చాలా మంది బెస్ట్ బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్ ఏంటి అని అడుగుతున్నారు. బెస్ట్ స్మార్ట్ ఫోన్ అనేది మీ అవసరాలను బట్టి ఉంటుంది. మీ అవసరాలు ఏంటో మేము అంచనా వేయటం కష్టం. ఇక మీదట ఎవరి నైనా ఆ question వేసే ముందు మీ uses ఏంటో కూడా చెప్పండి వాళ్లకు. అప్పుడే మీకు మంచి స్మార్ట్ ఫోన్ సజెషన్ చేయగలరు.
ఈ స్మార్ట్ ఫోన్స్ కొన్ని ప్లస్ కొన్ని మైనస్ లతో వస్తాయి. మైనస్ ల్లో ఉన్నవి మీకు ఇంపార్టెంట్ కాకపోతే ఆ ఫోన్ ను తీసుకోవచ్చు, లేదు మీకు కావలసినది నెగటివ్స్ లో ఉంటే వేరే ఆల్టర్నేటివ్ ఫోన్ కన్సిడర్ చేయండి. ఇలా చేస్తే ఏ ఫోన్ తీసుకోవాలి అనే కన్ఫ్యూస్ ఉండదు. మేము ఇక్కడ కన్సిడర్ చేయవలసిన ఫోన్స్ ను మాత్రమే తెలియజేస్తున్నాము. కొన్నింటికి రివ్యూస్ కూడా ఉన్నాయి.
5,000 బడ్జెట్ లో కొందామని అనుకుంటున్నారా?
4,999 రూ లకు యు Yunique స్మార్ట్ ఫోన్ బాగుంది. ఆ ప్రైస్ కు అది అన్నీ న్యాయం గా ఇస్తుంది అని చెప్పాలి. ఒక్క బ్యాటరీ విషయంలో మాత్రం కొంచెం బాగా లేదు. దీని కంప్లీట్ రివ్యూ ఈ లింక్ లో చూడండి. బ్యాటరీ పెద్ద issue కాదు అనుకుంటే, ఇంకో ఆలోచన లేకుండా దీనిని తీసుకోవచ్చు.
ఇదే బడ్జెట్ లో దీనికి ఆల్టర్నేటివ్ Phicomm ఎనేర్జీ 653 4G ఫోన్ ఉంది. 4,999 రూ ఈ లింక్ లో అమెజాన్ లో సేల్ అవుతుంది. ఒకసారి చూడండి. స్పెక్స్ అన్నీ బాగున్నాయి ప్రైస్ తో కన్సిడర్ చేస్తే. కాని బ్రాండ్ పై నమ్మకం లేదు.
7,000 బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్ సజెషన్..
మరొక ఆలోచన లేకుండా.. ఈజీగా xiaomi మీ 2 ప్రైమ్ తీసుకోవచ్చు. బెస్ట్ డిస్ప్లే, ర్యామ్ మేనేజ్మెంట్, మంచి కెమెరా, 2gb ర్యామ్. డీసెంట్ లుక్స్. 500 రూ తేడా తో 7,500 లకు లెనోవో a6000 ప్లస్ ఉంది.
కాని దీని డిస్ప్లే Mi 2 ప్రైమ్ అంత రిచ్ గా ఉండదు. కేవలం దీనిలో 5in స్క్రీన్ ఉంది అనే పాయింట్ ఒకటే ప్లస్ అని చెప్పాలి. లెనోవో A6000 ప్లస్ రివ్యూ ఈ లింక్ లో ఉంది, చూడండి.
బ్రాండ్ తో మాకు పెద్దగ ఇబ్బంది లేదు.. స్పెసిఫికేషన్స్ ఉంటే చాలు..స్పెక్స్ మాత్రమే నమ్ముతాము అనుకునే వారికీ 6,600 రూ లకు ఈ లింక్ లో కూల్ ప్యాడ్ Dazen 1 అండ్ ఈ లింక్ లో 6,999 రూ లకు InFocus M350 ఉన్నాయి.
వీటికి రెడ్మి 2 ప్రైమ్ కు కేవలం బ్యాటరీ ఒక్కటే తేడా. వీటిలో 500 mah ఎక్కువ వస్తుంది. అంటే 2,500 mah బ్యాటరీ ఉన్నాయి ఈ రెండింటిలో.