గూగల్ పిక్సెల్, LeEco pro 3, ఆసుస్ జెన్ ఫోన్ 3 డీలక్స్ తరువాత oneplus కంపెని కూడా లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 821 ప్రొసెసర్ ను యాడ్ చేసి మార్కెట్ లో కొత్త మోడల్ రిలీజ్ చేసింది Oneplus 3T(Turbo) పేరుతో. సో క్రింద స్నాప్ డ్రాగన్ 821 ప్రొసెసర్ తో వచ్చే ఫోనులను కంపేర్ చేయటం జరిగింది. చూడగలరు.
డిస్ప్లే అండ్ డిజైన్ విషయంలో అన్నీ unibody మెటల్ బాడీ కలిగి ఉన్నాయి. డిజైన్ విషయంలో oneplus లో అదనంగా slider బటన్ ఉంది అని చెప్పాలి లెఫ్ట్ సైడ్. ఆసుస్ వీటన్నిటి కన్నా wide గా ఉంది. ఇందుకు కారణం 5.7 in స్క్రీన్.
డిస్ప్లే విషయంలో Le pro 3 (IPS LCD panel) మినహా అన్నీ అమోలేడ్ panels తో వస్తున్నాయి. oneplus 3T లో ఫుల్ HD amoled, ఆసుస్ లో FHD సూపర్ అమోలేడ్ అండ్ పిక్సెల్ లో Quad HD Amoled panel.
పెర్ఫార్మెన్స్ లో పిక్సెల్ లేటెస్ట్ ప్రొసెసర్ తో పాటు అదనంగా ఆండ్రాయిడ్ 7.1 లేటెస్ట్ OS కూడా కలిగి ఉంది. సో మిగిలిన వాటి కన్నా మరింత స్మూత్ పెర్ఫార్మన్స్ ఉంటుంది అని చెప్పాలి. మరో వైపు పిక్సెల్ లో 4GB రామ్ ఉంటే, 3T, ఆసుస్ అండ్ Le pro 3 లో 6GB రామ్స్ ఉన్నాయి. బ్యాటరీ విషయంలో లో Le pro 3 అధిక బ్యాటరీ కలిగి ఉంది.
స్టోరేజ్ అండ్ ప్రైస్ – le ప్రో 3 మరియు పిక్సెల్ 32GB స్టోరేజ్ లతో మొదలవ్వగా, oneplus 64GB తో మొదలవుతుంది. ఆసుస్ అయితే ఏకంగా కేవలం 256GB స్టోరేజ్ వేరియంట్ లోనే వస్తుంది. 3T ప్రైస్ సుమారు 30 వేలు ఉండగా ఆసుస్ 62 వేలు ఉంది. పిక్సెల్ 67వేలు ఉంది. ఇదే highest.