ఇది oneplus వంటి కంపెని నుండి expect చేసే మోడల్ కాదు. ఇప్పటి వరుకు రిలీజ్ అయిన oneplus 1 అండ్ 2 ఫోనుల ద్వారా కంపెని రియల్ టైమ్ స్పెసిఫికేషన్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అని స్పష్టం చేసింది.
ఇప్పుడు మాత్రం oneplus x చూస్తే, లుక్స్ కే ఎక్కువ ప్రాదాన్యత ఇస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ కొత్త సిరిస్ లైన్ వలన కొన్ని ప్రశ్నలు కూడా వస్తాయి. oneplus x రెండు వేరియంట్స్ లో వస్తుంది. ఒకటి Onyx(గ్లాస్ బ్యాక్) – 16,999 రూ, రెండవది – Ceramic(ceramic బ్యాక్ ప్యానల్) – 22,999 రూ.
కేవలం ఎడ్జెస్ లోని tapering అండ్ గ్రేయిష్ కలర్ మినహా ceramic మోడల్ కూడా గ్లాస్ బ్యాక్ వేరియంట్ లానే ఉంది. oneplus x లో సన్ లైట్ లో డిస్ప్లే చాలా రిఫ్లేక్టివ్ గా ఉంది. మన ఫేస్ ఎక్కువ కనబడుతుంది డిస్ప్లే కంటెంట్ కన్నా.
ఓవర్ ఆల్ ఫోన్ సైజ్ మాత్రం కాంపాక్ట్ గా ఉంది. చేతిలో కరెక్ట్ గా పడుతుంది. 5in స్క్రీన్ అండ్ 138 గ్రా బరువు కారణంగా బాగుంది ఫీల్. చుట్టూ ఉన్న మెటాలిక్ ఫ్రేమింగ్ మంచి ఫీల్ ఇస్తుంది. గుడ్ లుక్స్. కంపెని కూడా ఈ మోడల్ డిజైన్ కోసం అని చెబుతుంది.
స్నాప్ డ్రాగన్ 801 SoC – 3gb ర్యామ్, 13MP/8MP కేమేరాస్ బ్యాక్ అండ్ ఫ్రంట్ స్పెక్స్ తో వస్తుంది. కానీ ఈ ప్రాసెసర్ పాతది. ఆండ్రాయిడ్ లాలిపాప్ తో వచ్చే 64 బిట్ కూడా సపోర్ట్ చేయదు.
13MP కెమేరా కూడా డీసెంట్ గా ఉంది కాని Low అండ్ Uneven లైటింగ్ కండిషన్స్ లో బాగా పెర్ఫారం చేయటం లేదు. ఈ మోడల్ మేజర్ ప్రాబ్లెం ఏంటంటే, అటూ కాదు ఇటూ కాదు అన్నట్టు ఉంది. మిక్సడ్ ఒపీనియన్స్ తీసుకు వస్తుంది.
ఒక వైపు మంచి కాంపాక్ట్ ఫీల్ ఇస్తుంది అన్నీ మొబైల్స్ కన్నా, కాని వెనుక ఫింగర్ ప్రింట్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే స్నాప్ డ్రాగన్ 801 ప్రాసెసర్ కూడా మంచిది, కాని ఇది 64 బిట్ కేపబిలిటీ కలిగి ఉండదు.
64 బిట్ architecture ప్రొసెసర్ యాప్స్ ను బాగా పెర్ఫరం చేయిస్తుంది. అలాగే 64 బిట్ లాలిపాప్ ఆండ్రాయిడ్ వెర్షన్ కోసం తయారు చేయబడింది. కేమెరాస్ కూడా బాగున్నాయి కాని oneplus బ్రాండ్ వాల్యూ కెమేరా అవుట్ పుట్ ఇవటం లేదు.
ceramic వేరియంట్ oneplus x కొనటం కూడా మంచి ఐడియా కాదు. 2000 రూ ఎక్కువ పెడితే oneplus 2 ఫోన్ వస్తుంది. పైగా హానర్ 7 అండ్ లెనోవో vibe షాట్ వంటి మోడల్స్ ఇదే ప్రైస్ ర్యాంజ్ లో ఉన్నాయి.
oneplus x ఫోన్ ఎవరు కొనాలి?
1. మీరు కాంపాక్ట్ సైజ్ లో ఉండే ఫోనులు ఇష్ట పడతారా? అయితే ఈ ప్రైస్ లో ఉన్న అతి కాంపాక్ట్ మోడల్ ఇదే.
2. oneplus 2 బాగా ఎక్కువ బడ్జెట్ అనిపిస్తే Oynx వేరియంట్ oneplus x మంచి ఆప్షన్.