నిన్న జరిగిన ఆపిల్ ఈవెంట్ లో ఐఫోన్ 6S అండ్ 6S ప్లస్ మోడల్స్ తో పాటు ఇతర ఆపిల్ ప్రోడక్ట్స్ కూడా లాంచ్ అయ్యాయి. ఆపిల్ ఎప్పుడూ ఫ్యూచర్ సంబంధిత టెక్నాలజీ పై ద్రుష్టి పెడుతుంది.
మనం అందరం ఒక 2gb ర్యామ్ యాడ్ చేస్తుంది 6S అని ఆలోచిస్తే ఆపిల్ నాలుగు మిలియన్ల పిక్సెల్స్ ను iSight అనే కెమేరా సెన్సార్ లో జోడించి కొత్తగా ముందుకు వచ్చింది. నిన్న స్మార్ట్ ఫోన్ తో పాటు లాంచ్ అయిన డివైజెస్…
iPad ప్రో
స్క్రీన్ సైజ్ 12.9 inchesరెటీనా 5.6 మిలియన్ పిక్సెల్స్ డిస్ప్లే. ఇంతవరకూ ఆపిల్ దించిన ప్రోడక్ట్స్ లో ఇదే పెద్ద స్క్రీన్ సైజ్ ఉన్న డివైజ్. పేరుకు మాత్రమే ఇది ipad కాని దీనికి ఫుల్ సైజ్ కీ బోర్డ్ ఉంది. 3rd Gen A9X 64 బిట్ చిప్ సెట్.
ఇది ప్రివియస్ A8X ప్రొసెసర్ కు డబుల్ మెమరీ బాండ్ విడ్త్ స్పీడ్ తో వస్తుంది. స్టోరేజ్ లో కూడా దాని కన్నా డబుల్ స్పీడ్. 60 ఫ్రేమ్స్ పర సెకెండ్ auto cad for ipad గురించి వివరిస్తూ ఆపిల్ దీనిలో console క్లాస్ గ్రాఫిక్స్ గురించి వెల్లడించింది.
10 గంటల బ్యాటరీ బ్యాక్ అప్, నాలుగు స్పీకర్స్ నుండి వచ్చే స్పీకర్స్ కేపబిలిటి. మీరు ipad ను ఎలా పట్టుకున్నారని అంచనా వేసి సౌండ్ క్వాలిటీ ను ఇస్తుంది. 8MP iSight కెమేరా, LTE 150MBPS స్పిడ్స్ తో స్పేస్ గ్రే, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్స్ లో 32, 64 అండ్ 128 GB స్టోరేజ్ వేరియంట్స్ తో రానుంది.
అధిక ప్రైసింగ్ పాయింట్ టోటల్ ipad ప్రో package అంతా కలిపి 89,740 రూ ఉండనుంది సుమారుగా. అతి తక్కువ ipad ప్రో వేరియంట్ ధర 17,879 రూ. వీటి తో పాటు మిని ipad 4 26,519 రూ లకు వస్తుంది.
6.9 mm స్లిమ్ బాడీ, 712 గ్రా బరువు ఉన్న ipad ప్రో కు కొత్తగా స్టైలాస్ కూడా వస్తుంది.. దీని పేరు ఆపిల్ పెన్సిల్. దీనిలో సెన్సార్ ఉంటాయి. అయితే ఈ ఎక్స్ట్రా accessories అన్నీ అదనపు చార్జెస్ తోనే వస్తున్నాయి. ipad బడ్జెట్ లో కాదు.
ఆపిల్ టీవీ
కొత్త gen టీవీ సిరి ను ఎక్కువగా ఇంటిగ్రేట్ చేసుకుంది. గ్లాస్ టచ్ పాడ్, సైడ్ స్టాక్ గేమింగ్ కంట్రోల్స్, వాయిస్ రికాగ్నిషణ్, మోషన్ కంట్రోల్ వంటి ఫీచర్స్ తో టోటల్ గా కొత్త రిమోట్ టీవీ లో ఉంది.
ఆపిల్ టీవీ కు టీవీ os కు అనుగుణంగా ఇప్పుడు సొంతంగా అప్లికేషన్స్ అండ్ గేమ్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఫేమస్ గేమ్స్ అన్నీ ఉన్నాయి. స్పిల్ట్ స్క్రీన్, పుష్ నోటిఫికేషన్స్ తో A8 ప్రొసెసర్ పై నడుస్తుంది.
HDMI అండ్ Ethernet పోర్ట్స్ కూడా జోడించింది ఆపిల్. lightning కనెక్టర్ తో టీవీ ను చార్జింగ్ చేయవచ్చు. ఒకసారి చార్జ్ చేస్తే 3 నెలలు వస్తుంది. 32 gb ఆపిల్ టీవీ ధర 9,940 రూ, 64gb ధర 13,270 రూ.
ఆపిల్ వాచ్
ఆపిల్ న్యూ వాచ్ కొత్తగా ధర్డ్ పార్టి అప్లికేషన్స్ ను సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు. ట్రాన్సిట్ మ్యాప్స్ ఫీచర్స్ కూడా. 10,000 వరకూ యాప్స్ వాచ్ os కు సపోర్ట్ చేయనున్నాయి. ఫేస్ బుక్ మెసెంజర్, iTranslate, GoPro కో ఆర్డినేషన్, Airstrip మెడికల్ యాప్, హార్ట్ రేటింగ్ మానిటర్ తో గోల్డ్ అండ్ రోస్ గోల్డ్ కేసెస్ తో సుమారు 23500
రూ లకు అవైలబుల్ గా ఉంది. కొత్త వాచెస్ అప్పుడే షిప్ అవుతున్నాయి కాని కొత్త వాచ్ os 2 మాత్రం సెప్టెంబర్ 16 న రిలీజ్ అవుతుంది.