MIUI 8 లేటెస్ట్ OS ఏ ఫోనులకు వచ్చింది. ఏలా ఇంస్టాల్ చేసుకోవాలి. OTA అప్ డేట్ రాని వారు ఇలా ఇంస్టాల్ చేసుకోగలరు.
MIUI 8 లేటెస్ట్ అప్ డేట్ రిలీజ్ అయ్యింది. కొంతమందికి ఆల్రెడీ OTA అప్ డేట్ వచ్చింది ఫోన్ లో. కొంతమందికి ఇంకా రాలేదు. సో OTA వచ్చే వరకూ ఉండలేని వారికి ఇక్కడ MIUI 8 ను ఎలా ఇంస్టాల్ చేసుకోవాలో తెలియజేస్తున్నాను.
MIUI 8 అప్ డేట్ సపోర్ట్ చేసే ఫోనులు :
Redmi 1S, Redmi 2, Redmi 2 Prime, Redmi Note 3 Qualcomm స్నాప్ డ్రాగన్ ప్రొసెసర్ వేరియంట్ ఫోన్, Redmi Note 3 Special Edition, Redmi Note 2, Redmi Note 3G, Redmi Note 4G, Redmi Note Prime, Redmi 3, Redmi 3S/Prime, Mi 2/2S, Mi 3, Mi 4, Mi 4i, Mi 5, Mi Note, Mi Max 32GB
పైన లిస్టు లో మీ ఫోన్ లేకపోతే ఈ లింక్ లోకి వెళ్లి మీ ఫోన్ సెలెక్ట్ చేసి MIUI 8 అప్ డేట్ కొరకు చెక్ చేయగలరు.
మీ ఫోనులో ఇంకా OTA అప్ డేట్ రాలేదు. ఏమి చేయాలి?
OTA రాకపోతే ఈ లింక్ లోకి వెళ్లి మీ ఫోన్ సెలెక్ట్ చేస్తే మీరు MIUI 8 డౌన్లోడ్ లింక్స్ చూడగలరు. లింక్ లోకి వెళ్ళిన తరువాత మీకు Stable ROM>Full ROM pack అండ్ Developer ROM>Full ROM pack అని రెండు రకాల డౌన్లోడ్స్ కనిపిస్తాయి.
మీరు మీ ఫోన్ లో ఎప్పుడూ ఎటువంటి CUSTOM ROMS చేయకపోతే Stable ROM>Full ROM pack menu క్రింద ఉన్న Stable ROM డౌన్లోడ్ చేసుకోవాలి.
పైన చెప్పినట్లు నా ఫోన్ కు సంబంధించిన MIUI 8 ఫైల్ ను డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు ఏమి చేయాలి?
1. డౌన్లోడ్ చేసిన ఫైల్ ను మీ ఫోన్ లోకి transfer చేయాలి.
2. ఇప్పుడు ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి క్రిందకు స్క్రోల్ చేస్తే లాస్ట్ లో About Phone అనే సెట్టింగ్ ఉంటుంది. దాని పై టాప్ చేస్తే మరలా అడుగున మీకు system updates అని కనిపిస్తుంది.
3. Next మీ ఫోన్ లో ఆల్రెడీ ఇంస్టాల్ అయ్యి ఉన్న MIUI వెర్షన్ నంబర్ తో ఒక బ్యానర్ ఉంటుంది. దాని పైన రైట్ సైడ్ 3 డాట్స్ మెను పై టాప్ చేయండి.
4. ఇప్పుడు మీకు choose update package అనే ఆప్షన్ ఉంటుంది. దాని పై టాప్ చేసి మీరు ముందు సేవ్ చేసిన ఫైల్ ఎక్కడ ఉందో అక్కడకు నేవిగేట్ చేసి ఫైల్ ను సెలెక్ట్ చేయండి.
5. అంతే! ఇక ఫోన్ అప్ డేట్ ప్రోసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ లో ఫోన్ రీస్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సుమారు 20 నిముషాలు లోపు మీ ఫోన్ MIUI 8 తో అప్ డేట్ అవుతుంది.
అయితే ఇలా అప్ డేట్ చేసుకుంటే, future లో కంపెని ఇచ్చే అప్ డేట్స్ OTA ద్వారా అప్ డేట్ చేసుకోగలమా?
Yes. ఫ్యూచర్ లో కంపెని ఎటువంటి OTA అప్ డేట్ రిలీజ్ చేసినా, మీకు అప్ డేట్ వస్తుంది.
NOTE: ఈ ప్రాసెస్ అంతా అఫీషియల్, కంపెని తెలిపిన మెథడ్, సో వారేంటి వంటి విషయాలు అన్నీ safe.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile