నిన్న రాత్రి లాంచ్ అయిన ఆపిల్ ఐ ఫోన్ 6S
డిటేల్స్ అండ్ స్పెసిఫికేషన్స్
అవును ఐ ఫోన్ కాస్ట్ ఎక్కువ. అంతేకాదు దానిలో ఉండే ఆప్షన్స్ అన్నీ 5,000 రూ లకే ఆండ్రాయిడ్ ఫోన్ లో వాడగలము. కాని ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ లో జరిగే ఆపిల్ లాంచ్ ఈవెంట్ అంటే గాడ్జెట్ ప్రియులందరికీ ఎదురుచుపులే. నిన్న రాత్రి 10.30 (ఇండియన్ టైమ్ ప్రకారం) ఆపిల్ iphone 6S ఈవెంట్ స్టార్ట్ అయ్యింది.
ఈవెంట్ లో రెండు స్మార్ట్ ఫోన్స్ ను లాంచ్ చేసింది ఆపిల్. iPhone 6S మరియు iPhone 6S ప్లస్. ఇవి ఇండియాలో నవంబర్ నెలలో రిలీజ్ అవుతాయి అని రిపోర్ట్స్. కంపెని అఫిషియల్ గా ఇంకా ఇండియన్ ప్రసింగ్ పై అప్ డేట్ ఇవ్వలేదు.
ఆపిల్ iPhone 6S లో కొత్తగా యాడ్ అయినవి..
3D టచ్ ను వివరిస్తూ మొదలు పెట్టింది ఆపిల్ బృందం. ఇది ఐ ఫోన్ 6s లో ప్రవేశపెడతున్న ఫోర్స్ టచ్ టెక్నాలజీ. నార్మల్ గా కాకుండా ఒక 10ms మిని టాప్ అండ్ 15ms ఫుల్ టాప్ చేస్తే టచ్ inputs రెగ్యులర్ గా చేసే పనులు కాకుండా వేరే ఫలితాలను ఇస్తాయి ఫోనులో. ఇది యాప్ ఓపెన్ చేయకుండానే యాప్ లో పనులు చేస్తుంది. అంటే సేల్ఫీ తీసుకోవాలనుకున్నప్పుడు వెంటనే తీయటానికి ఉపయోగపడుతుంది.
హార్డ్ వేర్ విషయానికి వస్తే.. 3rd Gen A9 డెస్క్ టాప్ క్లాస్ 64 బిట్ ప్రొసెసర్ ఉంది. ఇది A8 ప్రొసెసర్ కన్నా 70% ఫాస్ట్ గా అండ్ 90% ఫాస్ట్ గ్రాఫిక్స్ తో రన్ అవుతుంది. దీనిలో M9 మోషన్ కో – ప్రొసెసర్ నిరంతరం రన్ అవుతుంటుంది. మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు యాప్స్ పెర్ఫార్మన్స్ ను స్ట్రీమ్ లైన్ చేస్తుంది.
12 మెగా పిక్సెల్ iSight కెమేరా ఫాస్ట్ గా ఫోకస్ చేస్తుంది. deep trench isolation కూడా ఉంది. ఇది ఓవర్ ఆల్ గా ఇమేజ్ లో noise తీయటానికి. 4K వీడియో రికార్డింగ్ ఉంది. ఫ్రంట్ కెమేరా 5MP కు అప్ గ్రేడ్ అయ్యింది.
ఫోటో తీసేటప్పుడు లాంగ్ ప్రెస్ చేసి capture చేస్తే ఇమేజ్ లైవ్ వీడియో లా కన్వర్ట్ అవుతుంది. ఇది 3D టచ్ ఫోటోగ్రఫీ అని చెబుతుంది ఆపిల్. కెమేరా ఫ్లాష్ కు రెటినా ట్యాగ్ కూడా ఉంది. ఇది true టోన్ ఫ్లాష్ కన్నా బెటర్ గా ఉంటుంది అని ఆపిల్ నోట్స్.
iphone 6S లో 23 LTE బాండ్స్ డబుల్ స్పీడ్ తో వర్క్ అవుతాయి. దీనికి కుడా ఆండ్రాయిడ్ ఫోనుల్లో ఉండే గొరిల్లా గ్లాస్ వలె కొత్త 7000 సిరిస్ గ్లాస్ ఉంది. దీనిలో అల్యూమినియం యూస్ చేసినట్లు చెబుతుంది ఆపిల్.
రెండు సంవత్సరాల కాంట్రాక్ట్ తో U.S రీజియన్ లో 16gb వెర్షన్ iPhone 6S ధర 13,500, 16gb iPhone 6S ప్లస్ ధర 20,000 రూ. కాంట్రాక్ట్ లేకుండా 6S – 16gb US లో 43,000 రూ అండ్ 6S ప్లస్ 16gb స్టోరేజ్ వేరియంట్ 50,000 రూ . సెప్టెంబర్ 16 న iOS 9 విడుదల అవుతుంది. సెప్టెంబర్ 25 కొత్త iPhone 6S రిలీజ్ అవుతుంది.
iPhone 6S స్పెసిఫికేషన్స్
4.7 in 750 x 1334 పిక్సెల్స్ IPS 326 PPi Ion-strengthened glass, oleophobic coating అండ్ 3D టచ్ డిస్ప్లే, ఆపిల్ A9 చిప్ సెట్ ప్రొసెసర్, 12MP 2160P డ్యూయల్ led ఆటో ఫోకస్ రేర్ కెమేరా, 4K రిసల్యుషణ్ వీడియో రికార్డింగ్, 5MP ఫ్రంట్ కెమేరా, బ్లూ టూత్ 4.1 NFC, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 1810 mah బ్యాటరీ.
6S ప్లస్ కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ తో వస్తుంది. కాని డిస్ప్లే 1080×1920 పిక్సెల్స్ తో 5.5 in డిస్ప్లే సైజ్ లో వస్తుంది. అంటే రెండు మోడల్స్ లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన మోడల్స్ వలె ఉన్నాయి డిస్ప్లే సైజ్ విషయంలో.
iPhone 6S రెండు మోడల్స్ తో పాటు ఆపిల్ టీవీ, ipad pro, న్యూ ఆపిల్ వాచ్ కుడా లాంచ్ చేసిందికంపెని ఇదే ఈవెంట్ లో.