భారతదేశం అన్ని వర్గాల ప్రజలతో కూడిన చాలా విభిన్నమైన మార్కెట్. అందుకని, స్మార్ట్‌ఫోన్ లో వారు కోరుకునే విషయాలకు వస్తే ప్రతి ఒక్కరికి వేర్వేరు అవసరాలు మరియు రిక్వయిర్మెంట్స్ ఉంటాయి. వారి అవసరాలను తీర్చడానికి, OPPO వంటి స్మార్ట్ ఫోన్ తయారీదారులు అనేకమైన డివైజెస్ ను అందిస్తున్నారు. నిజానికి, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ లో చాలా ఫీచర్ లను అందించడం చాలా సులభం అయితే, బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో అలా చేయడం కష్టం.
అయితే, తన A- సిరీస్ స్మార్ట్‌ఫోన్ లతో, టైట్ బడ్జెట్ లో ఉన్నవారు వారి ఫోన్ లలో ఎక్కువగా పొందడండానికి సహాయపడేలా మరియు ముఖ్యమైన ఫీచర్లను కోల్పోకుండా చూసుకోవడానికి OPPO తన వంతు కృషి చేసింది. మెరుగైన కనెక్టివిటీ, స్మూత్ డిస్ప్లే, పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ మరియు మరిన్నింటి కోసం 5 జి వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. చాలా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ లలో సాధారణ పోటీగా ఉండే ఫీచర్లను అందించడానికి ఈ సిరీస్ ప్రసిద్ది చెందింది, కానీ మరింత సరసమైన ధర వద్ద. ఈ దీర్ఘకాల శ్రేణిలో OPPO A74 5G సరికొత్త స్మార్ట్‌ఫోన్ మరియు ఇది OPPO A- సిరీస్ యొక్క వాగ్దానాలకు సరిపోలడం మాత్రమే కాదు, వీటి ఎల్లలను మరింత ఎక్కువగా సెట్ చేస్తుంది.
OPPO A74 5G ఫోన్ 2400x1080p రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల FHD + పంచ్-హోల్ డిస్ప్లేని ప్యాక్ చేస్తుంది. అయితే, ఈ డిస్ప్లే యొక్క గుర్తించదగిన ఫీచర్లలో ఒకటి ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz యొక్క టచ్ శాంప్లింగ్ రేటును అందిస్తుంది. ఈ అధిక రిఫ్రెష్ రేట్ మీరు ఫోన్ చుట్టూ స్వైప్ చేస్తున్నప్పుడు సున్నితమైన యానిమేషన్లు మరియు ట్రాన్సిషన్ లకు సహాయపడుతుంది. టచ్ ఆదేశాలను వేగంగా నమోదు చేయగలిగలుగుతుంది కాబట్టి ఈ ఫోన్ గేమింగ్ చేసేటప్పుడు అధిక టచ్ శాంప్లింగ్ రేట్ సహాయపడుతుంది. కాబట్టి గేమింగ్ చేసేటప్పుడు, అధిక రిఫ్రెష్ రేటు సున్నితమైన గేమ్‌ప్లేను నిర్ధారించడానికి సహాయపడుతుంది ఎందుకంటే ఇది అధిక ఫ్రేమ్‌రేట్ ను అనుమతిస్తుంది. PPF లేదా రేసింగ్ గేమ్స్ వంటి వేగవంతమైన ఆటలలో ఇది చాలా సులభమైంది. మరోవైపు, వేగవంతమైన టచ్ శాంప్లింగ్ రేటు నెమ్మదిగా టచ్ నమూనా రేటు ఉన్నవారి కంటే మీరు స్పీడ్ గా తాకినట్లు నమోదు చేస్తుంది. ఇది ఆన్‌లైన్ లో గేమింగ్ సమయంలో ఆటగాళ్లకు కీలకమైన పోటీతత్వాన్ని ఇస్తుంది.
పెద్ద స్క్రీన్ ఎక్కువగా చూసేవారికి సహాయపడాలి ఎందుకంటే ఇది వారికి పెద్ద స్క్రీన్ తో వీడియో చూసే అనుభవాన్ని ఇస్తుంది. వాస్తవానికి, ఈ ఫోన్ నెట్‌ఫ్లిక్స్ HD మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో HD సర్టిఫికేషన్ తో వస్తుంది, ఇది ఆ ప్లాట్‌ఫామ్ లలో మంచి వీడియో చూసే అనుభవాన్ని నిర్ధారించాలి. మీరు మీ కళ్ళకు హాని కలిగించలేదని కూడా నిర్ధారించడానికి, OPPO A74 5G AI బ్యాక్‌లైట్‌తో వస్తుంది, ఇది రోజంతా ఫోన్ యొక్క బ్యాక్‌లైట్ సెట్టింగులను ఆటొమ్యాటిగ్గా సర్దుబాటు చేస్తుంది. రోజంతా AI ఐ కంఫర్ట్ ను అందించడానికి వినియోగదారు వివిధ లైటింగ్ పరిస్థితులలో బ్రైట్నెస్ సెట్టింగ్ ను మాన్యువల్ గా ఎలా సర్దుబాటు చెయ్యాలో కూడా ఇది ట్రాక్ చేస్తుంది. కాబట్టి మీరు మీ కళ్ళకు హాని కలిగించే విషయం గురించి చింతించకుండా మీకు ఇష్టమైన టీవీ సిరీస్ లేదా సినిమాలను ఎక్కువగా చూడగలుగుతారు.
OPPO A74 5G యొక్క మరొక ముఖ్య అంశం దాని పెద్ద 5000mAh బ్యాటరీ. ఈ బ్యాటరీ సామర్థ్యం రోజంతా నిలబడటానికి సరిపోతుంది. వాస్తవానికి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఒకే ఛార్జీతో ఒకటిన్నర రోజుల ఉపయోగం కోసం సరిపోతుంది అని OPPO పేర్కొంది. దీని అర్థం వినియోగదారులు ఛార్జింగ్ కోసం తక్కువ సమయం తీసుకుంటుంది మరియు ఎక్కువ సమయం సాగుతుంది.
ప్రయాణంలో దాదాపు స్థిరంగా ఉన్నవారికి ఈ ఫీచర్ నిజంగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే బ్యాటరీ అయిపోతుందనే ఆందోళన లేకుండా వినియోగదారులు తమ పనిని కొనసాగించగలరని ఇది నిర్ధారిస్తుంది. ఇది మీకు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు మీరు ఛార్జింగ్ స్పాట్ కోసం వెతకాల్సిన పని గురించి చింతించాల్సిన అవసరం లేదు.
ఇంత పెద్ద బ్యాటరీతో, ఫోన్ ఛార్జ్ చేయడానికి చాలా సమయం పడుతుందని పొరబడినందుకు క్షమించబడతారు. ఎందుకంటే, ఇప్పుడు మేము OPPO దాని గురించే మాట్లాడబోతున్నాం. ఫాస్ట్ ఛార్జింగ్ రంగంలో సంస్థ మార్గదర్శకంగా ఉంది. కాబట్టి, OPPO A74 5G ఫాస్ట్ ఛార్జింగ్ యొక్క వెర్షన్‌తో వస్తుంది. ఈ ఫోన్ 18W ఫ్లాష్ ఛార్జింగ్ ను అందిస్తుంది, ఇది 60 నిమిషాల్లో బ్యాటరీని 68% ఛార్జ్ చేస్తుంది. వేగంగా ఛార్జింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి.
ఛార్జింగ్ వైపు OPPO యొక్క ఆలోచన ప్రక్రియను సూపర్ నైట్‌టైమ్ స్టాండ్‌బై ఫీచర్ లో కూడా చూడవచ్చు. ఈ ఫీచర్ తో, OPPO A74 5G వినియోగదారు యొక్క నిద్రవేళ దినచర్యను నేర్చుకోవచ్చు మరియు ఫోన్ యొక్క బ్యాటరీ వినియోగాన్ని ఆటొమ్యాటిగ్గా ఆప్టిమైజ్ చేస్తుంది. ఉదాహరణకు, మీరు నిద్రపోతున్నారని ఫోన్ కు తెలిసినప్పుడు, ఫోన్ ఉపయోగించబడదని అర్థం అవుతుంది. అందుకని, ఇది అవసరం లేని వనరులను తగ్గించడం ప్రారంభిస్తుంది. OPPO కి మాత్రమే విషయం బాగా తెలుసు, అందుకే OPPO A74 5G యొక్క బ్యాటరీ రాత్రి 11:00 మరియు 07:00 మధ్య 2% మాత్రమే తగ్గుతుంది. దీని అర్థం మీరు రాత్రి సమయంలో మీ ఫోన్‌ను ప్లగ్ చేయడం మర్చిపోయినా, మీరు మేల్కొన్నప్పుడు మీ బ్యాటరీ డ్రైన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
OPPO A74 5G యొక్క హార్ట్ స్థానంలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480 5G ప్లాట్‌ఫాం ఉంది. పేరు సూచించినట్లుగా, ఈ చిప్‌సెట్ స్మార్ట్‌ఫోన్ ను 5G కి మద్దతు ఇవ్వడానికి అనుమతిస్తుంది. అంటే టైట్ బడ్జెట్ ఉన్నవారు కూడా 5 జి యొక్క పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోగలుగుతారు. 5 జి నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయినప్పుడు ఈ ఫోన్ గిగాబిట్ వేగం మరియు సూపర్ లో లెటెన్సీ అందించగలగాలి. ఇది సూపర్ ఫాస్ట్ డౌన్‌లోడ్ వేగం కంటే ఎక్కువ. 5 జి గేమింగ్ నుండి IoT వరకు ప్రతిదీ ప్రభావితం చేస్తుంది. ఒక గేమర్ గా, ఆన్‌లైన్ గేమింగ్ విషయానికి వస్తే చాలా తక్కువ జాప్యం అనేది చాలా తేడాను కలిగిస్తుంది. దీనితో మీ ఆదేశాలు ఆటలో వేగంగా ప్రతిబింబిస్తాయి, తద్వారా మీకు ప్రత్యర్థులపై ఆధిపత్యం ఉంటుంది.
భారతదేశంలో 5 జి-రెడీ ఫోన్ ను కలిగి ఉండటం వలన, ఈ టెక్నలాజి అందుబాటులోకి వచ్చిన వెంటనే మీరు దాన్ని ఎక్కువగా ఉపయోగించుకోగలుగుతారు. క్రమంగా చెప్పాలంటే, ఇది భవిష్యత్ ప్రూఫింగ్ ను నిర్ధారిస్తుంది. 5G సేవలను ఆస్వాదించడానికి వినియోగదారులు బయటకు వెళ్లి మరొక స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయనవసరం లేదని దీని అర్థం.
సరసమైన ధర ట్యాగ్ తో కూడా, OPPO A74 5G ట్రిపుల్ రియర్ సెటప్ తో వస్తుంది. ఇందులో 48MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ కెమెరా, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాటింగ్ కోసం, ఈ ఫోన్ 8MP సెల్ఫీ యూనిట్‌తో వస్తుంది, ఇది డిస్ప్లే మూలలో ఉన్న పంచ్-హోల్ లోపల ఉంచబడుతుంది. ట్రిపుల్ కెమెరా సెటప్‌తో కనిపించే ఫ్లెక్సిబిలిటీ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, ఇది షాట్ తీసుకునేటప్పుడు వినియోగదారులకు మరిన్ని ఎంపికలను ఇస్తుంది. ఉదాహరణకు, క్లోజ్ అప్ షాట్లు తీయాలనుకున్నప్పుడు వారు మ్యాక్రో కెమెరాకు మారవచ్చు మరియు వివరణాత్మక ఫోటోలను పొందవచ్చు, తరువాత వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయవచ్చు.
అన్ని OPPO స్మార్ట్ ఫోన్ల మాదిరిగానే, OPPO A74 5G కెమెరా-సెంట్రిక్ ఫీచర్లతో AI సీన్ ఎన్‌హాన్స్‌మెంట్ 2.0 వంటి వాటితో వస్తుంది. ఇది షాట్ లోని దృశ్యాలను తెలివిగా గుర్తించడానికి AI ని ఉపయోగిస్తుంది, ఆపై చిత్ర నాణ్యతను మెరుగుపరచడానికి కలర్ శాచురేషన్ మరియు కాంట్రాస్ట్ రేషియోని ఆటొమ్యాటిగ్గా సర్దుబాటు చేస్తుంది. అల్ట్రా క్లియర్ 108MP ఇమేజ్ స్ఫుటమైన వివరాలను అందించే అధిక రిజల్యూషన్ 108 ఎంపి చిత్రాన్ని తీయడానికి 48 ఎంపి యూనిట్ ను ఉపయోగిస్తుంది. వాస్తవానికి, ఇది OPPO ఫోన్ కాబట్టి, మీకు AI బ్యూటిఫికేషన్ 2.0 కూడా లభిస్తుంది. ఈ ఫీచర్ ప్రజలు వారు సహజంగా కనిపించేలా రూపొందించబడింది. ఈ ఫీచర్ ఆటొమ్యాటిగ్గా మచ్చలు వంటి లోపాలను గుర్తించి తొలగిస్తుంది, అదే సమయంలో చర్మం యొక్క ఆకృతిని మెరుగుపరుస్తుంది మరియు మేకప్ వేస్తుంది. ఫలితంగా చిత్రం సహజంగా కనబడేలా పరిసర లైటింగ్ కు అనుగుణంగా ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మీరు మీకు కావలసినన్నిసెల్ఫీలు మరియు పిక్చెర్స్ తీయవచ్చు మరియు మీరు ఎదుర్కొనే ఏకైక సమస్య సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడాన్ని ఎంచుకోవడం.
OPPO ఫోన్ ల విషయానికి వస్తే డిజైన్ ఎల్లప్పుడూ కీలకమైన అంశం. ఈ ఫోన్ ధర పాయింట్ తో సంబంధం లేకుండా ఇది నిజం. OPPO A74 5G భిన్నంగా లేదు. ఫోన్ సరళంగా, ఇంకా సొగసైనదిగా కనిపించే కర్వ్డ్ 3D ఆకారాన్ని కలిగి ఉంది. ఈ ఫోన్ మూలలు పెద్దగా లేనందున కర్వ్డ్ అంచులు ఫోన్‌ను సులభంగా పట్టుకునేల చేస్తాయి.
OPPO A74 5G యొక్క వెనుక ప్యానెల్ ‘Warm Tech’ డిజైన్ కాన్సెప్ట్‌ను ఉపయోగిస్తుంది. ఇది నిగనిగలాడే, గ్లేర్ ఫ్రీ రూపాన్ని అందించేలా రూపొందించబడింది. మీరు ఫోన్ ను చూస్తే, ,కలర్ గ్రేడియంట్ ఫోన్ యొక్క ఒక చివర నుండి మరొక వైపుకు రంగులను మారుస్తుంది. వెనుక ప్యానెల్ గురించి ఇంకా మాట్లాడితే, OPPO A74 5G వెనుక కవర్ లో పారదర్శక మిశ్రమాన్ని కలిగి ఉంది. ఇది గాజుతో పోల్చదగినదని మరియు పగిలిపోవడానికి మరియు పగుళ్లకు నిరోధకతను కలిగి ఉందని OPPO పేర్కొంది. దీని అర్థం వెనుక ప్యానెల్ యొక్క రంగురంగుల రూపకల్పన కాలక్రమేణా దెబ్బతినకూడదని అర్ధం.
ప్రతి ఒక్కరూ చూడగలిగినట్లుగా, OPPO A74 5G దాని ధర పాయింట్ కోసం చాలా ఆఫర్లను కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్, పెద్ద 5000mAh బ్యాటరీ, 18W ఫ్లాష్ ఛార్జింగ్ మరియు మరెన్నో వంటి ఇతర ఫీచర్లను అందించే 5G- రెడీ స్మార్ట్ ఫోన్ యొక్క ఎంపికను ఫోన్ మీదే ఇస్తుంది. అందుకని, సాపేక్షంగా పాకెట్-ఫ్రెండ్లీ ధర వద్ద ఫీచర్-రిచ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నవారికి ఇది సమర్ధవంతమైన ఎంపిక. ఫ్యూచర్-రిచ్ ఉన్న పరికరం కోసం వెతుకుతున్న OPPO అభిమాని యొక్క కార్డ్ లలో ఇది ఖచ్చితంగా ఉండాలి మరియు ఎక్కువ కాలం వారికి తోడుగా ఉంటుంది.
OPPO A74 5G (6GB + 128GB) వేరియంట్ ధర 17,990 రూపాయలు మరియు ఏప్రిల్ 26 నుండి మెయిన్లైన్ రిటైలర్ అవుట్లెట్లు మరియు అమెజాన్ లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ కస్టమర్ల కోసం అనేక ఆఫర్ లతో అందుబాటులో ఉంటుంది.
[బ్రాండ్ స్టోరీ]