డివైజెస్ ను తెస్తుంది. శామ్సంగ్, ఆపిల్, మోటోరోలా, oneplus , లావా, Xiaomi వంటి బ్రాండ్స్ ను సేల్ చేస్తుంది రిఫర్బిషింగ్ కేటగిరి లో. అమెజాన్ లో కూడా బ్రాండ్ రిఫర్బిషింగే జరుగుతుంది. సొంతంగా రిఫర్బిషింగ్ unit లేదు. సో ఇక్కడ ఒరిజినల్ పార్ట్స్ రిప్లేస్ అవుతాయి 100% అని అనుకోవచ్చు. ప్రైసెస్ 2v వేల నుండి 3 వేల వరకూ తగ్గుతున్నాయి. ఇవి కూడా స్టాండర్డ్ 6 మంత్స్ వారెంటీ తో వస్తున్నాయి. సీల్డ్ packing అండ్ 10 డే రిటర్న్ పాలసీ కూడా ఉంది.

Greendust
దీనిలో కేవలం స్మార్ట్ ఫోన్స్ ఏ కాదు, ఇతర ఎలెక్ట్రానిక్స్ కూడా సేల్ అవుతాయి. ఇది కూడా attero లానే ఫేక్టరీ సేకెండ్స్, surplus ప్రొడక్ట్స్, కార్టూన్ డేమేజ్ ప్రొడక్ట్స్ ను restore చేస్తుంది. ఇవి గతంలో వాడినవి కాదు. అమ్మే ముందు 50 పాయింట్ క్వాలిటీ చెక్ చేస్తారు. దీనిలోని ప్రత్యేకత ఏంటంటే ఇది 1 ఇయర్ వారెంటీ ఇస్తుంది. కావాలంటే 1 ఇయర్ కు మించిన అదనపు వారెంటీ కూడా కొనవచ్చు. దీనికి యాప్ కూడా ఉంది. దాని నుండి కూడా షాపింగ్ చేయగలరు.

రిఫర్బిషింగ్ డివైజెస్ ను అమ్మే సైట్స్ ఇంకా చాలా ఉన్నాయి. కాని పైన చెప్పబడినవి నమ్మదగినవి నా ఎక్స్పీరియన్స్ లో. నేను కొన్న నెక్సాస్ 6 refurbished స్మార్ట్ ఫోన్ యొక్క కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అండ్ రివ్యూ ఇక్కడ చూడండి..

Nexus 6: Refurbished & Reviewed
ఇది ఒరిజినల్ నెక్సాస్ 6 రివ్యూ కాదు, కేవలం refurbished ఎక్స్పీరియన్స్ రివ్యూ మాత్రమే. 32gb హాండ్ సెట్ ఇది. overcart నుండి కొనటం జరిగింది.  క్రింద దీని బాక్స్ ఇమేజ్ చూడగలరు.

ఒరిజినల్ బాక్స్ లో వచ్చింది. కాని దాని పై కొన్ని మరకలు అవీ ఉన్నాయి. ఓపెన్ చేస్తే ఒరిజినల్ బ్రాండ్ డివైజ్ వలె ఉంది packing లోపల. అన్నీ accessories ఉన్నాయి.

ముందుగా చాలా వరకూ ఇది కొత్త డివైజ్ లానే పనిచేసింది అని చెప్పాలి. స్మూత్ గా ఉంది. ఆండ్రాయిడ్ 6 వేసిన తరువాత బ్యాటరీ లైఫ్ ఇంప్రూవ్ కూడా అయ్యింది. అన్నీ బాగున్నాయి, కొత్త ఫోనులానే ఉంది ఎక్స్పీరియన్స్. మరి ఎక్కడ ఉంది డిఫరెన్స్? వెనుక కెమేరా చుట్టూ చిన్న చిప్ ఉంది రింగ్ ఫ్లాష్ పై. కనపడటం కష్టం కాని ఇది కెమేరా పెర్ఫార్మన్స్ లో ఎటువంటి ఇబ్బందులు ఇవ్వలేదు.

డిస్ప్లే 2K రిసల్యుషణ్ తో ఒరిజినల్ మాదిరిగానే రిచ్ గా ఉంది. వైబ్రెంట్ కలర్స్. కాని బ్రైట్ నెస్ ను low గా ఉంచితే డిస్ప్లే కొంచెం pinkish గా ఉంది. సో ఎప్పుడూ హై బ్రైట్ నెస్ లోనే ఉండేది. pinkish ఒకసారి రావటం మరొకసారి పోవటం చేస్తుంది. ఈ ప్రాబ్లెం ఒరిజినల్ హాండ్ సెట్ లో లేదు. ఇది మీకు గమనించాలి.

రెండు వారాలకు ఒకసారి చార్జింగ్ పెట్టినప్పుడు చార్జర్ పోర్ట్ పైన డిస్ప్లే లో గ్రీన్ స్పాట్ కనిపించేది కొన్ని సెకెన్ల పాటు. అదీ sms టైపింగ్ చేస్తున్నప్పుడే.

ఇది refurbished హాండ్ సెట్ అని చెప్పకుండా కొంతమంది ఫ్రెండ్స్ కు ఇది ఇవ్వటం జరిగింది. కొంత సేపు దీనితో గడిపిన వాళ్లు సాధారణ డివైజ్ కు ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇస్తారో అలానే దీనికి కూడా ఇచ్చారు. అంటే తెలియలేదు వారికీ. కొంతసేపు వాడిన తరువాత చెబితే ఆశ్చర్యం వాళ్ల వంతు అయ్యింది. అంటే ఒరిజినల్ కు దీనికి అస్సలు తేడాలు ఉండవు.

చూడటానికి తేడాలు కనిపించవు ఎందుకంటే ఇది డూప్లికేట్ ఫోన్ కాదు ఒరిజింల్ బ్రాండ్ లో చిన్న లోపాలు ఉండటం వలన refurbishing చేయబడినవి (అంటే ఏదైతే లోపం ఉందో దాని పై వర్క్ చేసి తగ్గించిన ప్రైస్ కు మళ్ళీ సేల్ చేయటం).

సో ఉంటే inside పెర్ఫార్మన్స్ లో ఉంటాయి తేడాలు. పైన చెప్పిన రేర్ అండ్ స్మాల్ ప్రాబ్లెం అదే. ఓవర్ ఆల్ పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే బాగుంది అని చెప్పాలి. గేమ్స్ అవీ స్మూత్ గా రన్ అయ్యేవి. అప్ డేట్స్ కూడా ఆన్నీ వచ్చాయి సాఫ్ట్ వేర్ పరంగా.

ఫైనల్ లైన్ … refurbished ఫోన్స్ లేదా ఇతర ఎలెక్ట్రానిక్స్ కొనవచ్చా?…… కొనవచ్చు! కాకపోతే ప్రైస్ లో మేజర్ డిఫరెన్స్ ఉంది అలాగే ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్ కూడా ఉంది అంటేనే.

స్నాప్ డీల్, షాప్ క్లూస్ వంటి వెబ్ సైట్లలో కూడా refurbished స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. అయితే ఇవి 500 రూ నుండి ప్రైస్ డిఫరెన్స్ తో వస్తున్నాయి. వారెంటీ మాత్రం 6 నెలలే. సో ఇంటరెస్ట్ ఉన్న వాళ్ళు అన్ని మేజర్ సైట్స్ లోకి వెళ్లి refurbished అని సర్చ్ చేయండి. గతంలో డిజిట్ తెలుగు refurbished ఇండియన్ వెబ్ సైట్స్ లిస్ట్ ను పొందిపరుస్తూ ఒక ఆర్టికల్ పోస్ట్ చేసింది. దానిని ఈ లింక్ లో చదవగలరు.
 

Adamya Sharma

Managing editor, Digit.in - News Junkie, Movie Buff, Tech Whizz!

Connect On :